S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అతి చిన్న కప్పలు

చిన్నపిల్లల చేతి బొటనవేలి గోరుపై పెట్టుకున్నా కన్పించనంత చిన్నసైజు కప్పల్ని కొత్తగా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. మహారాష్టల్రోని పశ్చిమకనుమలు జీవవైవిధ్యానికి పెట్టిందిపేరు. ఇక్కడ అతిచిన్న కప్పలు (నైట్ ఫ్రాగ్స్) ఎక్కువగా ఉంటాయి. కేవలం 5 లేదా 6 మిల్లీమీటర్లకన్నా ఎదగని ఈ జాతి కప్పల అరుపు, చప్పుడు కీటకాల మాదిరిగా ఉండడం, ఆకుల చాటున దాగి ఉండటంవలన వాటిని ఎవరూ గుర్తించలేదు. అయితే ఢిల్లీకి చెందిన డాక్టర్ బిజు నేతృత్వంలోని శాస్తవ్రేత్తల బృందం కొత్తగా ఏడు కొత్తజాతి నైట్‌ఫ్రాగ్స్‌ను కనుగొన్నారు. మొదటి నాలిగింటికి నైక్టిబట్రాచుస్ మనలరి, ఎన్.పులివిజయని, ఎన్.రొబిన్‌మూరి, ఎస్ శబరిమలై అన్న పేర్లు పెట్టారు. మానవుల చర్యలవల్ల ఇప్పటికే పశ్ఛిమకనుమల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోందని, 37 నైట్‌ఫ్రాగ్ జాతుల్లో చాలావరకు కనుమరుగయ్యాయని డాక్టర్ బిజు అంటున్నారు.

- భారతి