S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లో లోపలి లోకం

అదేమిటో
జీవితమంటే వేసవేనంటూ
అన్ని కాలాలూ ఒక్కటై ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
అలసట ఆవిరి మేఘాలై కమ్ముకుంటాయ
నవ్వులెక్కడంటూ నడకలెక్కడంటూ

బతుకు చిత్రం దిగులు ఛత్రంతో
పొగల రంగుల్తో మసకేస్తుంటుంది
ఒక్కో కలా కరిగి కరిగి
ఆవేదన వడగాల్పుల్లో వేగిపోతూ
ఆలోచన ప్రవాహాల్లో మునిగిపోతూ
అమాయకత్వాన్ని నింపుకుంటుంది

నిజమే కానీ
ఇక అప్పుడేం చేసుతంటావు నువ్వు?
నీవనుకున్న బంధాలన్నీ
కాదన్న ప్రతిసారి
రగిలి రగిలి మిగిలిపోతావు
వ్యామోహాల డొక్కలు ఎగరేసుకుంటూ
గాయాల లెక్కలెంచుకుంటూ

అయనా
సుడులు తిరుగుతున్న దిగులు సెగలు
తిప్పి తిప్పి తీరాన విసిరేస్తే
రేపనే పిల్ల తెమ్మెర తట్టి లేపుతుంటుంది
పాత వాసనేస్తున్న నిద్రనుండి
కొత్త గుబాళింపుల మెళకువలోకి
ఒక్కో అడుగు వేయమంటూ
ఒక్కో తలపూ పేర్చుకోమంటూ

అవును కానీ
నీదైన వెతుకులాట
నీ కోసమే అంటావుగానీ
నీ లోపలితో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా
పసిదనపు పచ్చదనం రాసుకున్నావా
నీలాకాశపు సౌందర్యం నింపుకున్నావా
రంగురంగుల సీతాకోకలు నిమురుకున్నావా
సప్తవర్ణపు ఇంద్రధనస్సుని అద్దుకున్నావా

అందుకేనోయ్
మనసు పువ్వుని వాడిపోనివ్వకూ
ఆ నవ్వుల వెనె్నల్లో తడిసిపో
వడివడిగా తడితడిగా
జీవితమంటే జీవితమంత ప్రేమ పుట్టేలా

- లాస్యప్రియ కుప్పా, 9640551664