S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యోగ విభూతుల బుద్ధియోగం

కర్త, కర్మ, కారణం- మనకు తెలిసిన అక్షర జ్ఞానంలో మూడు పదాలు.
కర్త, కర్మ, కారణం - మనకు అంతు చిక్కని అ-క్షర ప్రజ్ఞానంలో మూడుగా విడివడ్డ ‘పర’మాత్మ అంశ.
ఈ ‘పరా’నే్న ఆరిజిన్ - ఆది అంటుంటాం గిక పరిభాషలో. దివ్యావతారలైన దేవతలు, మహత్వ సంపన్నులైన మహర్షులు సైతం సరిగ్గా అందుకోలేక పోయిన మహిమాన్విత శబ్దం ఈ ఆరిజిన్. ఈ ఆది ప్రజ్ఞానాన్ని వొడిసి పట్టుకోవాలంటే యోగ సాధన అవసరం. ఇక్కడ యోగ సాధన అంటే డైరెక్ట్ లైన్ పోనీ డైరెక్ట్ లింక్ అని అర్థం. అంటే, ఆది స్థితిని మానవ సంతతితో ఆరాధింప బడుతున్న ఆ ముక్కోటి దేవతలు, మహత్వపూర్ణులైన సహస్రాధిక మహర్షులు సైతం అందుకోకపోవటానికి కారణం ఏమిటి?
కర్తను, కర్మను అంటే చేసే వానిని చేసే దానిని, ఈ రెంటినీ అనుసంధానిస్తున్న ‘కారణ’ విశేషాన్ని అభేద్యంగా అంటే మూడుగా కాక ఒక్కటిగానే చూడగలగటం ప్రకృతి ప్రసాదిత నేత్రద్వయానికి సాధ్యం కాదు. ద్వంద్వాతీత అధిభౌతికతతో మూడో నేత్రం విప్పారితే తప్ప ఆది స్థితి అంటే విశ్వ దర్శనం సాధ్యం కాదు. పురుషోత్తమ యోగంతో విశ్వయాత్ర కొనసాగదు. అంటే పాంచభౌతిక ప్రవృత్తికి ఆకరమైన దేహం నుండి, మనస్సు నుండి విడివడి, భౌతిక, మానసిక ప్రాంగణాలకు అతీతమైతే తప్ప అనశ్వర ఆది తత్వం ఎరుకకు రాదు. ఇక్కడ ఎరుక అంటే యోగ సాధనానుభవమే! వ్యామోహం పంచ భూతాత్మక దేహానిది, మోహం పాంచ భౌతిక తత్వాన్ని అనుశాసించే మనస్సుది కాబట్టి ఈ రెంటి నుండి వైదొలగటమే వైరాగ్యం. అంతటి యోగ సంపన్నుడే విరాగి. రాగరంజిత ప్రాపంచికం నుండి ఎదిగిన విరాగికే రాగల భవిష్య దర్శనం సాధ్యమవుతుంది.
‘ఆరిజిన్’ అంటే పుట్టటం, గిట్టటం లేనటువంటిది.. పైగా సృష్టి కొనసాగటానికి మూలమైనటు వంటిది. జనన, మరణ చక్ర బంధానికి అతీతమైంది. అయినప్పటికీ జనన, మరణాలకు హేతువయినటు వంటిది. కాబట్టే ‘ఆది’ని మనం ‘పరనం’గా, ‘పరమాత్మ’గా సంభావించుకుంటున్నాం.. ‘పరమ’ తత్వాన్ని అర్థం చేసుకో ప్రయత్నిస్తున్నాం. ఈ ఆకళింపుతో ఆ పరమాత్మ రూపాన్ని అజుడు అంటున్నాం, అనాది అంటున్నాం. దేవతా గణ పరివ్యాప్తికి, మహర్షి కూట మహత్వానికి మూలంగా అంటే కారణంగా పరిగణిస్తున్నాం.
