S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (మార్చి 12 నుండి 18 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్నది అనుకున్నట్లు పనులందు శ్రద్ధ చూపి పూర్తి చేస్తారు. బంధు మిత్రులు సమయానికి సాయపడతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మెరుగవుతాయి. ఇతరులు మీ పనులందు తలదూర్చకుండా చూసుకోవాలి. దంపతులకు మంచి సమయం. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. బుద్ధిబలంతో అన్ని పనులు చక్కబెడతారు. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలందుకుంటారు. పరిచయాలు ప్రయోజనకారిగా మారుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ప్రతికూల వాతావరణాన్ని మీరు అనుకూలంగా మార్చుకుని కార్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు పోటీ తత్వానికి అనుగుణంగా మారనుంది. విందు వినోదాలందు మిత్రులతో కలిసి పాలుపంచుకుంటారు. స్పెక్యులేషన్ మిశ్రమం. కోర్టు వ్యవహారాలు, విదేశీ ప్రయాణ యత్నాలు ఫలప్రదం. సంతాన సౌఖ్యం. శుభ వర్తమానాలు వింటారు. వ్యర్థంగా ఏ కార్యానికి శ్రీకారం చుట్టకండి. మిత్రులు బంధు వర్గంతో జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులు వద్దు. ఆర్థిక ఆలోచనలు ఊపందుకుంటాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఒకే పనిని పదేపదే చేయాల్సి వస్తుందేమో ఆలోచించుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. వస్త్ర, వస్తువులు అయాచితంగా లభించేట్లున్నాయి. ప్రయాణాలు ఒక్కరే చేయవద్దు. వృత్తి, వ్యాపార ఉద్యోగాలందు ముందు చూపు, మెళకువ అవశ్యం. వదంతులు వ్యాప్తి చేసేవారిని గమనించండి. స్ర్తిల వల్ల మీకు అన్నింటా మంచి జరుగనుంది. కుటుంబ సభ్యుల మాటలు వినండి. అన్నింటా లాభాన్ని అందుకొంటారు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఉత్సాహభరితంగా ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతోషాన్ని ఇస్తాయి. ఇంటి పనులు కలసి వస్తాయి. శత్రు జయం, సంతానంలో శుభ పరిణామాలుంటాయి. సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ప్రయాణ లాభాలు. నూతన పరిచయ ప్రయోజనాలు. అనుకోని ధన లాభం. వాడి వేడి చర్చలు వద్దు. ఆరోగ్యం తృప్తినిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా యోగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు రాణింపు. ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. రావలసిన పైకం సమయానికి అందేట్లుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ధైర్యంతో ముందుకు వెళతారు. వాహన సౌఖ్యం. బంధుమిత్రుల కలయిక. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. దూరపు వార్తలు ఆలోచింపజేస్తాయి. తగాదాలు, వివాదాలొద్దు. దంపతులు ఒకే మాటపై ఉండటం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఆలోచింపజేస్తాయి. దేహ శ్రమ అధికం కావచ్చు. ఉద్యోగులకు బదిలీలు. వాహన ప్రమాదాలు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభకార్యాలు కలసి వస్తాయి. బంధుమిత్రుల కార్యక్రమాలందు మీ పద్ధతిలో పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందడుగు వేయండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

లాభదాయక వాతావరణంలో పనులు పూర్తి చేస్తారు. ఇతరులను బాధపెట్టే మాటలు వద్దు. బంధుమిత్రులతో సఖ్యత మంచిది. వాహన ప్రయాణంలో మెళకువలు, వేగ నియంత్రణ పాటించాలి. ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు గతం కంటె గుర్తింపును తెచ్చిపెడతాయి. ఉద్రేకాలు వద్దు. సదుద్దేశంతో వున్నా ఇతరులు వేరే విధంగా అనుకోవచ్చు. దంపతులు ఆనందాన్ని పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అన్ని విధాలుగా యోగవంతం. జయాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆదాయం బాగుంటుంది. వ్యయం తగ్గనుంది. వాహన సౌఖ్యం. స్థల వ్యవహారం. భూ సంబంధ పనులు అనుకూలంగా ఉంటాయి. స్పెక్యులేషన్‌లో లాభాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైద్య, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

అన్నింటా జయం. ఆరోగ్య లాభం. ఆర్థికంగా సంతృప్తి. ధైర్యం, ఆత్మబలంతో ముందడుగు వేస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు స్థాన మార్పులు తప్పేట్లు లేదు. విద్యార్థులకు మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్ లాభప్రదం. ప్రయాణ సౌఖ్యం. అవగాహనతో ముందుకు వెళ్లండి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అన్నింటా మీదే పైచేయి. ఆర్థికంగా ఫరవాలేదు. వ్యయాలకు అనుకూలంగా పైకం అందుతుంది. ధైర్యంతో నూతన పనులు నేర్పుగా చేసి విజయాన్ని అందుకుంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల వారికి మేలు. కుటుంబ వ్యక్తులలో సఖ్యత. మంచి మాటలు వింటారు. స్పెక్యులేషన్‌లో లాభాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గతం కంటె బావుంటాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వైద్య, రియల్ ఎస్టేట్ రంగాలు మెరుగవుతాయి. పనులందు రాణింపు. ఆరోగ్య లాభం. ఆదాయానికి లోటుండదు. అప్రయత్న ధన లాభం. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. దంపతుల మధ్య అనుకూలత ఉంటుంది. స్పెక్యులేషన్ తృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వాతావరణం మీకు అనుకూలం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆరోగ్యం యోగవంతంగా ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. పనులందు ఆటంకాలున్నా మీ సమర్థతతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి సమయం. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు తృప్తి. స్థాన మార్పులకు అవకాశం. స్ర్తిలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆభరణాలందు మెళకువ అవసరం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855