S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యుపకారం

ఆగస్ట్‌లో మంచు, చలి పోయి బయట తిరిగేంత వెచ్చటి ఎండ ఉంటుంది కాబట్టి కుక్కల యజమానులు తమ పెంపుడు కుక్కలతో బయటకి వచ్చే నెల అది. అందుకని కెనడాలో అగస్ట్ నెలని కుక్కల నెలగా పిలుస్తారు.
ఆ ఊళ్లోని ఓ కుక్కకి యజమాని లారా ఫ్రాన్సిస్. ఆమె కీవ్ బీచ్‌కి ఆ సాయంత్రం తన పెంపుడు కుక్కని వాకింగ్‌కి తీసుకువెళ్లింది. దారిలో అనేక మంది పరిచయస్థులు ఆమెని పలకరించారు. ఆమె కూడా వాళ్లని గ్రీట్ చేసింది.
ఆమె మొగ కుక్క ఓ లేబ్రడార్ రిట్రైవర్ దగ్గరికి వెళ్లి దాని వెనక భాగాన్ని వాసన చూడసాగింది.
‘ఆ రెండూ ఒకదాన్ని మరొకటి ఇష్టపడుతున్నట్లు ఉన్నాయి’ ఆమె వెనక నించి ఓ కంఠం వినిపించింది.
ఆమె చటుక్కున తల వెనక్కి తిప్పి చూసింది. ఆ మాటలు మాట్లాడిన యువకుడ్ని చూడగానే ఎక్కడో చూశానని అనుకుంది. కాని బీచ్‌లో కాదు. గతంలో ఎక్కడో చూసింది. కాని ఎక్కడో ఆమెకి గుర్తు రాలేదు. అతను చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. టైట్ జీన్స్, తెల్ల టీ షర్ట్‌లలో తను అతన్ని ఎక్కడ చూసింది?
‘బిగ్ ఇయర్స్‌ని మీరు మన్నించాలి. వాడు విమనైజర్’ తన కుక్కని వెనక్కి లాగుతూ లారా చెప్పింది.
‘్ఫర్వాలేదు. రెయిన్ ఎలాంటి మగ కుక్కనైనా ఎదిరించగలదు’ అతను నవ్వుతూ చెప్పాడు.
‘రెయిన్? అది కుక్కలకి పెట్టే పేరు కాదు’
‘నేను దాన్ని కొన్న రోజు వర్షం కాబట్టి ఆ పేరు పెట్టాను. రెయినింగ్ కేట్స్ అండ్ డాగ్స్ అనడం మీరు వినలేదా? మీరు మాత్రం మీ కుక్కకి బ్రిటీష్ పిల్లల కథల్లోని ఓ పాత్ర పేరు పెట్టాలని అనుకుంటున్నాను’
‘అవును. నేను ఇంగ్లండ్‌లో పెరిగాను. మా అమ్మ చిన్నప్పుడు ఆ జానపద కథల్ని మాకు చదివి వినిపించేది. అవును. పేరు సరైంది కాదు. దీని చెవులు చిన్నవి.’
‘మీ మాండలీకాన్ని బట్టి మీరు ఇంగ్లీష్ వారని గ్రహించాను. నా పేరు రే’
‘లారా. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’ లారా చెప్పింది.
వారి కుక్కలు సన్నిహితంగా అవడానికి కావాల్సిన తతంగం చేస్తూంటే వారిద్దరూ, స్టేజి మీద డైలాగ్స మర్చిపోయిన నటీనటుల్లా కొద్దిసేపు వౌనంగా నిలబడ్డారు. అకస్మాత్తుగా లారాకి అతన్ని ఎక్కడ చూసిందో గుర్తుకు వచ్చింది. జీసస్! అతనే! టీవీలో ప్రకటనల్లో చూసింది. టైట్ జీన్స్ ధరించి నడుం పై నుంచి నగ్నంగా ఉండి మగాళ్ల డియోడరెంట్ లేదా ఆఫ్టర్ షేవ్ ప్రకటనల్లో. అనేకసార్లు అతని ఫొటోని కూడా ఆ ప్రకటనల్లో వివిధ పత్రికల్లో చూసింది. ఓసారి మైథున సమయంలో తన భర్త ఫ్రాన్సిస్ స్థానంలో అతన్ని ఊహించుకుంది కూడా. ఓ ఫిల్మ్ స్టూడియో అక్కడికి దగ్గరే ఉంది. టొరంటోకి హాలీవుడ్ నార్త్ అనే ముద్దు పేరు వచ్చింది. ఆమె భర్త ఫ్రేన్సిస్ పోస్ట్ ప్రొడక్షన్ ఫిలిం కంపెనీని నడుపుతున్నాడు.