పైగా, మన ఎరుకలోని జాగృత, స్వప్న, సుషుప్తి అనే మూడు చైతన్యాలకు అతీతమైన శుద్ధ చైతన్య ప్రతినిధిగా ప్రామాణీకరిస్తున్నాం. ఈ శుద్ధ చైతన్య ఆవిష్కరణే ప్రజ్ఞాన రహస్యం. ఈ ప్రజ్ఞానం నుండి జ్ఞానం, విజ్ఞానం పుట్టుకొచ్చినట్టుగానే వివేకం, అవివేకం సైతం పురుడు పోసుకున్నాయి. ప్రాపంచికమైన, దైహికమైన, మానసికమైన అనేకానేక భావోద్వేగాలన్నీ వివేక, అవివేక జనితాలే!
‘బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమశ్శమః
సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ’
‘అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః’
ఆధ్యాత్మిక యాత్రలో మనం ప్రస్తావించుకునే ఆత్మ సంబంధిత విషయాలు, బ్రహ్మ సంబంధిత విషయాలు ‘జ్ఞాన’ సంపదలే! పాంచ భౌతిక దైహిక, మానసిక ప్రవృత్తుల నుండి ఆవిష్కృతమయ్యే వికారాలు విజ్ఞాన సంపుటులే! జ్ఞాన సంపద, విజ్ఞాన సంపుటి కాని సత్యావిష్కరణ మాత్రం ప్రజ్ఞాన రహస్యమే! అదే గిక తపనకు పరవావధి.
బుద్ధి, జ్ఞానం, మోహం, సహనం, ఇంద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, అభయం, హింస, అహింస, సమత్వం, సంతోషం, కీర్తి, అపకీర్తి, దానం, తపస్సు అనే భావబంధాలు వికారాలుగా, వివేకాలుగా వెలుగులో కొస్తున్నాయి.
ఇక, మన మానవ అవతరణకు మూల పురుషులు సప్తర్షులైన భృగువు, మరీచి, అత్రి, వులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు ప్లస్ చతుర్మనువులైన సావర్ణి, ధర్మసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్థి. వీరు సృష్టి పాలనకు మూలాంశలు.
‘ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః
సోలికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః’
ఈ జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన త్రయానికి ఆకరమైన ఆత్మనిష్ఠ కలిగిన మానవులే యోగసంపన్నులు. ఈ యోగి పుంగవులకు ‘అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే’ అన్న సృష్టి కార్య-కారణ రహస్యం తెలుసు. సర్వసృష్టికి ఉత్పత్తి స్థితి ‘అహం’. అది ‘ఆది’. అదే ‘ఆరిజిన్’. చలన, అచలన ఆవిష్కరణలన్నీ ఈ ‘ఆది’వే! స్థితి అంటే అస్తిత్వం, ప్రళయం అంటే అస్థితి ప్రవర్తిల్లటానికి మూలం ఈ ఆరిజిన్. ఈ ‘అహం’్భవాన్ని, అంటే ‘పర’ తత్వాన్ని ఆవిష్కరించుకోగలగటమే గిక దర్శనం. అర్జనుడికి ఇచ్చిన వివరణే కృష్ణుడు మనకు అందించిన ‘బుద్ధియోగం’. ఇక్కడ బుద్ధి యోగం అంటే భౌతిక తమస్సు నుండి అధిభౌతిక తపస్సును ప్రజ్వలింపజేయటం. అదే యోగాగ్ని. దాని ఫలమే యోగ విభూతి.
