S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఔషధం

‘మీకు మీరే డాక్టర్’ శీర్షికన అందజేసిన వ్యాసం ఉపయుక్తంగా ఉంది. అమీబియాసిస్‌కు ఆహారమే ఔషధం అని తెలుసుకొన్నాం. అలాగే ‘ప్రేమ ఎంత మధురం’ కథ ఆలోచింపజేసేదిగా ఉంది. ఇదొక చిక్కు సమస్య. దీనికి సమాధానం లేదని కాదు. మన సమాజ వ్యవస్థలో ఇది ఒక పెద్ద లోపం కాకపోయినా మగాడు భార్య చనిపోయిన ఏడాదికల్లా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. అది తప్పు అని ఎవరూ హెచ్చరించరు. పైగా ప్రోత్సహిస్తారు. కాని ఆడది అలాంటి సాహసం చేయలేదు. ఒకవేళ వనంలో భర్త చనిపోతే వరో పెళ్లి చేసుకున్న స్ర్తిని చులకనగా చూస్తుంది లోకం. ఈ సమస్యను కథా రూపంలో ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
-సిహెచ్.రామారావు (సికిందరాబాద్)

తప్పిన తరం
‘లోకాభిరామమ్’ శీర్షికన అందజేస్తున్న వ్యాసాలు మాకెంతో ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. ఆయా సంఘటనలు చదువుతూంటే మాకే ఎదురయినట్లుగా ఉంటున్నాయి. ఆ తరం వారు రాజకీయాలు, పరిశ్రమ లాంటి రంగాలలో కూడా కొంత అనుమానంగానే ముందుకు సాగినట్లుంది. తెలివిగల వాళ్లు సంగతి తెలుసుకుంటారు గనుక, తగిన సమయంలో దారి మార్చుకుంటారు. యూనివర్సిటీలో అప్పటి తరం వారిని గురించి చెప్పడానికి ఏకంగా ఒక పుస్తకం రాయాలి. నిజంగా అది పరిశోధించదగిన సామాజిక అంశం. ఇవన్నీ ఏదో సందర్భంలో ఉస్మానియాలో చదివిన వారికి ఎదురయి ఉంటాయి. కొన్ని ఉద్యోగాల ప్రకటనలలో ఉస్మానియా వారు అప్లికేషన్ వేయవద్దు అని రాశారట! నిజంగానే ఇది ఆశ్చర్యం కలిగించే అంశం.
-డి.వి.తులసి (విజయవాడ)

‘నాదానుభూతి’
వారం వారం ఆదివారం అనుబంధంలో మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శీర్షిక ‘అమృతవర్షిణి’. శ్రుతిశుద్ధంగా, తంబురాకి వున్న నాలుగు తీగెలను ఓపికగా శృతి చేయటం.. శ్రుతి జ్ఞానం సంపూర్ణంగాఉన్న వ్యక్తికే సాధ్యం. ఒకవేళ కమ్మని నాదం వచ్చేలా శ్రుతి చేయగలిగినా, శ్రుతి భేదం లేకుండా మీటగలిగే వారెంత మంది? అన్నది అక్షర సత్యం. నిజమైన నాదానుభూతి పొందాలంటే తంబురా శ్రుతి ఒక్కటే శరణ్యం. విద్వాంసులూ, విద్యార్థులూ ఇది గ్రహిస్తే చాలు. నిత్య శుద్ధుడై, ప్రశాంత స్వరూపుడై, శుద్ధ జ్ఞానమే మూర్తిగా, ప్రణవ నాదమైన ఓంకార, ఉపాసన చేసిన త్యాగయ్య, గోవిందస్వామి మనకు ఆదర్శం. మంచి శీర్షికను అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)

బండరాళ్లు
ఈ చరాచర సృష్టిలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. వాటిలో పరిశోధకులు నిగ్గు తేల్చి నిజం తెలుసుకున్నవి కొనే్న ఉన్నాయి. మరి కొన్నింటి వెనుక దాగిన నిజాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. అలాగే అమెరికాలోని మిడిల్ కాలిఫోర్నియా సమీపంలోగల పానామింట్ పర్వత సానువులకు దగ్గరగా ఉండే డెత్‌వాలీ.. మృత్యులోయలో జరగటం ఆశ్చర్యకరం. పానామింట్ ఎడారిలోని రాళ్ల కదలికలను పరిశోధకులు తొంభై ఏళ్ల క్రితమే గుర్తించారని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాం.
-పి.రాంబాబు (మార్కాపురం)

విలన్స్...
‘విలన్స్...’ శీర్షికన అందిస్తున్న కథలు మమ్మల్ని సస్పెన్స్‌లో ముంచెత్తుతున్నాయి. ఈ వారం ప్రచురించిన ‘దొంగ’ కథ చదువుతూంటే క్లైమాక్స్‌కి గానీ.. దొంగ చేసిన పనేమిటో అర్థం కాలేదు. అంత సస్పెన్స్‌ని అందించారు. ఇంటిలోని వస్తువుల్ని దొంగిలించటం చూశాం.. విన్నాంగానీ.. ఇలా ఏకంగా ఇంటినే దొంగిలించే దొంగని చూట్టం ఇదే మొదటిసారి.
-ఆర్.రంగనాథ్ (మాచర్ల)

‘షీ’రోలు!
యాసిడ్ దాడి అనంతరం జీవితం ముగిసినట్లేననుకునే వారు ఎందరో. వారిని అంటరాని వారుగా, పలకరిస్తే సహాయం అడుగుతారేమో నన్నంతగా అటు బంధువులు, ఇటు స్నేహితులు, ఇరుగు పొరుగు వారు - ఒక్కరనేమిటి సమాజంలోప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూసేవారే. అలాంటి విషమ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వారు కొందరైతే.. తమలో తామే కుమిలిపోతూ జీవితాన్ని వెళ్లదీసేవారు మరి కొందరు. వారి జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నప్పటికీ.. వెలుగు వైపు పరుగులు తీయాలన్న వారి ఆత్మస్థైర్యాన్ని చాటి చెప్పినందుకు కృతజ్ఞతలు.
-వి.మమత (వరంగల్)

ఒక్క తూటా...
కథ అనేకానేక మలుపులు తిరుగుతూ ఆద్యంతం సస్పెన్స్‌ని అందిస్తోంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పరిచయం ఉన్నవారికి ఈ కథ మరింత ‘కనెక్ట్’ అవుతుంది. అలాగే ‘విలన్స్...’ లోకాభిరామమ్.. వినదగు’ శీర్షికలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.
-సిహెచ్.ఆంజనేయులు (అనకాపల్లి)

కథాసాగరం
ఈ శీర్షికన అందించిన ‘సూట్‌కేసు’ కథ ఆథ్యాత్మిక జీవితానికి ఎంతో దగ్గరగా ఉంది. జీవించిన క్షణం మాత్రమే నీది. జీవితం క్షణ క్షణం క్షణికం. అందువల్లే నీకు అందిన క్షణాన్ని ఆనందించు. ప్రపంచంలో ఉన్నదేదీ నీది కాదు. ‘ఇప్పుడు జీవించు. జీవితాన్ని జీవించు. సంతోషంగా ఉండటం మరచిపోవద్దు. తెలుసుకోవాల్సిన విషయమదొక్కటే.. అన్న మాటలు మా మనస్సుల్లో నాటుకుపోయాయి.
-బి.మానసరెడ్డి (నంద్యాల)