S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

ఈమని వీరరాఘవరెడ్డి, విజయవాడ
ఈ మధ్య జైపాల్‌రెడ్డిగారు టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ 2014 ఎన్నికలలో మోదీ గెలవటం నాకు ఇష్టం లేదు అన్నారు. మంచి పార్లమెంటేరియన్‌గా చెప్పబడుతున్నవారు అలా మాట్లాడవచ్చా?
ఆయన ఇప్పుడు బాధ్యతగల ఏ పదవిలోనూ లేడు. వ్యక్తిగత అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు.

గోనుగుంట మురళీకృష్ణ, రేపల్లె
ఈ మధ్య నాకు ఒకామె కనబడింది. ఆమె మతం పుచ్చుకున్నదట. ‘హిందూ మతం నుంచి ఎందుకు కన్వర్ట్ అయ్యావు?’ అని అడిగితే, ‘నాకు భర్త లేడు, పిల్లలు లేరు నాయనా! కాలు చెయ్య ఆడనప్పుడు వాళ్లు చూస్తారు. ఒకవేళ పోతే వాళ్లే తీసుకువెళతారు. మన మతంలో అనాధగా పోవలసినదే కదా!’ అన్నది. ఆమె మాటలు బాధాకరంగా ఉన్నా నిజమే అనిపించింది. అలాంటి సౌకర్యం హిందూ మతంలో ఎందుకు లేదు?
ఇది అర్థంలేని అభియోగం. హిందూ సమాజం అంత దుర్మార్గంగానూ లేదు. అన్యమత సమాజం అంత జీవకారుణ్యంతోనూ నిండిలేదు. తెలిసి మోసపోయే వాళ్లను ఎవరూ ఏమీ చేయలేరు.

డి.ఎస్.శంకర్, వక్కలంక
మీరు ఎలాంటి ప్రశ్నలు ఇష్టపడ్తారు? మేము తెలివిగా (అనుకుంటూ) వేసే ప్రశ్నలా? మీ మేధస్సుకు పరీక్షలు పెట్టే వాటినా?
అతి తెలివి చూపడానికి కాక, నిజంగా తెలుసుకోవాలని అడిగే ప్రశ్నలను.

ఇతర దేశాలలో తల్లులను ఏడాదిలో ఒకరోజు గౌరవిస్తారు కనుక మనమూ ఒకరోజు తల్లులకు పాదపూజ చెయ్యాలని ఆంధ్ర ప్రభువులు సంకల్పించారట. మంచిదేనా? తల్లిని గౌరవించడం మనకు ఇంకో దేశం వాళ్లు నేర్పాలా?
విదేశీ ‘దినాల’ వెర్రిని మనం అనుకరించనక్కర్లేదు.

కొలుసు శోభనాచలం, గరికపర్రు
మహిళా సాధికారతను సాధించుటకు చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరమా? అయతే గత రెండు దశాబ్దాలుగా రిజర్వేషను బిల్లును ఆమోదించటానికి దేశంలో గల పక్షాలన్నీ ఎందుకు ఏకాభిప్రాయానికి రాలేవు?
పురుషాధిక్య రాజకీయ వ్యవస్థ స్ర్తీలకు సముచిత స్థానం ఏనాటికీ ఇవ్వదు. అది మహిళలు తెగబడి లాక్కోవలసిందే. స్ర్తీ జాతి కళ్లు తెరవనంత వరకూ ఈ కథ ఇంతే.

చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
విదేశీ మోజులో ఆప్తులను వదిలేసి వెళ్లి అమెరికాలో మనవాళ్లు ఉద్ధరించేది ఏమైనా ఉందంటారా? కొత్త పాలకులు రకరకాల షరతులు విధిస్తే అక్కడ మన భారతీయులు ఏమైపోవాలి?
పర దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి పాట్లు తప్పవు. పరాయ దేశ ప్రభుత్వం మన షరతుల ప్రకారం నడవదు. నడవాలనుకోకూడదు.

బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ
బ్రాహ్మణ ఆడపిల్లలు పురోహితుడ్ని చేసుకుంటే లక్ష రూపాయలిస్తామని బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకటించడం...
బ్రాహ్మణ సమాజానికి సిగ్గుచేటు.

అదే మాదిరి మిగతా కార్పొరేషన్లు బ్రాహ్మణ పిల్లలు తమ కులస్తులను చేసుకుంటే లక్ష ఇస్తామని ప్రకటిస్తే...?!
అలాంటి ఆఫర్లేవీ లేకుండానే ఇప్పుడు చాలామంది ఇష్టపడి చేసుకుంటున్నారు.

కె.వి. దుర్గామోహనరావు, హైదరాబాద్
తెలంగాణలో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుచేసి, వంద కోట్ల బడ్జెట్ కేటాయంచడం, బ్రాహ్మణ భవన్ నిర్మాణానికి పూనుకోవటమనే తెలంగాణ సిఎం గారి నిర్ణయాలు అభినందనీయం. అయతే వాటి పెత్తనం అంతా బ్రాహ్మణులలోని ఒక శాఖ వారికే కట్టబెట్టి వారికే పెద్దపీట వేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఏమంటారు?
ఈ రకమైన సంకుచిత మనస్తత్వమే బ్రాహ్మణ వర్గానికి శాపమంటాను.

వారణాసి జానకీదేవి, న్యూఢిల్లీ
ఆంధ్రలో అక్రమార్జన, అవినీతి, కుంభకోణాలలో చిక్కి, బెయల్‌పై తిరుగుతూ, కాబోయే ముఖ్యమంత్రిగా ఊహా లోకాలలో విహరిస్తూ, విశాఖపట్నం విమానాశ్రయంలో వీరంగం వేసిన విపక్ష నేత మనఃస్థితిని ఏమనుకోవాలి?
అయ్యో పాపం... అని జాలిపడాలి.

ఆచార్య కె.నాగరాజారావు, నెల్లూరు
ప్రసిద్ధ ఆలయములలో పూర్ణకుంభ స్వాగతం కేవలం దేశాధ్యక్షులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్, పీఠాధిపతులకు మాత్రమేనని పండితుల ఉవాచ. మరి ఎంపి తదితర ప్రజా ప్రతినిధులకు ఆలయ నిర్వహణాధికారులు అట్టి సాంప్రదాయ స్వాగతములు చేయుటకు శాస్త్రం అంగీకరిస్తుందా?
దేవాలయాల మీద రాజకీయ జీవుల కర్ర పెత్తనం పోనంతవరకూ ఇలాంటి అనాచారాలు ఆగవు. ఖ

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net