ఈ ఆది తత్వమంతా పరమ తేజస్సే... పరమ పవిత్రమే.. పూర్ణత్వమే.. శాశ్వతత్వమే.. దైవిక తత్వానికి మూల తత్వమే.. సర్వ వ్యాపకత్వమే.. జనన మరణాతీతమే. పైగా చిదాకాశ తత్వమైన పరబ్రహ్మ తత్వమే. ఈ కాలాతీత, కూటస్థ, స్వయం ప్రకాశ చైతన్యాన్ని దేవర్షి అయిన నారదుడి నుండి సప్తర్షుల వరకు తమ గిక ప్రజ్ఞతో ఇలా అందకున్నవారే. ఒక విధంగా ఈ జనన మరణాతీత ‘ఆది’తత్వం అటు దేవతలకు, ఇటు దానవులకు అందిరానటువంటిది.
అందుకే, ఈ పర బ్రహ్మ తత్వానికి రూపమిచ్చి ఆ రూపాన్ని పురుషోత్తముడు అంటున్నాడు అర్జునుడు. పైగా ఆ పురుషోత్తముడ్ని భూత భావనుడిగాను, భూతేశుడుగాను, దేవదేవుడిగాను, జగత్పతిగాను ఆవిష్కరించుకుంటున్నాడు. ‘యోగీశ్వరుడి’గా పరమోన్నత స్థానాన్ని ఆ పరమ పురుషుడి కిస్తున్నాడు. అర్జునుడు కృష్ణుడి నుండి ఆ యోగ విభూతులు విస్తారాన్ని సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు.
ఈ ఆదితత్వ సర్వ వ్యాపకత్వాన్ని దర్శించటమే యోగ విభూతి. అదే విశ్వ దర్శనం.
విశ్వంలో శాశ్వత అస్తిత్వాన్ని కలిగి వున్న ఆత్మ పాంచభౌతిక దైహిక చైతన్యంతో హృదయ స్థానాన్ని ఆక్రమించినట్లనిపిస్తున్నప్పటికీ ఈ ఆత్మచైతన్యమంతా ఆ పరమ చైతన్యమైన ఆది చైతన్యమే. సృష్టి వైచిత్రిలోని సకల భూతాలు అంటే ప్రాణులు; వాటి ఆది - మధ్య - అంతాలు సైతం ఆ ఆది అంశలే!
అదితి పుత్రాంశ అయిన విష్ణుతత్వం, సహస్ర కిరణ సంపన్నమైన సూర్యతత్వం, నక్షత్ర మండల సరసన చేరిన చంద్రతత్వం, మరుత్తులనబడే ప్రత్యేక దేవతాగణంలోని ప్రసిద్ధ మరీచితత్వం, దేవతా గణంలోని ఇంద్రియ తత్వం, రుద్రులలోని శంకర తత్వం, యక్షులలోని కుబేర తత్వం, పురోహిత వర్గంలోని బృహస్పతి తత్వం, సేనా నాయకులలోని కుమార తత్వం, మహర్షులలోని భృగు తత్వం, దేవర్షులలోని నారద తత్వం, గంధర్వులలోని చిత్రరథ తత్వం, సిద్ధులలోని కపిలతత్వం, వసువులలోని అగ్నితత్వం, పర్వతాలలోని మేరుతత్వం, సరస్సుల సాగరతత్వం, అచల హిమవన్నగ తత్వం, వృక్ష సంతతిలోని రావి తత్వం, అ-క్షర ఓంకార తత్వం, ఆయుధ వజ్ర తత్వం, పశు సంతతిలోని కామధేనువు తత్వం, సర్పజగతిలోని వాసుకి తత్వం, నాగ సంతతిలోని అనంతుని తత్వం, జలరాశులలోని వరుణ తత్వం, మృత్యు తత్వమైన యమ తత్వం, మనుజత్వంలోని మన్మథ తత్వం - ఇలా సకల సృష్టికి బీజం ఆదితత్వమే! ఈ తత్వాలన్నీ ఆ ఆరిజన్ యోగ విభూతులే! పైగా ఈ యోగ విభూతులకు అంతం లేదు.. అంటే విశ్వ సంపదలన్నీ ‘ఆది’ స్థితి యోగ విభూతులే.
*

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946