‘మీరు గుర్తొచ్చారు. మోడల్ కదా?’ అడిగింది.
‘అవును’
‘ఇక్కడికి నటించడానికి వచ్చారా?’
‘లేదు. విశ్రాంతికి. వేషాల్లేనప్పుడు మా ఇండస్ట్రీలో చెప్పే మాట అది’ నవ్వాడు.
‘అలాగా?’
‘ఒకటి, రెండు వేషాలు సిద్ధంగా ఉన్నాయి. సిబిసి లీగల్ డ్రామాలో ఓ పాత్ర, కొన్ని ప్రకటనల పాత్రలు’
‘మీది గ్లామరస్ వృత్తి’
‘నిజాయితీగా చెప్పాలంటే నెల మొదట్లో పాలు, ఇతర అవసరమైనవి కొనడానికి నేను ఎన్నుకున్న వృత్తి ఇది. మీరేం చేస్తూంటారు?’
‘హౌస్ వైఫ్‌ని.. నిజానికి అది కూడా కాదు. ఇంటి పని చేసేందుకు మెయిడ్, తోట పనికి పార్ట్‌టైం తోటమాలి ఉన్నారు. చలికాలంలో ఓ క్లీనింగ్ కంపెనీ మనిషి వచ్చి మా ఇంటి ముందు నించి మంచుని తొలగిస్తూంటాడు’
‘అంటే మీరు సిసలైన హౌస్ వైఫ్ అన్నమాట’ నవ్వుతూ చెప్పాడు.
ప్రశ్నార్థకంగా చూసింది.
‘్భర్తకి కావాల్సింది ఇచ్చే బాధ్యత హౌస్ వైఫ్‌దేగా?’
అతని మాటల్లోని కొంటెతనానికి ఫక్కున నవ్వింది.
సిల్వర్ బర్క్ అనే ఇంగ్లీష్ రెస్ట్‌రెంట్లో ఆ సాయంత్రం కలిశారు. అక్కడ నించి ఆమెని తన ఫ్లాట్‌కి ఆహ్వానించాడు.
‘ఫ్రిజ్‌లో కోల్డ్‌బీర్ ఉంది. బెడ్‌రూంలో ఏసీ ఆన్‌లో ఉంది. అలాంటి వాతావరణంలో వేడి అనుభవం కావాలనుకుంటే అక్కడికి వెళ్దాం పదండి’
అతని సూచనలోని రహస్యాన్ని అర్థం చేసుకున్న లారా కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పింది.
‘సరే పదండి. వేడి, చల్ల రెండూ కావాలి’
రతి విషయంలో అతను తన భర్తలా కాక చాలా దురుసుగా ప్రవర్తించడం గమనించింది. మృదుత్వానికి అలవాటు పడ్డ ఆమెకి అది తమాషాగా అనిపించింది.
* * *
ఆ రాత్రి భోజనం చేస్తూ ఆమె భర్త లాయిడ్ చెప్పాడు.
‘కుక్కని చంపడానికి ఇచ్చేయాలి. దానికి రేబిస్ ఉంటే?’
