S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాధనతోనే జ్ఞాపకశక్తి (మీకు మీరే డాక్టర్)

తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారి తలకాయ కూఢా పెద్దదిగా ఉంటుందనుకోవటం తలకాయలేని మాట. ఆ మాటకొస్తే ఐన్‌స్టీన్ తలకాయ కూడా మన తలంతే ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రబింబం సూర్యబింబాన్ని నల్లగా కమ్ముకున్నాక వెల్తురు చారికలు సూర్యబింబం చుట్టూ వ్యాపించటాన్ని ‘కరోనా’ అంటారు. ఐన్‌స్టీన్ జుట్టు అలా కరోనాలా ఉంటుంది. అంతే తప్ప, ఆయన తల మన తల ఒకటే పరిమాణంలో ఉంటాయి.
కానీ, తెలివితేటల విషయంలో చాలా తేడా ఉంది. ఈ తేడా మెదడులో ఎక్కడుంది?
అద్భుతమైన జ్ఞాపకశక్తిని, తెలివితేటల్ని అచ్చతెలుగులో ‘యాది’ అంటాం. యాద మరవటానే్న ‘ఆదమరచు’ అని కూడా అంటారు. ‘ఆదమరచి నిదురపోరా తమ్ముడా!’ అని లతామంగేష్కర్ పాడిన తెలుగు సినిమా పాట అందరికీ యాది ఉన్నదే! యాది ఎక్కువగా ఉన్న యాదిగిరులు, యాదిమల్లులు, యాది యోధుల్ని, ధారణా బ్రహ్మరాక్షసుల్ని (మెమరీ ఛాంపియన్లు, మెమరీ అథ్లెట్లు) ఎంపిక చేసి వారి బ్రైన్ యమ్మారై స్కానింగ్ అధ్యయనం చేస్తే, తెలివితేటలు అధికంగా ఉన్న వ్యక్తులకూ, తక్కువగా ఉన్న వారికీ వారివారి మెదడు కణజాలాల మధ్య అనుసంధానంలో తేడాని గమనించారు.
జ్ఞాపకశక్తి, మేథాశక్తి, విచక్షణా శక్తి వీటి విషయాలలో సామాన్యుడికీ, అసామాన్యుడికీ తేడా భౌతికమైనది కాదని ధారణాశక్తి అనేది ఒక నైపుణ్యం అనీ, ఈ నైపుణ్యాన్ని పెంచేందుకు చేసే ప్రయత్నాల వలన మెదడు లోపల కణజాల అనుసంధానం బలంగా జరుగుతుందనీ శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. ‘చిఆళూ ఆ్ఘజశజశ తీళ ఒళళ ఘౄఒఒజ్పళక జశషూళ్ఘఒళజూ ఔళూఛ్య్ఘిౄశషళ యశ ౄళ్యూౄక ఆళఒఆఒ. యోఆ యశక ష్ఘశ క్యఖ జశజూఖషళ ఘ ఇళ్ద్ఘ్పజ్య్ఘూ ష్ద్ఘశళ, ఆ్దళ ఆ్ఘజశజశ ఘఒ్య జశజూఖషళఒ ఒజౄజ్ఘూ ఇ్ఘజశ ష్యశశళషఆజ్పజఆక ఔ్ఘఆఆళూశఒ ఘఒ ఆ్ద్యఒళ ఒళళశ జశ ౄళ్యూౄక ఘఆ్దళఆళఒ.’ అని నెధర్లాండ్స్ రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ ఆచార్యులు మార్టిన్ డ్రెజ్లర్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం 2,500 మంది మేథావుల మెదడు స్కానింగ్‌లను పరీక్షించారు. కణజాలాల మధ్య బంధం దగ్గరగానూ దూరంగానూ ఉండటాన్ని స్కానింగ్ చిత్రంలో గమనించవచ్చు.
మెదడు లోపల సమాచార మార్పిడికి అనుసంధానం (కనెక్టివిటీ) ఎంత దగ్గరగా ఉంటే సమాచారం అంత బలంగా ఉంటుందని దీని సారాంశం. నిరంతర అధ్యయనం, మెదడుతో పరిశ్రమ, ధారణ అంటే జ్ఞాపకం పెట్టుకోవటానికి ప్రయత్నించటం ఇవన్నీ ఈ అనుసంధానాన్ని వేగిరపరిచే అంశాలు.
విద్యార్థులకు దీని విషయమై అవగాహన కలిగించటం కూడా చాలా అవసరం. ‘మీలో చదివింది గుర్తుండట్లేదనే వాళ్లెందరూ?’ అనడిగితే తరగతిలో మూడొంతుల మంది విద్యార్థులు చేతులెత్తుతారు. ఫలానా సినిమా గురించి అడిగితే ఒక్కసారే చూసినా సరే, యాక్షన్‌తో సహా డైలాగులు అప్పజెప్పగలుగుతారు. అంటే, వారికి జ్ఞాపకశక్తి బాగానే ఉన్నదన్న మాట. కానీ, అది స్కూలు పుస్తకాల విషయంలోనే సరిగా ఉండటం లేదు.
