S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కవిత్వ పానకం

కవిత్వమనే పానకాన్ని
కొందరు పెగ్గుల్లో
కొందరు మగ్గుల్లో
వంచుకుని పంచుకుంటున్నారు
ఆసక్తిని పెంచుకుంటున్నారు

పూర్వకాలంనుండి
తెచ్చుకుంటున్నారు
పుచ్చుకుంటున్నారు
మెచ్చుకుంటున్నారు
పేద ధనిక భేదం లేకుండ
చేరదీస్తున్నారు
నీరు పోస్తున్నారు
పలుచన చేస్తున్నారు
ఇది -
రకరకాల రూపంలో
ఆవిర్భవిస్తుంది
హంగామ చేస్తుంది
మధురంగా వుంటుంది
మత్తెక్కిస్తుంది
ఆటలాడిస్తుంది
పాట పాడిస్తుంది

జయహో కవిత్వమా
కవుల వారసత్వమా
జయహో జయహో!

- రసస్రవంతి, కావ్యసుధ, 9290215858