‘సిల్లీగా ఆలోచించకండి. బిగ్ ఇయర్స్‌కి రేబిస్ లేదు. అది ప్రమాదవశాత్తు జరిగింది మాత్రమే’
‘ఇంకోసారి పోస్ట్‌మేన్‌నో లేదా కొత్త వాళ్లనో కొరకచ్చు. అదే జరిగితే మాత్రం దాన్ని చంపడానికి ఇచ్చేస్తాను’
తనని రే కొరికితే ఆ నిందని ఆమె బిగ్ ఇయర్స్ మీదకి నెట్టాల్సి వచ్చింది.
‘నేను చెప్పింది ఏం ఆలోచించావు?’ కాసేపాగి లాయిడ్ అడిగాడు.
లాయిడ్‌కి తమ ఇల్లు కాని, బీచ్‌లు కాని, టొరెంటో కాని నచ్చలేదు. వేంకోవర్ నగరానికి మారిపోవాలనే ఆలోచన ఉంది. అక్కడ కిట్స్‌లానో లోనో, పాయింట్ గ్రే లోనో ఇల్లు కొనాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ సంవత్సరం పొడుగూతా వర్షం పడుతుంది. లారాకి ఉన్నచోటే ఉండాలని ఉంది. కొత్త చోటికి మారాలని లేదు. ముఖ్యంగా రేతో ఆ అనుభవం తర్వాత టొరెంటోకి, అతనికి దూరం అవాలని లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీని వేంకోవర్‌కి మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలని అతను మళ్లీ ఏకరువు పెడుతూంటే, ఆమె రే తెల్లటి పళ్ల పదునుని గుర్తుకు తెచ్చుకుంది. అక్కడికి వెళ్తే ఇక తను రేకి దూరం ఐనట్లే.
‘నాకు ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడటం ఇష్టంలేదు’
‘నీకు ఎప్పుడూ ఇష్టం ఉండదు’ విసుక్కున్నాడు.
‘వేంకోవర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు’
‘అక్కడ నువ్వు అనుకున్నంతగా వర్షం పడదు. నీకు ఇష్టమైన ఆల్ఫాల్ఫా స్ప్రౌట్స్ దొరుకుతాయి’
‘ఇంక ఈ చర్చని ఆపుదాం’
‘సరే. త్వరగా పడుకుందామా?’ అడిగాడు.
దాని అర్థం ఆమెకి తెలుసు. నుదుటి మీద ఒత్తుకుంటూ చెప్పింది.
‘నాకు తలనొప్పిగా ఉంది’
రేతో ఆ అనుభవం అయ్యాక ఇక తన భర్తతో అది రుచించదని లారాకి అనిపించింది.
* * *
మరో వారం పాటు లారా, రేలు కలుసుకోలేదు. లారాకి రేతో మళ్లీ శారీరకంగా కలవాలనే కోరిక అధికం కాసాగింది. అతను ఊరు వదిలి హాలీవుడ్‌కి వెళ్లిపోయాడా? లేదా సాధారణంగా మగాళ్లు మోజు తీరాక ఆడవాళ్లని వదిలేసినట్లుగా తనని వదిలేశాడా? తనంటే గల ఆకర్షణ పోయిందా? లాంటి ఆలోచనలు ఆమెని చుట్టుముట్టసాగాయి.
ఓ రోజు అకస్మాత్తుగా అతను కుక్కతో బీచ్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. లారా అతన్ని పలకరించింది.
‘హలో అపరిచితుడా!’
‘సారీ. అనుకోకుండా షాంపూ ప్రకటనకి ఆఫర్ వచ్చింది. వెంటనే షూటింగ్‌కి నయాగరా ఫాల్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. కోపం వచ్చిందా?’
‘నయాగరా ఫాల్స్! అది చాలా రొమాంటిక్ ప్రదేశం’
‘అది వధువు రెండో నిరాశ’ నవ్వాడు.
‘అదేమిటి?’
‘ఆస్కార్ వైల్డ్ అన్న మాటది’
లారా పకపకా నవ్వుతూ నోటికి చేతిని అడ్డుపెట్టుకుంది.
‘నిన్ను తీసుకెళ్లే అవకాశం ఉంటే తీసుకెళ్లే వాడిని’
‘కోల్డ్ బీర్?’ అడిగింది.
