S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వందేళ్లనాటి బొరియలే నివాసం

ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే నక్కలు కుక్క జాతిలో అతి చిన్నవి. వేసవిలో గోధుమవర్ణంలో ఉండే బొచ్చుతో కనిపించే ఈ నక్కలు మిగతా కాలంలో తెల్లగా అందంగా కనిపిస్తాయి. మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనూ తట్టుకోగలిగే ఇవి మంచు అడుగున వెళ్లే ఆహారాన్ని కూడా కనిపెట్టి దాడిచేయగలవు. ఇవి తన జీవితంలో ఎన్నడూ సుషుప్తావస్థలోకి వెళ్లవు. వందేళ్లనాటి బొరియల్లోనే అవి నివసిస్తాయి. ఒక్కో బొరియకు కనీసం వంద ప్రవేశద్వారాలుంటాయంటే నమ్మాల్సిందే. ఒక్కో నివాసంలో కొన్ని వందల తరాలు నివసించి ఉంటాయనడమూ నిజమే. వెచ్చగా ఉండేందుకు ఒత్తుగా ఉండే బొచ్చుతోకను శరీరం చుట్టూ కప్పుకుని చుట్టచుట్టుకుంటాయి. మంచుపై తిరిగేందుకు వీలుగా వీటి పాదాల అడుగున కూడా ఒత్తుగా బొచ్చు పెరుగుతుంది.

- ఎస్.కె.కె. రవళి