S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మల్లె మనసు

నాకు ప్రేమించటం తెలుసు
ప్రపంచీకరణ పరవశంలో కొట్టుకుపోతున్నవాన్ని కాదు
ప్రపంచీకరణ చెత్తలో అనామకున్ని కాలేదు
నేను నిటారుగా నిలబడే ఉన్నాను
జనం గుణం, జనం రణం, జనం దుఃఖం తెలిసినవాన్ని
నేనెలా ఆ వలయంలో చిక్కుకుంటాను?
నినే్నమిటో నేడేమిటో రేపేమిటో
శాస్ర్తీయ పూల చెట్టును పెంచుతున్నవాన్ని
సిద్ధాంతం మైలురాళ్లు దాటుతున్నవాన్ని
నేనెలా ప్రపంచీరణ మోజులో చితిపోతాను?
నాకు ప్రేమించటం తెలుసు
ఏ మోజు నన్ను స్వార్థం ఒడిలోకి లాగలేదు
ఏ విషం నన్ను జనం సంస్కృతి నుండి మళ్లించలేదు
ఏ దోపిడి మాయాజాలం నన్ను గుప్పిట్లో బంధించలేదు
నేను కవిని
ప్రేమించటం తెలిసిన కవిని
నేలను, గాలిని, చెట్టును, పుట్టను,
అమ్మను, నాన్నను, అన్నను, చెల్లెను,
ఈ జనాన్ని, ఈ దేశాన్ని ప్రేమించటం తెలిసినవాన్ని
స్వార్థం లేని ప్రయాణంలో
త్యాగం మైలురాళ్ళు దాటుతున్నవాన్ని
అనురాగం నా నడక
ఆప్యాయత నా మాట, ఆత్మీయత నా పాట

- సిహెచ్.మధు, 9949486122