‘ఈసారి దానికన్నా తర్వాతది ముందు’ రే నవ్వుతూ చెప్పాడు.
* * *
లారా ఇంట్లోని కింగ్ సైజ్ బెడ్ వారి సాహస క్రీడలకి ఆ రోజు నిలయమైంది.
‘నా ఆదాయం తృప్తికరంగా లేకపోవటంతో నా భార్య నన్ను వదిలేసింది’ రే తర్వాత బీర్ తాగుతూ చెప్పాడు.
మరో రెండుసార్లు కలిసాక మూడో రోజు లారా చెప్పింది.
‘మా వారు ఇక్కడి ఆస్థులన్నీ అమ్మేసి వేంకోవర్‌కి వెళ్లిపోదామని అంటున్నారు. నేను వారించినా వినడం లేదు’
‘కాని నువ్వు దూరమైతే ఎలా?’ రే ఉలిక్కిపడి అడిగాడు.
‘అవునా? నేను కూడా నీకు దూరంగా ఉండలేను’
‘లాయిడ్‌కి విడాకులు ఇవ్వు. నాతో కలిసి జీవించు. బాహాటంగా ఇద్దరం కలిసి సినిమాలకి, డిన్నర్లకి, చలికాలంలో ఫ్లోరిడాకి వెళ్లచ్చు’
‘నిజంగానే చెప్తున్నావా రే?’ లారా అడిగింది.
‘నిన్ను ప్రేమిస్తున్నాను లారా. నిన్ను వదిలి ఎలా ఉండగలను?’
అతన్ని గాఢంగా చుంబించి తర్వాత చెప్పింది.
‘కాని అతనికి విడాకులు ఇవ్వలేను’
‘ఏం?’
‘అతను కేథలిక్ కాబట్టి విడాకులని ఇష్టపడడు. రెండో కారణం డబ్బు’
‘ఏం డబ్బు?’
‘ఈ ఇల్లు, డబ్బంతా నాది. మా నాన్న నించి నాకు అది వారసత్వంగా వచ్చింది. ఆయన శాస్తజ్ఞ్రుడు. చాలా వస్తువులని కనిపెట్టాడు. ఆ రాయల్టీలు ఇంకా వస్తున్నాయి. నేనొక్కదానే్న ఆయనకి. లాయిడ్ నడిపే పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీకి పెట్టుబడి పెట్టింది నేనే. మాకు విడాకులు జరిగితే మూర్ఖపు చట్టాల వల్ల నా ఆస్థిలో సగ భాగం అతనికి ఇచ్చుకోవాలి. అది అన్యాయం’
‘నాకు కావాల్సింది నువ్వు తప్ప నీ డబ్బు కాదు’
‘మనం ఇద్దరం కలిసి ఉంటే మనకో సెంట్ లేకపోయినా నేను పట్టించుకోను. కాని డబ్బున్నపుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి. అదంతా నీదే అవాలి కాని లాయిడ్‌కి కాకూడదు’ ఆమె అతని బుగ్గ మీద వేలితో రాసి చెప్పింది.
‘మరి? ఇంకో దారి ఏమిటి?’
‘ఈ ఇల్లు, లాయిడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో తెలీదు కాని చాలా ఎక్కువ. మనం కరీబియన్‌లో లేదా యూరప్‌లో జీవించడానికి సరిపడేంత డబ్బు వస్తుంది. నాకు పేరిస్‌లో నివసించాలని ఉంది’
‘నువ్వేం మాట్లాడుతున్నావు?’
‘లాయిడ్‌కి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు అంతా మనదే అవుతుంది. ఇల్లు, అతని ఇన్సూరెన్స్, వ్యాపారం, నా వారసత్వపు సంపద మొత్తం’
‘నువ్వు మాట్లాడేది ప్రమాదం గురించా...’
ఆమె తన వేలిని అతని పెదవుల దగ్గర ఉంచి చెప్పింది.
