S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

10/23/2016 - 00:48

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ మధ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ దేశంలోని ఓ గిరిజన తెగకు చెందినవారు తమ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబించేలా తయారై వచ్చారు. ఆహూతులను తమ చేష్టలతో అలరించారు. సందర్శకులపైకి బాణాన్ని ఎక్కుపెట్టినట్లు ఫోజులిచ్చారు. ప్రపంచం ఎంత ఆధునికతవైపు పరుగుతీస్తున్నా తమ సంస్కృతిని మరచిపోమని వారు చెబుతున్నారు. ఈ తెగవారు పపువాన్యూగినియా ప్రాంతంలో నివసిస్తున్నారు.

10/23/2016 - 00:47

మార్షల్ ఆర్ట్స్‌లో ఇలా పలకలు పగలగొట్టడం ఓ విద్యావిశేషం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా అభ్యాసం చేస్తున్నది ఔత్సాహికులు కాదు. దక్షిణ కొరియాలోని ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న సైనికుల శిక్షణ కార్యక్రమం ఇది. ఓ సైనికుడు ఇలా ఒక్కదెబ్బతో పదులసంఖ్యలో కాంక్రీట్ ఫలకాలను ధ్వంసం చేయడం విశేషం.

10/23/2016 - 00:45

ఇక్కడ వరుసగా ఉన్న వాహనాలన్నీ ఒకే రంగులో ఉన్నాయేమిటా అని అనుకోకండి. వాటిపై దట్టంగా బూడిద పరుచుకుంది. దాంతో అవి అలా కన్పిస్తున్నాయి. జపాన్‌లోని ప్రఖ్యాత అగ్నిపర్వతం అసో విస్ఫోటనంతో ఆ ప్రాంతం అంతా బూడిద ఎగసిపడింది. దీంతో అప్పటికే అక్కడున్న ప్రాంతం అంతా బురద, బూడిదతో
నిండిపోయింది.

10/15/2016 - 21:33

హిందూ సంప్రదాయంలో గోమాతకు పవిత్రస్థానం ఉంది. ఉత్తర భారతంలోని అలహాబాద్ వద్ద ప్రవహిస్తున్న గంగానదీ తీరంలో ఓ గోమాతకు ప్రసాదం పెట్టి ఓ వ్యక్తి ఇలా భక్తిపూర్వకంగా నమస్సులందజేస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

10/15/2016 - 21:31

చైనాలోని ప్రఖ్యాత వెడ్డింగ్ డ్రెస్ మార్కెట్ ఇప్పుడు కళకళలాడిపోతోంది. వివాహదుస్తుల విక్రయానికి ఆ మార్కెట్ పెట్టిందిపేరు. జింగ్సు ప్రావిన్సులోని సుజౌలో ఈ మార్కెట్ ఉంది. ఇక్కటి వారు పెళ్లిదుస్తుల విక్రయంలో గిన్నిస్ రికార్డు కొట్టేయాలని తలపోశారు. అంతే ఓ పిలుపు ఇచ్చారు. ఒకేసమయంలో వివాహానికి సిద్ధంగా ఉన్న వందలాదిమంది అక్కడికి చేరారు. పెళ్లిదుస్తుల కొనుగోలుకు సిద్ధమయ్యారు.

10/15/2016 - 21:29

నచ్చిన విషయాన్ని చెప్పడానికి చాలామంది బొటనవేలిని ఇలా ఎత్తి చూపిస్తారు కదా. రియల్లీగుడ్ ఆర్ట్ పేరిట ప్రఖ్యాత చిత్రకళాకారుడు డేవిడ్ కూడా అదే పని చేశాడు. కాకపోతే థంబ్ ఇలా పైకి ఎత్తిన భంగిమలో ఓ కళఖండాన్ని రూపొందించి ప్రదర్శనకు ఉంచాడు. ఇది అందరినీ ఆకట్టుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత ట్రఫాల్గర్ స్వేర్‌వద్ద ఇది దర్శనమిస్తోంది.

10/08/2016 - 22:38

ప్రపంచంలో సేవలు అందించే అతి పొట్టి శునకంగా గిన్నిస్ రికార్డు సాధించిన ఈ చిట్టిపొట్టి కుక్క పేరు లూసీ. లండన్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన ఈ పొట్టి శునకం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులకు మానసికంగా వారిలో ఉత్సాహం నింపడానికి పనిచేస్తోంది. తరచూ హాస్పిటల్స్, నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లను సందర్శిస్తూ రోగుల వద్దకు వెళుతుంది. దీని ఆకారం, చేష్టలు చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తూంటారు.

10/08/2016 - 22:36

ఆధునిక ప్రపంచంలో ఫ్యాషన్ షోలకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటికప్పుడు సృజనాత్మకతో కూడిన దుస్తులతో అందాల భామలు ఆహూతులను అలరించడం మామూలే. పారిస్‌లో ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలో జపాన్‌కు చెందిన ఓ మోడల్ ఇలా రోబోక్యాప్‌తో క్యాట్‌వాక్ చేసి ఆహుతులు వాహ్ అనేలా చేసింది.

10/08/2016 - 22:34

తలకు రెండుపక్కాలా ఈకల్లాంటివి కట్టుకుని శరీరంపై ఒక పద్ధతిలో రంగులు అద్దుకుని కనిపిస్తున్న ఈ బాలుడు ఇథియోపియాలోని ఓ గిరిజన తెగకు చెందినవాడు. ఆ దేశంలో అరుదైన 24 గిరిజన జాతులు తమ సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడిపోకుండా కాపాడుకుంటున్నారు. అందులో భాగంగా ఈ మధ్య జరిగిన ఓ ప్రదర్శనకు ఈ బాలుడు తమ సంప్రదాయ శైలిలో ఇలా తయారై వచ్చాడన్నమాట. అన్నట్లు ఇథియోపియాలోని సౌత్‌ఒమొలో ఈ తెగవారు ఎక్కువగా ఉంటారు.

10/02/2016 - 00:17

భారత్‌లో ఇప్పుడు దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పొరుగు దేశమైన నేపాల్‌లోనూ ఆ సందడి కన్పిస్తోంది. ఆ దేశ రాజధానిలో విజయ దశమి వేడుకల సందర్భంగా ఓ బాలిక దుర్గాదేవి భక్తురాలిగా వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది.

Pages