S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉవ్విళ్లూరించే ఉగాది

రాత్రంతా కమ్ముకున్న అమావాస్య నలుపును
కళ్లు నులుపుకున్నా కనిపించని చీకటిని
వాకిటినుంచే తరిమేస్తూ వొస్తోంది
వెండి వెలుగుల కాంతిని ఒళ్లంతా నింపుకుని
వొయ్యారంగా వేకువ -
రేడియో పెట్టగానే వినిపించే సుప్రభాత గీతంలా
మామిడి గుబురుల్లోంచి పాడేస్తోంది కోకిలమ్మ -
అప్పుడే ఎదిగిన మల్లెలూ, విచ్చుకున్న వేపపూలూ
తమ సుగంధాలను వెదజల్లుతూ
ఇల్లంతా సందడి చేస్తున్నాయ
మామిడి ముక్కల చిరు పులుపు వాసన
కొత్త కొబ్బరి ముక్కల తియ్యని రుచి
కొత్త బెల్లపచ్చుల కమ్మదనం
నోరూరించేస్తున్నాయ
పాత జ్ఞాపకాల జావళీకి కొత్త ఊహలు
నాట్యం చేస్తుంటే
వంట యంట్లోంచి వీచే పరిమళ సుగంధం కన్న మిన్నగా
బొబ్బట్ల వాసనా, పులిహోర పోపూ
మత్తెక్కించేస్తున్నాయ
బాధలన్నీ గాథల్లా మాసిపోయ
జీవితం అందాల బృందావనంలా అగుపిస్తుంది
ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క పేరుతో వొచ్చి
గడప గడపనీ తాకుతావు
వయోభేదం లేకుండా అందరినీ అక్కున జేర్చుకుంటావు
రా! హేవళంబీ! రా...
నీ కోసం గది తలుపులు మది తలపులు వేచివున్నాయ
నువ్వేం చెయ్యదల్చుకున్నావో నీ సుద్దుల పద్దులు వినిపంచు
ఆనందంతో మమ్మల్ని అలరించు
ఉత్సాహంతో నీకిదే మా స్వాగతం
ఉగాదీ... రా... రా...

- శారదా అశోకవర్ధన్, 9866021570