S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరోసారి..!

బాలీవుడ్ భామ విద్యాబాలన్ దృష్టి ఎప్పుడూ వైవిధ్యమైన క్యారెక్టర్లవైపే వుంటుందనేది మరోసారి రుజువవుతోంది. ‘డర్టీ పిక్చర్’తో హాట్ హాట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి అందర్నీ తన పాత్ర ద్వారా అందర్నీ ఆకట్టుకోవడమేగాక, విమర్శకుల్ని సైతం మెప్పించేలా చేసింది. తాజాగా మరో సంచలనమైన పాత్ర ద్వారా పలకరించబోతోంది. అదే ‘బేగం జాన్’ ‘మై బాడీ.. మై హౌస్.. మై కంట్రీ మై రూల్స్’ అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. గాగ్రా, కట్ చోళీ ధరించి చెక్క కుర్చీలో దర్జాగా కూర్చుంది విద్యాబాలన్. పైగా హుక్కా కూడా తాగుతోంది. విద్య పక్కన తుపాకీ. ఇలాంటి ఫస్ట్‌లుక్ చూసిన వారంతా మరోసారి సంచలనమే అంటున్నారు. ఈ చిత్రానికి మహేష్‌భట్ నిర్మాత. శ్రీజిత్ దర్శకుడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాల్సిందే!

-సమీర్