S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

ఎ. సూర్య, సికిందరాబాద్
అర్హులు కాని ఆర్గనైజర్లకు, మహాకవుల పేరిట అవార్డులు ఇవ్వడం సమంజసమేనా? ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి ఆర్థిక లాభాలు దక్కుతాయేమో కాని విలువ శూన్యం. ఏమంటారు?
అసలు ఆ అవార్డులకు విలువ ఉంటే కదా?

డొక్కా భుజంగనాథుడు, వక్కలంక అగ్రహారం
‘శతమానం భవతి’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి’ అని చిరంజీవి అన్నాడుట. తను మాత్రం ‘మెకానిక్ అల్లుడు, ఖైదీ నెం.150’లు చేస్తూ వుంటాడు. ఏమనాలి అతడిని?
భగత్‌సింగ్ మళ్లీ పుట్టాలి... కాని మన ఇంట్లో కాదు - అనుకునే వాళ్లం మనం. మీరన్న ఆయనా మనలో ఒకడే.

శంకర్, కోనసీమ
1983 నాటి పరిస్థితులూ, నందమూరి తారక రామారావుకు ప్రేక్షకులలోనే కాక, ప్రజలలో వున్న ఆకర్షణా తెలుగుదేశం విజయానికి కారణం అయ్యంది. అలానే నేనూ అనుకున్న చిరంజీవి బోర్లా పడ్డాడు. ఇప్పుడు ఒకే ఒక ఆర్మీ అయన పవన్ కల్యాణ్ కూడా రామారావుని అనుకుంటున్నారా?
బహుశా అంతకన్నా ఎక్కువే అనుకుంటుండొచ్చు.

సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
మహిళలపై ఎన్ని వేధింపులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు దేశంలో పెరిగిపోతున్నా చీమకుట్టినట్లయనా లేదు పాలకులకు.
వాళ్లకు మండగబ్బలు కరిచినట్టు అనిపించేదాకా అంతే.

వై.వి.శివకాంత్, అచ్యుతాపురం
సామాన్య ప్రజానీకాన్ని అష్టకష్టాలలోకి నెట్టి పాత నోట్లు రద్దు చేసి నల్లధనం రాబట్టగలిగిందా? ప్రభుత్వానికి ఏమైనా లాభం కలిగిందా?
అది మాత్రం అడగొద్దు.

అయనం రఘురామారావు, ఖమ్మం
వైద్య ప్రమాణాల పెంపు పేరుతో వైద్యవృత్తిని నిర్వహించే డాక్టర్లకు ఐదేళ్లకొకసారి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచన ఎంతవరకు సబబు? అసలు వైద్యవృత్తి కాలపరిమితి ఎక్కువ అయపోయన వారికి తిరిగి టాలెంట్ టెస్ట్‌లాగా పరీక్ష నిర్వహించడం భావ్యమేనా?
కాదు.

కె.హెచ్. శివాజీరావు, హైదరాబాద్
విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఉండాలని ఉంది. ఇది విశాఖ నుండి ప్రారంభం కావాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. విశాఖ డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలో ఎక్కువ ధనం ఆర్జించేది. అందుకే ఒడిశావారు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి దానికీ ఒత్తిడి తెస్తేనే పని జరుగుతోంది. మీరేమంటారు?
ఆ ఒత్తిడి తేవటం మనకు చేతకాదు. మన ప్రజాప్రతినిధులకు ఇలాంటివి పట్టవు. అందుకే విశాఖకు ఎడతెగని అన్యాయం.

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
ఈమధ్య టీవీలో ప్రవచనాలు చెప్పే ఒక ప్రముఖుడు ఒక జాతీయాన్ని / సామెతను సందర్భానుసారంగా ఉపయోగిస్తే దాన్ని పట్టుకుని నానా యాగీ చేయడం ఎంతవరకు న్యాయం? లౌకిక రాజ్యం అంటూనే హిందూమతం పైనే దాడులెందుకు?
దాడులు చేసేవారు కూడా హిందువులేనని గమనించాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
నోట్ల రద్దు విషయంలో మోదీని కాంగ్రెసు చిదంబరం తప్పుపట్టడంలో ఆశ్చర్యం లేదు. కారణం చిదంబరం కాంగ్రెస్ నేత గనుక. కాని బిజెపి పార్టీలో చేరిన సుబ్రహ్మణ్యస్వామి మోదీ నోట్ల రద్దును తీవ్రంగా విమర్శించడం ఆశ్చర్యం. తనకి రాజ్యసభ సీటు ఇచ్చినా, తాను చేరిన బిజెపి ప్రధానిని విమర్శించడం ఏమిటి?
అదే స్వామి ప్రత్యేకత. ఆయన ఎప్పుడూ యథార్థవాదే.

ఆలపాటి జనార్దనరావు, అచ్చంపేట, గుంటూరు
పాఠకులు ఎంతో ఆశగా మీ వివరణాత్మక సమాధానం కోసం ప్రశ్నలు సుదీర్ఘంగా అడుగుతున్నారు. మీరు క్లుప్తంగా సమాధానాలు ఇస్తారు. మీరు కొన్ని ప్రశ్నలు ఎంచుకుని వివరంగా సమాధానాలు ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది.
ప్రశ్నను బట్టి జవాబు.

వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
అభివృద్ధిని గురించి ఆలోచించకుండా రంధ్రానే్వషణే ఉద్దేశ్యముగా గల రాజకీయ నాయకులకు ఎటువంటి తత్వబోధ అవసరము? రాజనీతి శాస్తమ్రు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
రాచపుండుకు రాజనీతిశాస్త్రం పనిచేయదు.

*

ప్రశ్నలు
పంపాల్సిన
చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

email : sundaymag@andhrabhoomi.net