S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (మార్చి 26 నుండి ఏప్రిల్ 1 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

పాత జ్ఞాపకాలు ఆధారంగా ప్రస్తుతం అంతా సవ్యంగా జరిగేట్లుంది. ధైర్యంతో అవకాశాలను అందిపుచ్చుకోండి. మిత్రులు, బంధువులు సమయానికి ఆదుకుంటారు. కొత్తవారితో జాగ్రత్తగా మెలగండి. ఆర్థికంగా వొకింత వృద్ధి ఉన్నప్పటికీ అప్పు చేయాల్సి వస్తుందేమో చూసుకోవాలి. స్ర్తిలకు మంచి సమయం. సిబ్బంది చేరువతో ఇబ్బందులు దూరమవుతాయి. మెళకువలు అన్నింటా పాటించండి. స్పెక్యులేషన్ మిశ్రమం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

మీ లక్ష్యాలను నెరవేరుస్తారు. అనుకున్న పనులు నత్తనడకన సాగుతాయి. ధనం ఇంధనంగా అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహార రంగాలు వృద్ధి బాటలో ఉంటాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మన్ననలు అందుకుంటారు. స్పెక్యులేషన్ శ్రమానుకూలం. ఉద్యోగస్తులకు మంచి రోజులు. సేవా కార్యక్రమంలో మీ పాత్ర ఉంటుంది. అందరినీ ఒకే గాటన కట్టివేసేట్టు చూడకండి. మేలైన జీ(వి)తాన్ని అందుకుంటారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రణాళికల మేరకే కార్యాలు పూర్తి చేయాలి. చెల్లింపుల విషయంలో తొందర కూడదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అన్నింటా సంతృప్తి. లౌక్యంతో మెలగాలి. కొత్త పరిచయాలు ప్రయోజనకారి. ఊరికి ఉపకారి చందాన కాకుండా మీ పనులు ముందు పూర్తి చేసుకోండి. విద్య, వృత్తి, వ్యాపారాలు మెరుగు పడతాయి. దంపతులు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. నిర్ణయాలు పరిణయాల దాకా రావచ్చు. స్పెక్యులేషన్‌లో తృప్తి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

విషయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. సవ్యంగా రమ్యంగా పనులు నిర్వహిస్తారు. మిత్రులు మీకు ఆందోళన కలిగించేట్లున్నారు. అన్నింటా గమనింపు అవసరం. ఆర్థిక పుష్టి. ఒత్తిడిని అధిగమించాలి. ఆస్తి వృద్ధి. వస్తు, వస్త్ర ప్రాప్తి. అన్నింటా సంతృప్తి. కొత్త పదవులు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు ఉల్లాసం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విదేశీ యత్నాలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్‌లో లబ్ధి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక విషయాలు ఆలోచింపజేస్తాయి. ప్రయోజనకారిగా ఉంటాయి. గత మెళకువలు ప్రస్తుతం అనుకూలం. ఆత్మీయులు అవసరానికి సాయం చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు మంచి తరుణం. ఆందోళన తగ్గించుకోండి. వాతావరణానికి అనుగుణంగా మెలగాలి. స్పెక్యులేషన్‌లో గుర్తింపు వర్తిస్తుంది. కుటుంబ సభ్యులు ఉల్లాసభరితమైన జీవితం గడుపుతారు. ఉద్యోగానే్వషణ ఫలప్రదం. అనుకున్నవి జయప్రదంగా నిర్వర్తిస్తారు. శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

మంచి సమయం. సంయమనం అన్నింటా పాటించాలి. ఆర్థికంగా నిలదొక్కుకున్నా అనుకోని ఖర్చులుంటాయి. ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేయవద్దు. కోర్టు వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలందు అపార శ్రమ అనంతరం ప్రయోజనం. స్పెక్యులేషన్ తృప్తినిస్తుంది. ప్రయాణాలందు అప్రమత్తత మేలు. బద్దకం విడనాడండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

కార్యాలను పూర్తి చేస్తారు. పరిచయాలు మెరుగవుతాయి. ఆస్తి విషయాలందు వృద్ధి. అనుకోని ధనం అందేట్లుంది. శత్రువులు తగ్గుతారు. మిత్రుల సాయం వీలుంటే తీసుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. కొనుగోలులో అప్రమత్తంగా ఉండండి. అపహాస్యం కాకుండా లౌక్యంతో ముందుకెళ్లండి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. మంచి వార్తలు వింటారు. విద్యార్థులు శ్రమానుకూల ఫలితాలను అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

మంచి సమయం. శక్తికి అనుగుణంగానే కార్యక్రమాలు పూర్తి చేయాలి. మిత్రులు, హితులు అవసరానికి ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు ఇతరుల ప్రమేయం వద్దు. అధికారుల అండదండలుంటాయి. ప్రయాణాలందు, విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్‌లో తృప్తి. దంపతులు, స్ర్తిలు, విద్యార్థులు సరైన ఆలోచనలతో మెలగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆహ్లాదంగా ఉంటారు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. గుర్తింపును పొందుతారు. గౌరవ మర్యాదలు మెరుగవుతాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తులలో పోటీ తత్వానికి అనుగుణంగా మార్పులుంటాయి. ఇతరుల ప్రమేయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ మిశ్రమం. శ్రమలేని వ్యవహారాలందు లక్ష్యం పెట్టండి. దంపతులు వదంతులు నమ్మకండి. ఆందోళన చెందవద్దు. స్ర్తిలు అనుకున్నవి పూర్తి చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ధైర్యంతో ముందుకెళ్లండి. విమర్శలున్నా తిప్పికొట్టగల్గుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు సమాజంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మిత్రులు మీ మాటలకు విలువను పెంచుతారు. కంటి, పంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. దంపతులకు మంచి తరుణం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ఆర్థిక విషయాలలో ప్రగతి. మీ ఆలోచనల మేరకు పనులు పూర్తి చేస్తారు. అన్నింటా సంతృప్తి. బంధుమిత్రుల రాక. అనవసర ఆలోచనలు వద్దు. ఆస్తి విలువలు పెరుగుతాయి. గౌరవ మన్ననలు అందుకుంటారు. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. శుభ కార్యాలు, విందు వినోదాలలో పాల్గొంటారు. అన్నింటా అతి జోక్యం కూడదు. లౌక్యం ప్రదర్శించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థికంగా బలపడతారు. ఖర్చులున్నా తృప్తినిస్తాయి. ప్రయత్న పూర్వకంగా అన్నింటా జయాన్ని పొందుతారు. గమనింపు ముఖ్యం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఫలప్రదం. ఇతరులు మీ మాటలు విని లాభపడతారు. వృద్ధికి అనుగుణంగా ప్రయత్నాలు సాగించండి. మంచి సమయాన్ని వినియోగించుకోవాలి. సమస్యల పరిష్కారానికి ఆలోచనలు మేలు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855