S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇది నిద్రలేస్తే వసంతం వచ్చినట్లే!

శీతాకాలం ముగిసి వసంతం వచ్చేసినట్లు తెలియాలంటే వాతావరణంలో వచ్చిన మార్పులు, పంచాంగాలపై మనం ఆధారపడతాం కదా! కానీ ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ‘గ్రౌండ్‌హగ్స్’ కదలికల ఆధారంగా వసంతం ఎప్పుడు వచ్చేదీ తెలుసుకుంటారు అక్కడి వారు. శీతాకాలంలో సుషుప్తావస్థలో గడిపేసే ఈ ఉడతజాతి జీవులు మత్తు వదిలి బొరియల్లోంచి బయటకు వచ్చి తమ నీడ పడే తీరును చూసి వసంతం మొదలయ్యే రోజును లెక్కిస్తాయట. ఒకవేళ అవి మళ్లీ బొరియలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటే ఆ సీజన్ మరికొన్ని రోజులు ఆలస్యం అవుతుందని అర్థమట. అలా కాకుండా బొరియలోంచి వచ్చి ఇక ఆహారానే్వషణ మొదలెడితే ఇక వసంతం వచ్చేసినట్లేనని అక్కడివారు సంబరపడిపోతారుట. ముఖ్యంగా పెన్సిల్వేనియాలో ఈ సంప్రదాయం ఎక్కువగా పాటిస్తారుట. దాదాపు ఐదు అడుగుల లోతు, 60 అడుగుల పొడవైన బొరియలు తవ్వడంలో వీటికివే సాటి. సొరంగ మార్గాలు, పంటలు, కేబులింగ్ వ్యవస్థను దెబ్బతీస్తూండటంతో వీటిని ఎక్కువగా హతమారుస్తుంటారు.