‘చెప్పకు. ఆ పదం నీ నోటితో చెప్పకు’
అతను బయటకి చెప్పకపోయినా తన ఉద్దేశం అతనికి అర్థమైందని లారాకి అర్థమైంది. కొద్దిసేపాగి రే చెప్పాడు.
‘ఓ సారి నేను మాంట్రియల్‌లో ఓ వ్యక్తి ద్వారా ఒకతని కొడుకుని రక్షించడానికి పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. అతని పేరు నీకు చెప్పను. కాని అతను మాఫియా మనిషి. నేను అతనికి చేసిన సహాయానికి చాలా ఆనందపడి డబ్బు పంపాడు. నేనా లావుపాటి కవర్ని విప్పకుండానే వెనక్కి పంపి, ‘అతనికి సహాయం చేయడంలో నాకు ఆనందం లభించిందని, అది చాలని, నా నటనకి అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని’ చెప్పాను. నాకు ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా అతన్ని కోరమని కోరాడు. నేనా డబ్బుని వెనక్కి పంపడం వల్ల నా మీద అతనికి అభిమానం రెట్టింపైంది’
‘ఓ! ఇంకేం? అతన్ని నువ్వు కాంటాక్ట్ చేయగలవా? అతను మనకి సహాయం చేస్తాడంటావా?’ లారా ఉత్కంఠగా అడిగింది.
‘నేను మాంట్రియల్ వెళ్లి నాకా పని పురమాయించిన వ్యక్తి ద్వారా అతన్ని కాంటాక్ట్ చేయాలి. కాని నాకు ఇప్పుడు దానికన్నా ఓ ముఖ్యమైన అవసరం ఏర్పడింది’ రే ఆమెని ఒంచుతూ చెప్పాడు.
* * *
రోజులు గడిచినా లారా, రేల మధ్య బంధం బలహీనపడకపోగా ఇంకా బలంగా బిగుసుకోసాగింది. ఓ రోజు లారా పడక గదిలో రే ఆమెతో చెప్పాడు.
‘నేను అతనితో మాట్లాడాను’
‘ఏమన్నాడు?’ లారా ఉత్సాహంగా అడిగింది.
‘సరే అన్నాడు. ఇలాంటి పనులు చేయడానికి ఒకరిద్దరు అతని కింద పని చేస్తూంటారు’
‘అది ప్రమాదంలా జరగాలని గట్టిగా చెప్పావా?’
‘చెప్పాను. సరే అన్నాడు’
‘ఈ రాత్రంతా నువ్వు ఇక్కడే ఉండచ్చు రే. లాయిడ్ కొన్ని ఇళ్ళని చూడటానికి వేంకోవర్‌కి వెళ్లాడు’
‘మధ్యలో రాడుగా?’
‘గురువారం కాని రాడు’
‘ఐతే ఈ వారమంతా మనం మంచం దిగం’ రే నవ్వుతూ చెప్పాడు.
‘నేను ఇలా చచ్చిపోయినా ఆనందమే రే’ లారా చెప్పింది.
ఆమె కోరిక ఫలించినట్లుగా ఫర్నేస్ పేలి, ఇల్లు అంటుకుని అన్ని వైపుల నించి మంటలు చెలరేగాయి.
* * *
‘పేలుడులో రెండు కుక్కల మరణం. ఇంటి యజమానుల జంట మరణం కూడా’ అన్న హెడ్డింగ్‌ని ‘టొరంటో స్టార్’లో లాయిడ్ చదివాడు. అతను ఆ వార్త తప్పని అనుకున్నాడు. తను వేంకూవర్లో రాబిన్సన్ స్ట్రీట్‌లోని ఓ అవుట్‌డోర్ కెఫేలో కపూచినో తాగుతున్నాడు తప్ప చావలేదు. ఆ ఇంటి యజమానుల్లో ఒక్కరే మరణించారని లాయిడ్‌కి తెలుసు. తన భార్య, రే అనే పని దొరకని నటుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన క్షణం నించే ఈ పేలుడికి పథకం వేస్తున్నాడు.
