S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటి రెక్కల పొడవు 12 అడుగులు

అంటార్కిటికా, అలస్కా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ సముద్ర పక్షి పేరు అల్బట్రాస్. 50 అంగుళాలవరకు పెరిగే ఈ పక్షి రెక్కలు విప్పితే 12 అడుగుల పొడవుంటాయి. పొడవైన, పెద్దవైన రెక్కలున్న పక్షుల్లో ఇది మొదటిది. గాలుల ఆధారంగా రెక్కలు కదలించకుండా రోజుల తరబడి ఎగురగలగడం వీటి ప్రత్యేకత. సంతానోత్పత్తి సమయంలో మినహా మిగతా జీవితమంతా సముద్రంపైనే ఇది గడిపేస్తుంది. మారూమూల, ఒంటరి దీవులకు వలసవెళ్లి జతకట్టడం వీటికి ఇష్టం. 18 నెలలకు ఓసారి జతకట్టి, ఒక గుడ్డును మాత్రమే పెట్టే ఈ పక్షులు జంటగా పిల్లని సాకడం విశేషం. ఎగరడం నేర్చుకునే సమయంలో టైగర్ షార్క్‌ల బారిన పడటం వీటికి అతిపెద్ద గండం. ఎదిగాక వీటికి మనిషి తప్ప ప్రధాన శత్రువులు లేవనే చెప్పాలి.

- ఎస్.కె.కె. రవళి