S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విస్తట్లో విషాలు ( మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: పురుగు మందులు కొట్టిన ఆకుకూరలు మంచివేనా?
- సదాశివరావు (గుంటూరు)
జ: భూలోక స్వర్గంగా మనకు తెలియకుండానే వ్యామోహం విపరీతంగా పెంచుకున్న అమెరికా దేశపు కూరగాయలు, తెలుగు వారి కూరగాయలకన్నా గొప్పవేమీ కావని తేలిపోయింది. ఇక్కడి కాయలకన్నా లావుగా, పొడుగూ ఉంటాయనుకుంటాం గానీ, ఆ మేరకు వాటిలో పురుగు మందుల అవశేషాలు కూడా ఎక్కువగానే ఉంటాయని ఇటీవలి ఒక విశే్లషణ చెప్తోంది. ఇక్కడ మన పండ్ల వ్యాపారులు మూడు రూపాయలు కూడా ఖరీదు చెయ్యని యాపిల్ పండు మీద బార్ కోడ్ స్టిక్కర్ అంటించి 15 నుండి 25 రూపాయలకు అమ్ముతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవేళ అవి నిజంగా ఫారిన్ నుండి వచ్చినవే అనుకుంటే వాటిని తినకుండా ఉండటమే మేలని ఈ పరిశోధనలు చెప్తున్నాయి.
సిఎన్‌ఎన్ వార్తా సంస్థ 2017 మార్చి 9న ఇచ్చిన సమాచారంలో ఈ పరిశోధనా వివరాలున్నాయి. అమెరికన్ వ్యవసాయ శాఖ, ఆహార శాఖ అక్కడ దొరుకుతున్న 36 వేల రకాల పండ్లు, కాయగూరల్ని పరీక్షించి వాటిలో 20 రకాల పురుగు మందుల అవశేషాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయని ఈ వార్త సారాంశం. ఈ విధంగా కాయగూరల్లో పురుగు మందుల మోతాదు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా 2వ స్థానానికి చేరినట్టు కూడా ఈ వార్త చెప్తోంది. స్ట్రాబెర్రీస్ లాంటి పళ్లు, పాలకూర లాంటి ఆకు కూరల్లో ఈ విషాల స్థాయి ఎక్కువగా ఉన్నదట.
అది అమెరికా కావచ్చు. ఇండియా కావచ్చు. తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పాదకత కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రైతులు విచక్షణా రహితంగా వాడుతున్న ఎరువులు, పురుగు మందుల వలన కూరగాయలు, పండ్లు తియ్యని విషాలై పోతున్నాయని ఈ వార్తను ఉటంకిస్తూ ‘మెడ్ పేజి టుడే’ పత్రిక వ్యాఖ్యానించింది. స్ట్రాబెర్రీలు, యాపిల్స్, ద్రాక్ష, బెల్ పెప్పలు, చెర్రీలు లాంటి 12 రకాల పండ్లను ‘ది డర్టీ డజన్’గా అభివర్ణించింది. అక్కడ దొరికే ఆలూ దుంపలు రక్షణ లేనివే.
ఈ విషాలు 15 రకాల కూరగాయల్లోనూ పండ్లలోనూ కొంత తక్కువ స్థాయిలో ఉన్నట్టు గమనించారు. తీపి మొక్కజొన్న, అక్కడ దొరికే అవొకాడో పండ్లు, పైన్ యాపిల్, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, బొప్పాయి, తేగలు, మామిడి, వంకాయ ఇలాంటివి ఉన్నాయి. సరిగ్గా అక్కడ పరిస్థితి ఇక్కడి పరిస్థితికి నకలుగానే ఉన్నదని దీని భావం. ఏ దేశ వాణిజ్య ప్రయోజనాల కోసం మనం మన సంప్రదాయ వ్యావసాయక పద్ధతులు ధ్వంసం చేసుకుని, విషాలు పోసి పంటలు పండించటం మొదలు పెట్టామో ఆ దేశం ఇప్పుడు తియ్యనైన విషాల గురించి భయపడుతోంది. మనం మా తరం నిర్భయంగా వాటికి అలవాటు పడిపోతున్నాం. తినగ తినగ వేము తియ్యనుండు కదా!
‘పొలం నుండి పళ్లెం’లోకి ఈ విషాలు నేరుగా ప్రవేశిస్తున్నాయి. కూరగాయల్లో విషాల అవశేషాలను కొలిచే పరీక్షని ఘనజౄఖౄ గళఒజజూఖళ జళ్పళ (్గజ) పరీక్ష అంటారు. రైతులు ప్రత్యేకంగా పండించకుండా వాటంతట అవే పుట్టి పెరిగి ఫలించే మొక్కల్లో విషాల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. బాటచెట్లుగా, అడవి చెట్లుగా లేదా పెరటి చెట్లుగా ఉన్న చింత, వేప, రేగు, మామిడి, సీతాఫలం, మామిడి, నేరేడు, అరటి, బాదం వీటి ఉత్పత్తుల్లో పురుగు మందులు ఉండవు. వాటి మానాన అవి పెరిగే ములక్కాడల రుచి తోటలు వేసి రైతులు పండించే కాడలకు లేకపోవటానికి విచక్షణ లేకుండా విష రసాయన ఎరువులు, పురుగు మందులే కారణం. ఒకప్పటి రామములక్కాయల అద్భుత రుచి రోట్లో వేసి రుబ్బినా నలగని ఈనాటి టమోటాలకు లేకపోవటానికి ఈ విషాలే కారణం. ఇంక తోటకూర, పాలకూర సంగతి చెప్పనే అక్కరలేదు. ఆకుల మీద తెల్లగా పురుగు మందు అట్టగట్టి ఉంటుంటే కడుక్కుని తింటున్నాం. రుచి మాట దేవుడెరుగు, కడుపు నిండాలి కదా!
