S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి )

పి.వి. శివప్రసాదరావు, అద్దంకి
నోట్ల రద్దు నేపథ్యంలో రెండువేల కరెన్సీ నోటును రద్దుచేసి కొత్తగా వెయ్య నోటు ప్రవేశపెడితే బాగుంటుందనే ఆలోచన కరెక్టేనంటారా?
ఆ బుద్ధి మొదలే ఉండాలి. రెండువేలకు బదులు కొత్త వెయ్య నోటు తెస్తే సరిపోయేది. మాటిమాటికీ కరెన్సీ నోట్లు రద్దు చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. తుగ్లక్ చర్య.

ప్రభుత్వం వైద్యులను హాస్పిటల్స్‌లో చికిత్స ధరల పట్టీ సూచికను పెట్టాలనే నిబంధన బాగానే ఉంది. వాళ్లు ఒకేసారి పెంచి వేసే అవకాశం ఉండదు. అప్పుడు రోగులు ఎక్కడ ధర తక్కువో తెలుసుకుని అక్కడికి పోవాలా? అసలు ఈ తతంగం కన్నా ప్రభుత్వమే వైద్యమండలి లేదా సంబంధిత వైద్య అధికారులతో చర్చించి ప్రతి చికిత్సకు రాష్టమ్రంతా ఒకే ధరలు వర్తింపజేస్తే, లేదా ఆసుపత్రుల కేటగిరిని బట్టి ఒకే రకమైన ధరలను నిర్ణయస్తే ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే ప్రక్షాళన చేసి న్యాయమైన రేషన్ ధరలను నిర్ణయంచబడితే ఎలా ఉంటుంది?
బాగానే ఉంటుంది. మెడికల్ మాఫియా దానిని పడనివ్వదు. దాన్ని ఎదుర్కొనే శక్తి రాజకీయానికి లేదు.

పటేల్ భాయ
బంగ్లాదేశ్ ఆవిర్భావ యుద్ధంలో మనకు చిక్కిన పాక్ సైనికులని వదిలిపెట్టడానికి (ఆక్రమిత కాశ్మీర్‌ను మనదిగా చేసుకునే అవకాశం ఉండి కూడా) చైనా, రష్యా, అమెరికా అప్పటి మన ప్రధాని మీద తీసుకొచ్చిన ఒత్తిడి కారణమా?
అలా చెప్పటానికి ఆధారం లేదు. కాని ఆనాడు మనల నేలినవారిలో కానవచ్చిన రాజకీయ దౌర్బల్యానికి, దౌర్భాగ్యానికి కారణమేమిటన్నది నేటికీ శేషప్రశే్న.

శ్రీనివాస్ ములుగూరి (ఈమెయల్)
సెక్యులరిజం అంటే ఏమిటి?
మెజారిటీ మతాన్ని అణగదొక్కటం.

ఆలపాటి జనార్దన్ (ఈమెయల్)
మోదీ గవర్నమెంట్ 2019లో వస్తుందా?
ఇప్పుడే చెప్పలేం.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర మీనుండి ఆశించవచ్చా?
ఆ ఆలోచన లేదు.

కె. వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ఓటు హక్కు గలవారికి ఆ ప్రాంతంలో గృహ నివాసం గలవారికి ఓటు హక్కు ఉంటుంది అని రాజ్యాంగ నిబంధన కదా! అయతే ఆయా నియోజకవర్గంలో పోటీచేసే వారికి ఆ నియోజక కేంద్ర ప్రాంతంలో నివాసం ఉండాలన్న నిబంధన వర్తించదా? పోటీచేసే సభ్యుడూ పౌరుడే కదా!
భారత పౌరుడు దేశంలో ఎక్కడినుంచైనా పోటీచేయవచ్చు. కాని ఎక్కడైనా ఓటు వేయవచ్చంటే కుదరదు. ఆచరణలో చిక్కులొస్తాయ. అక్రమాలు ఇంకా ఎక్కువవుతాయ.

సిహెచ్. సాయ ఋత్విక్, నల్లగొండ
తమిళనాడులో ఎఐఎడిఎంకె రెండు వైరి వర్గాలు అధికారం కోసం కుమ్ములాడుకుంటుంటే, తక్షణం రంగంలోకి దిగి రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ మహాశయులు వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడం దారుణం కాదా? గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తారన్న విమర్శకులకు ఇటువంటి సంఘటనలు బలం చేకూర్చవా?
గవర్నరు చేసిందే కరక్టు అని అనంతర పరిణామాలు రుజువు చేశాయ. త్వరపడి శశికళను సింహాసనం ఎక్కించి ఉంటే వారంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారేవారు. రాజకీయం ఇంకా కలుషితం అయ్యేది.

జె. సుధాకర్‌రావు పట్నాయక్, కాకినాడ
స్నేహంలో బాపు, రమణ నేటి ఆధునిక కాలంలో గొప్ప స్ఫూర్తి. ఇలాంటి మహనీయులు ఇంకా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా?
ఆ స్థాయలో ఈ కాలాన అలాంటివాళ్లు నాకు తెలిసినంతలో లేరు.

సి. ప్రతాప్, శ్రీకాకుళం
ఎప్పటిలాగే రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష కంటిన్యూ అయంది. బడ్జెట్‌లో ఆంధ్రులకు నిరాశే మిగిలింది. పోలవరం, నూతన రాజధాని, జాతీయ సంస్థల ఏర్పాటు, రైల్వేజోన్, విమానాశ్రయాల అభివృద్ధి, మెట్రో రైలు ప్రాజెక్టుల వంటి కీలక హామీలకు చరమగీతం పాడారు. కీలక ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాల వారు ఎగరేసుకుపోయారు. ప్రతీసారి కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించే విధంగా ఎంపీలను పార్లమెంటుకు పంపే మనం తగిన విధంగా నిధులను ఎందుకు సాధించలేకపోతున్నాం?
మనకు చిల్లర రాజకీయాలమీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలమీద లేదు. యథా ప్రజా తథా ప్రతినిధీ.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net