S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిస్కెట్ ఇలా తినాలట!

‘బిస్కట్’ అంటే అసలు అర్థం తెలుసా! లాటిన్‌లో ‘బిస్’ అంటే రెండుసార్లు అని, ‘కిట్’ అంటే ఉడికించడం (బేకింగ్) అని అర్థం. అసలు ఇంగ్లీషు డిక్షనరీ (ఆక్స్‌ఫర్డ్)లో ‘బిస్కట్’ అన్న పదానికి స్పెల్లింగ్ ‘బిఐఎస్‌కెఐటి’ అని ఉంటుదట. ఇంగ్లీషులో ఇప్పుడు వాడుతున్న స్పెల్లింగ్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. సరే, బిస్కట్లు ఎలా తినాలో, ఎలా తింటే మేలో ఓ అధ్యయనం నిర్వహించి తేల్చారు. బిస్కెట్‌ను సమాంతరం పట్టుకుని తినడం శ్రేయస్కరమని పెషర్ ఆఫ్ బ్రిస్టల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ లెన్ చెబుతున్నారు. నిజానికి గట్టి బిస్కట్లు తినడం వల్ల ఎంతో మంది బ్రిటన్‌లో గాయపడ్డారట. అందుకే అక్కడ ఇలాంటి పరిశోధనలు చేయాల్సి వచ్చింది. అమెరికాలో బిస్కెట్ అంటే ఒకరకమైన బ్రెడ్. కానీ ఇంగ్లండ్‌లో బిస్కట్ అంటే మనం తినే బిస్కట్ తరహావన్నమాట.

- ఎస్.కె.కె. రవళి