ముల్లంగి దుంపలు ఎంత గుణకరమో, ముల్లంగి ఆకులు కూడా అంతే రుచికరం. ఆరోగ్య దాయకం కూడా! కానీ, ముల్లంగి ఆకులు చూస్తేనే విషం కోటింగ్ వేసినట్టు భయంకరంగా ఉంటున్నాయి.
అకారణంగా కేన్సర్ వ్యాధి ముంచుకు రావటానికి ఆహారంలో తియ్యని విషాలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం అవుతున్న సంగతి మనం గ్రహించాలి. సామాన్య మానవుడు ఇలాంటి విషాహారాల నుండి తనను తాను రక్షించుకోలేని దుస్థితి ఇది. వీటిని నియంత్రించే అధికారాలు ఉన్నా ప్రభుత్వం చూసీ చూడనట్టే పోతోంది. ప్రజలు ఉచితంగా అన్నం అడగటం లేదు. విషాలు లేని ‘పట్టెడు కూడు’ అడుగుతున్నారంతే!
పత్రికల్లో అలజడి వచ్చిన రోజు కాసేపు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత మళ్లీ వౌనవ్రతం పాటిస్తారు. పండ్ల మార్కెట్టంతా కార్బైడ్ కంపుతో నిండి ఉన్నా.
కాయగూరల కన్నా ఆకుకూరలు ఎక్కువ పురుగు మందును కలిగి ఉంటాయి. కడుక్కొంటే పోతుందా విషం...? ఈ విషాలు స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా మన శరీరాన్ని విషపూరితం చేస్తాయి. కేన్సర్లు, ట్యూమర్లు, ఇంకా ఇతర భయంకర వ్యాధులు రావటానికి 30% కారణాలు ఈ విషాహారాలేనని చెప్తున్నారు శాస్తవ్రేత్తలు.
ఇందుకు కేవలం రైతుల్ని తప్పుబట్టి ఊరుకుంటే ఈ చర్చ నిష్ఫలమే అవుతుంది. కూరగాయల్లోనూ, ఆకు కూరల్లోనూ అంతర్గతంగా ఉండే విషాల సంగతి అలా ఉంచండి.. వాటిని వండుతున్న తీరులో మనం ఎనె్నన్నో విషాలను అదనంగా చేరుస్తున్న సంగతి కూడా గమనించాలి. ఆహారంలో రకరకాల రంగులు కలపటం చేజేతులా విషం తెచ్చి కలపటమే! ఆకుపచ్చ రంగు కారప్పూస, నీలిరంగు బూందీ, తెల్లని స్వీట్లు, కేకులు, రంగురంగుల బిస్కట్లు, కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రీములు ఒకటేమిటీ, ఆఖరికి అప్పడాలు, వడియాలు కూడా రంగు విషాల మయం. మార్కెట్‌లో దొరికే పాలు పాలు కావు, తేనె తేనె కాదు. నెయ్యి నెయ్యి కాదు, నూనె నూనె కాదు, త్రాగునీళ్లు నీళ్లు కావు, పసుపు, కారం అన్నీ కల్తీ.. కల్తీ.. విస్తట్లో విషాలను వడ్డించుకుంటూ ఎవరినో నిందిస్తే ప్రయోజనం ఏముంటుంది?
స్వచ్ఛ భారతాన్ని ప్రకటించిన ప్రభుత్వాలు స్వచ్ఛ ఆహారం గురించి గట్టి చర్యలు తీసుకునేలా మనం బిగ్గరగా మాట్లాడాలి. సహజంగా పండుతున్న కూరగాయలు, ఆకుకూరలకు ప్రాధాన్యత నివ్వాలి. సొరకాయ లాగానే సొర ఆకులు కూడా రుచికరమైనవే! ఏ మాత్రం అవకాశం ఉన్నా పెరట్లో స్వంతంగా కూరగాయలు పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఖాళీ స్థలాల్లో మనం తినదగిన ఆకు కూరలు చాలా పెరుగుతాయి. చిర్రికూర, గంగపావిలి కూర, కొండపిండి, గలిజేరు, పొన్నగంటి, గుంటగలగర, దుష్టుప తీగె, పారిజాతం ఆకులు, ఒకటేమిటీ అనేకం ఆహార యోగ్యమైన ఆకు కూరలు దొరుకుతున్నాయి. వాటిని వదిలేసి మనం మార్కెట్ మీద ఆధారపడిపోవటం వలన వ్యాపారులకు అలుసై పోయాం. ఎంత కల్తీ కలిపినా జనం వెర్రివాళ్లలా కొంటారనే ధీమా వాళ్లకు కల్పిస్తోంది మనమే. ఈ రైతులు, కల్తీదారులు, వాళ్లని నిరోధించాల్సిన అధికారులు కూడా ఈ విషాలనే అన్నంగా తింటున్నారు. వాళ్లూ చెడిన వ్యవస్థలో భాగంగా చెడుతూ చెడగొడుతూ జీవిస్తున్నారు.
తెలుగు వాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించే ఏదైనా కొంటారని, వెర్రి వ్యామోహాలు వాళ్లకి లేవనీ, వాళ్లను మోసం చేయటం అంత తేలికేమీ కాదనీ, ఇక్కడ కల్తీదారుల పప్పులు ఉడకవనీ మన గురించి పండించేవారు, విషాలను కలిపేవారు చెప్పుకునే రోజులు రావాలని ఆశ.

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642