అసాధారణంగా లారా తనతో సెక్స్‌కి ఆసక్తి చూపించకపోవడంతో అతనికి అనుమానం కలిగింది. చెమట అంటుకోవడం వల్ల ఆమె శరీరం నించి మరో మనిషి వాసన వేసింది కూడా.
ఓ రోజు లాయిడ్ స్టూడియోకి అని చెప్పి బయలుదేరాడు కాని కారుని ఓ మాల్‌లో పార్క్ చేసి ఇంటికి తిరిగి టేక్సీలో వచ్చి తలుపు తెరచుకుని లోపలకి గెస్ట్‌రూంలోకి వెళ్లాడు. ఆ గదిలోకి తామిద్దరిలో ఎవరూ వెళ్లరు. అతని అనుమానం ఆ రోజు ధృవపడింది. కిటికీలోంచి రే కారు నంబర్ చూశాక అతని పేరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అన్నది కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు.
ఇంట్లో జరిగిన పేలుడు విషాదకరమైన ప్రమాదంలా పోలీసులు భావిస్తారని అతను నమ్మాడు. టొరంటో నగరంలో ఏటా అలాంటి ప్రమాదాలు అనేకసార్లు జరుగుతూంటాయి. చాలాకాలం సర్వీస్ చేయని ఫర్నేస్, ఓ చిన్న మెరుపు, ఓ చిన్న గేస్ లీక్. దాంతో పెద్ద పేలుడు.
లాయిడ్ కపుచినోని తాగి క్రోయిజాంట్‌ని కొరికాడు. అతనే్న చూస్తున్న డెనిమ్ షార్ట్, లో కట్ బ్లౌజ్‌లో ఉన్న ఏన్ ప్రశ్నించింది.
‘ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’
‘ఏ లేదు. నేను టొరంటోకి అర్జెంట్‌గా వెళ్లాల్సిన పని ఏర్పడింది. నీ పగడాల అధరాల కోసం తిరిగి రాకుండా ఉండలేనని కూడా చెప్పగలను’ లాయిడ్ తన చేత్తో ఆమె చేతి మీద మృదువుగా రాస్తూ చెప్పాడు.
‘అప్పుడే వెళ్లాలా?’ నిరసనగా చూస్తూ అడిగింది.
‘ముఖ్యమైన పని. అది అవగానే తిరిగి వచ్చేస్తాను’
‘వచ్చాక స్పేనిష్ బీచ్‌లో మనం చూసిన ఇంట్లో మనం కలిసి నివసించడం ఖాయమేగా?’ ఏన్ అడిగింది.
‘నేను వెళ్లే లోగా దాన్ని కొనే వెళ్తాను. కాని నీ పేరు మీద కొంటాను’
‘టేక్స్‌ల కారణంగానా?’
‘అవును’
తన భార్య మరణించిన రోజు తన పేరు మీద ఇంకో ఊళ్లో ఇల్లు కొనడం మంచిది కాదని అతనికి తెలుసు. ఆలస్యం చేస్తే అన్ని విధాలా నచ్చిన ఆ ఇల్లు చేజారిపోతుందని లాయిడ్ భయపడ్డాడు. ఓ జంట విడిపోవడం చాలా క్లిష్టమైంది. ఆమె కర్మకాండ పూర్తయ్యాక తను కొంతకాలం టొరంటోకి దూరంగా వెళ్లడం సబబనే అంతా భావిస్తారు. తర్వాత తన వ్యాపారాన్ని ఇంకో చోటికి మార్చడాన్ని అంతా అర్థం చేసుకోగలరు. తన భార్యతో నివసించిన ఊళ్లో, ఆమె జ్ఞాపకాలతో జీవించడం ఇష్టం లేక తను టొరంటో నించి వేంకోవర్‌కి వెళ్లడాన్ని ఎవరూ అనుమానించరు. ఆ తర్వాత తనని పట్టించుకోరు. తెలిసినా తను ఏన్‌ని పెళ్లి చేసుకోవడం సహజం అనుకుంటారు. తమ పరిచయం లారా మరణానికి ముందు కాక తర్వాత జరిగిందని పోలీసులు భావిస్తే చాలు. కాని పోలీసులు ఓ ప్రమాదాన్ని అంత లోతుగా పరిశోధించరనే అతను నమ్ముతున్నాడు.
