S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహానుగ్రహం

04/17/2016 - 05:18

ఆగస్టు 11, 2016 రాత్రి గురువు కన్యా రాశిలో ప్రవేశించిన కారణంగా మనకు పుష్కర విశేష దినములు 12 రోజులను 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్థారించారు. అయితే ఈ పనె్నండు రోజులు పుష్కరుడు 24 గంటలు కూడా నది మీదనే సర్వ దేవతా గణములతో కలిసి విహరిస్తారు. మరి ప్రతి నిమిషము ఒక విశేషమయినదే.

04/11/2016 - 02:42

ప్రస్తుతం నడుచుచున్న దశ, అంతర్దశలనాదులతో వైరం వున్న గ్రహాలకు సంబంధించిన రత్నం ధరింపవలసిన ఆవశ్యకత ఉన్న యెడల... జాతకంలో గ్రహ బలములు యోగములు పరిశీలించి ధరించవలెను. అవయోగ గ్రహములకు సంబంధించిన రత్నములు ధరించుట శ్రేయస్కరం కాదు.

04/03/2016 - 11:28

రెండు లేదా అంతకన్నా ఎక్కువ రత్నాలు ధరించే అంశం. మనవారు ఎన్నో విచిత్రాలు చూపుతున్నారు. కెంపు నీలం ధరింప చేయిస్తున్నారు. రెండు రాళ్లకు రవి, శని అధిపతులు. మరి శత్రువులను ఇరువురినీ కలిపి చేతికి ధరించడం ఎంతవరకు సమంజసం. అదే రీతిగా రవి శుక్రులు కలిస్తే మూఢమి, రవి గురువులు కలిస్తే మూఢమి. మరి మూఢమి సూచికమయిన ఆ రెండు రాళ్లను చేతికి ధరిస్తే పరిస్థితి ఎలాగ ఉంటుంది.

04/03/2016 - 01:35

సుబ్బయ్య పట్నానికి వెళ్లి ఒక టీవీ, రెండు సెల్‌ఫోన్స్, ఒక ట్రాన్సిస్టర్ కొన్నాడు. టీవీ కొన్న రేటులో నాలుగో వంతు ధరలో రెండు సెల్‌ఫోన్స్ కొనొచ్చు. ఒక్క సెల్‌ఫోన్ ధరతో ఆరు ట్రాన్సిస్టర్లు కొనొచ్చు. మొత్తం అన్నీ కొనటానికి 13,725 రూపాయలు అయ్యింది. అయితే టీవీ, ఒక సెల్‌ఫోన్, ట్రాన్సిస్టర్ ఖరీదు ఎంత?

జవాబు: టీవీ రూ.10,800, ఒక్క సెల్‌ఫోన్ రూ.1,350, ట్రాన్సిస్టర్ రూ.225

04/03/2016 - 01:31

సంగీత, సాహిత్యాల్లో మాధుర్యాన్ని కోకిలగానంతో పోలుస్తారు. రూపానికి, స్వరానికి హస్తిమసికాంతరం తేడా ఉన్న కోకిల చేసే వసంతగానంతో మైమరిపోని వారుండరు. ఇంతకీ అంత అందంగా పాడే కోకిల ఏదంటే...నమ్మలేని నిజం తెలుసుకోవలసి ఉంటుంది. ఎర్రటి కళ్లు, కొనదేరిన ముక్కు, నల్లని మేనితే కన్పించే మగకోయిల తన జతగా ఆడపక్షిని ఆకర్షించడానికి పడే తపనతో చేసే స్వరాపనే అది.

04/03/2016 - 01:29

విల్సన్ రైట్, ఆర్విల్ రైట్ అనే సోదరులు అమెరికా దేశస్థులు. విల్సన్ ఇండియానా రాష్ట్రంలోని మిల్‌విల్ అనే పట్టణంలో 1867 ఏప్రిల్ 16, ఆర్విల్ ఒహాయ్ రాష్ట్రంలోని ‘పేటన్’ అనే పట్టణంలో 1871 ఆగస్టు 19న జన్మించాడు. వీరి తండ్రి మత ప్రవక్త. కుమారులకు కూడా ఇదే రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ వారిద్దరికీ చిన్నప్పటి నుండీ యంత్రాల మీద, యంత్ర పరికరాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది.

03/26/2016 - 23:00

రత్నములు ధరించడం వలన జాతకంలో లేని యోగములు కూడా సిద్ధిస్తాయి అని అనుకోవడం చాలా తప్పు. నేటి సమాజంలో వ్యాపార ధోరణితో ఈ ‘రత్నశాస్త్రం’ ఉపయోగిస్తున్నారు. ఈ రత్నం పెట్టుకోండి మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ రత్నం పెట్టుకోండి మీకు ఉద్యోగం వస్తుంది. అలాగే వివాహం, సంతానం వంటివి ఎన్నో అంశాల మీద చాలా ఉపన్యాసాలు చెప్పి రత్నాలు ధరింపజేస్తున్నారు.

03/20/2016 - 00:32

నీలం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, చిత్త, ధనిష్ఠ, మృగశిర నక్షత్ర దినములలో కొనుగోలు, ధారణ పనికిరాదు. అయితే ఈ నక్షత్రాల వారు కూడా ధరించకూడదు.
గోమేధికం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, శ్రవణం, హస్త, రోహిణి నక్షత్ర దినములలో కొనుగోలు చేయుట, ధారణ చేయుట పనికిరాదు. ఈ నక్షత్రాల వారు కూడా ధరించకూడదు.

03/13/2016 - 21:07

కెంపు: మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుర్మీన లగ్న సమయముల యందు. రవి 6,8,12 స్థానములలో లేకుండా, రవి శత్రు నీచ క్షేత్రాలలో లేకుండా చూచి ధరించాలి. రాహు, కేతువులు ముహూర్త సమయంలో రవితో కలవకూడదు.

03/05/2016 - 20:56

సాధారణంగా నవరత్నాలను అన్నింటినీ కలిపి ధరించుట అందరికీ శ్రేయస్కరమైన విషయమే. అయితే విడివిడిగా ధారణ చేసే విషయంలో మాత్రం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధమైన రత్నాన్ని ధరించినప్పటికీ ఆ రత్నానికి సంబంధించిన గ్రహం యొక్క జపం పూర్తిగా చేయించి ఆ రత్నాన్ని శివుని దగ్గర ఉంచి అభిషేకం చేయించి ఆ గ్రహానికి సంబంధించిన వారములలో కానీ లేదా తారాబలం కుదిరిన రోజులలో కానీ ధరించాలి.

Pages