బట్టీపట్టి చదవద్దని, అర్థం చేసుకుంటూ చదవండనీ పిల్లల్ని కేకలేస్తుంటారు పెద్దవాళ్లు. ఎక్కాలు, పద్యాలు, ఆల్జీబ్రా సూత్రాలు, రసాయన శాస్త్ర సమీకరణాలు ఇలాంటివన్నీ బట్టీ పడితేనే గుర్తుంటాయి. బట్టీ అవసరమే. బట్టీ పట్టడానే్న ధారణ చేయటం అంటారు. ఎంత ధారణ చేస్తే అంతగా మెదడు శక్తిమంతం అవుతుంది. మెదడుకు అరగటం, తరగటం ఉండవు. ధారణా శక్తి అనేది ఒక సమాచార వ్యవస్థే కానీ మెదడు కండరాలకు సంబంధించిన విషయం కాదు కాబట్టి. అయినా, మెదడు శక్తికి తగ్గంత చెప్పేందుకు మన దగ్గర అంత పని లేదు.
అధ్యయనం ఎలా చేయాలో కొన్ని సూత్రాలు చెప్తూ ‘న అనునాశికాత్’ ముక్కున పట్టి చదవొద్దు అన్నాడు సుశ్రుతుడు. ముక్కున పట్టి చదవటానికి, బట్టీపట్టి చదవటానికి వౌలికమైన తేడా ఉంది. బట్టీ పట్టినది జీవితాంతం గుర్తుండిపోతుంది. ముక్కున పట్టింది తుమ్మితే ఊడే ముక్కులా తాత్కాలిక జ్ఞాపకంగా బుర్రలోనే అంతరించిపోతుంది.
కాకి గుండ్రంగా గూడు ఎలా కడుతుందో ఒకసారి గమనించి చూడండి... అందులో తను, తన జీవిత భాగస్వామి, తను పెట్టే గుడ్లు, అవి పొదిగాక పుట్టే పిల్లలు ఇంత మందీ సౌకర్యవంతంగా ఆ ఇంట్లో జీవించేందుకు కావాల్సిన రీతిలో కాకి పుల్లలతో గూడు కడ్తుంది. కాకుల్లో కార్పెంటర్లు, తాపీ మేస్ర్తిలు, రాడ్ బెండింగ్ వర్కర్లూ ఉండరు కదా! అందుకని, ఎక్కడెక్కడో తిరిగి వొంపు తిరిగిన పుల్లలు, పంగ పగిలిన పుల్లలు ముక్కున పట్టి తెచ్చి గూడు కడ్తుంది.
అలా ముక్కునపట్టి తెచ్చేప్పుడు దారిలో ఫ్రెండెవరో కనిపించి ‘కాయ్’ అని పలకరిస్తే, ఇదీ ‘కాయ్’ అనాలని నోరు తెరుస్తుంది. అంతే! ముక్కున పట్టిన పుల్ల కాస్తా జారిపోతుంది. ముక్కున పట్టిన చదువు కూడా అంతే! పరీక్ష హాల్లోకి వెళ్లినప్పుడు కూడా గుర్తుంటుంది. పేపరు తీసుకున్నప్పుడూ గుర్తుంటుంది. తీరా వ్రాయబోయేసరికి బుర్రలోంచి మాయమై పోతుంది. మహాభారతంలో కర్ణుడి దగ్గర దివ్యాస్త్రాలెన్నో ఉన్నాయి. సరిగ్గా వాటిని ప్రయోగించే సమయానికి ప్రయోగ మంత్రం జ్ఞాపకం రాకపోవటం లాంటిదే ఈ పరిస్థితి.
అధ్యయనం అనేది ఒక కళ. ఒక నైపుణ్యం, ఒక బాధ్యత కూడా! రెండు చక్రాల బండిని బ్యాలెన్సు చేసుకుంటూ నడపగలగటం ఒక నైపుణ్యం. ఎనే్నళ్ల తరువాతైనా ఆ నైపుణ్యాన్ని మెదడు జ్ఞాపకానికి తెచ్చుకోగలుగుతుంది. యాదికొస్తుందన్నమాట.
యాది పెరగాలంటే మూడు ముఖ్య సూత్రాలున్నాయి. మొదటిది, దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన గట్టి అవసరం మనకుండాలి. తాను ఇంజనీర్‌ని కావాలని 10వ తరగతిలోనే విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు లెక్కలు, సైన్సు లాంటి కఠినతరమైన సబ్జెక్టులంటే ఇష్టత (ఇంట్రెస్ట్) ఏర్పడుతుంది. ఇష్టత ఉన్నప్పుడే ఏకాగ్రత (కాన్సంట్రేషన్) కుదురుతుంది. ఇష్టపడి ఏకాగ్రతతో చదివితే సబ్జెక్ట్ వొంటబడ్తుంది. దీనే్న ‘డెడికేషన్’ అంటాం. ఇలా కాన్సంట్రేషన్, ఇంట్రెస్ట్ మరియు డెడికేషన్ ఈ ‘సి.ఐ.డి.’లు ఉంటేనే చదువులో రాణింపు వస్తుంది. ఇది జీవితంలో అన్ని రంగాలకూ వర్తించేదే! మనకు ఇంటరెస్టు లేని విషయాలు అప్పటికప్పుడే జ్ఞాపకాల్లో మరుగున పడిపోతాయి. మేథావితనం పెరగాలంటే ఎవరికైనా ఆ విధమైన డెడికేషన్ ఉన్నప్పుడే ఏకాగ్రత కుదురుతుందని, అప్పుడే ఆ బుర్ర పెద్ద ‘యాదిగిరి’ అవుతుందని, ఆ వ్యక్తి ‘యాదిమల్లు’డౌతాడనీ దీని భావం.
ఎవ్వరూ పుట్టుకతోనే మేథావులు కాలేరు. సాధనమున బుర్ర పదును కెక్కును ధరలోన.. అంతే! *

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

- డా. జి.వి.పూర్ణచందు