* * *
నంబర్ 40. కాలేజ్ స్ట్రీట్‌లోని పోలీసుస్టేషన్‌లో డిటెక్టివ్ బాబీ తన బల్ల మీదకి వచ్చిన ఆ రిపోర్ట్‌ని చదివాడు. అది లారా ఇంట్లోని ప్రమాదానికి సంబంధించింది. ఆ ఇల్లు అతని ఏభై ఐదవ డివిజన్‌లోకే వస్తుంది. పైకి అంతా సాధారణంగా కనిపించే కేసుల్లో అసాధారణత మరుగున ఉంటుందని బాబీకి అనుభవ పూర్వకంగా తెలుసు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలాంటి అనుమానాలు లేకుండా అది ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడని చెప్తోందని దాన్ని చదివి తెలుసుకున్నాడు. వారికి అందుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సెంటర్ ఫోరెన్సిక్ సైనె్సస్‌లో పనిచేసే వారంతా ఉద్ధండులే. వాళ్లు చిన్న అనుమానాన్ని కూడా వదలరని, పాత ఇళ్లల్లో ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూంటాయని అతనికి తెలుసు. ఆ ఫైల్ మొత్తం చదివి తనకి కలిగిన ఆలోచనలని రాసుకున్నాడు.
వ్యాపార పని మీద వేంకోవర్ వెళ్లిన లారా భర్త లాయిడ్ ఆ వార్త గురించి తెలిసి తిరిగి వచ్చాక కాని మీడియా, పోలీసులు మొదట భావించినట్లుగా ఆ జంట భార్యాభర్తలు కారు అని అర్థమైంది తన భార్య మరణం వల్ల కలిగిన దుఃఖంకన్నా ఆమె ప్రియుడి గురించి తెలీడం వల్ల లాయిడ్‌కి అధిక దుఃఖం కలిగి ఉంటుందని, లారా ప్రియుడు రే అనే ఆట్టే ఆదాయం లేని నటుడని, లారాతో అక్రమ సంబంధం వల్ల అతనికి కలిగిన శిక్ష దారుణం అని రాశారు. లారా మరణం వల్ల లాయిడ్‌కి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ సొమ్ము రావడం వల్ల బాబీ దృష్టిలో అతను ప్రధాన అనుమానితుడు అయ్యాడు. లారీ జీవితమే కాక ఆమె ఇల్లు కూడా పెద్ద మొత్తానికి ఇన్సూర్ చేయబడింది. లారా మరణం వల్ల లాయిడ్‌కి చాలా డబ్బు కలిసి వచ్చింది. ఎక్కడ ప్రమాద మరణం వల్ల లాభం కలిగితే అక్కడ పోలీసులకి అనుమానం కలగడం సహజం. లాయిడ్‌కి యూనిఫాంలోని బాబీని చూడగానే కొద్దిగా వణుకు పుట్టింది. కానీ తనని దోషిగా రుజువు చేసే ఎలాంటివీ అతని దగ్గర లేవని అతని గట్టి నమ్మకం.
‘మీ ఆవిడ సరిపడే ఆదాయం లేని రేలో ఏం చూసిందంటారు?’ బాబీ ప్రశ్నించాడు.
‘అది నాకు అంతు చిక్కని ప్రశ్న’ లాయిడ్ జవాబు చెప్పాడు.
‘మీకు మీ భార్య వల్ల చాలా ఆర్థిక లాభం ఉందనుకుంటా?’
తామిద్దరి నేపథ్యాలని బాబీ లోతుగా పరిశోధించాడని లాయిడ్‌కి స్ఫురించింది.
‘నేను అనుమానితుడినా?’
‘మీరా సమయంలో వేంకోవర్‌లో ఉన్నారు కాబట్టి కాదు. కాని ఆ పేలుడు జరిగేపుడు మీరు టొరంటోలోనే ఉండక్కర్లేదు. మీరు హీటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సర్వీస్ మేన్‌గా ఐదేళ్లు పని చేశారు’
లాయిడ్‌లో మళ్లీ వణకు మొదలైంది.
‘అంటే? మీ దగ్గర నా మీద వ్యతిరేక సాక్ష్యం ఉందా?’
‘ప్రస్తుతానికి లేదు’
సాక్ష్యాలు ఉన్నా అవి కాలిపోయి ఉంటాయి. తను నేరస్థుడని అంగీకరిస్తే తప్ప అతను తనని ఏం చేయలేడు అని నమ్మాడు.
* * *
లారా అంతిమ కార్యక్రమం పూర్తయ్యాక లాయిడ్ విక్టోరియా పార్క్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి మారాడు. తన కారు కూడా కాలిపోవడంతో ఇంటిని సబ్‌వే సమీపంలో తీసుకున్నాడు. త్వరలోనే అతను తన ఆర్థిక వ్యవహారాలని సర్దుబాటు చేసుకోసాగాడు.
లారా, రేలు మరణించిన ఎనిమిది రోజు లాయిడ్ తన స్టూడియో నించి సెయింట్ జార్జి సబ్‌వే స్టేషన్‌కి చేరుకున్నాడు. ప్లాట్‌ఫాం మీద బాగా రద్దీగా ఉంది. రైలు రావడం దూరం నించే చూశాడు. రద్దీవల్ల ఎవరో తనని నెట్టడంతో నిగ్రహించుకునే ప్రయత్నం చేసి కూడా చేతకాక పట్టాల మీద పడ్డాడు. పదడుగుల దూరంలోని ఇంజన్ డ్రైవర్ పట్టాల మీద అడ్డంగా పడున్న లాయిడ్‌ని చూశాడు కాని ఏం చేయలేకపోయాడు. వెంటనే చాలామంది భయంగా అరిచారు.
* * *
మాంట్రియల్‌లోని గేంగ్‌స్టర్ మికీ రిసీవర్ అందుకున్నాడు. వ్యవస్థీకృత నేరాలు అతని వృత్తి. ఓసారి అతని కొడుకు హెరాయిన్ కలిగి ఉన్నాడని టొరంటో పోలీసులు అరెస్టు చేసినప్పుడు, రే పై అధికారిగా నటిస్తూ అతన్ని జైల్లోంచి విడిపించాడు. లారా ఇంట్లో జరిగిన పేలుడు ప్రమాదంలో రే మరణించాడని తెలిసాక మికీ ఆ కేస్ ఫైల్ కాపీని తెప్పించుకుని చదివాడు. లాయిడ్ ఐదేళ్లు హీట్, ఏసిల సర్వీస్ మేన్‌గా పని చేసిన అనుభవంతో తన ఇంట్లోని ఫర్నేస్‌ని ముప్పై ఆరు గంటల తర్వాత పేలేలా అమర్చి ఉండచ్చని, కాని అందుకు సాక్ష్యం లభ్యం కాలేదన్న బాబీ తనే ఆఫీస్ నోట్‌ని అందులో చదివాడు. మికీకి సాక్ష్యం అవసరం లేదు. లాయిడ్‌ని చంపించి, రేకి తను ప్రత్యుపకారం చేయదలచి తన మనిషిని అందుకు వినియోగించాడు.
ఆ రోజు దినపత్రికలో లాయిడ్ ప్రమాదం గురించి చదివిన మికీ తృప్తిగా తలాడించి, కృతజ్ఞతని చెప్పడానికి టెలిఫోన్ రిసీవర్ని అందుకున్నాడు.

పీటర్ రాబిన్సన్ కథకి స్వేచ్ఛానువాదం *

మల్లాది వెంకట కృష్ణమూర్తి