S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

09/03/2016 - 21:18

ఈ మధ్య బాగా ప్రజాదరణ పొందిన రియాల్టీ వీడియోగేమ్ పోకెమాన్ జనజీవనంలో భాగమైపోయింది. పోకెమాన్ గుర్తులున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు తినే పదార్థాలూ పోకెమాన్ పేరుతోనే సిద్ధమమవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ రెస్టారెంట్‌లో కేవలం పోకెమాన్ బర్గర్‌లు, పిజ్జాలు మాత్రమే విక్రయిస్తున్నారు. వాటికి ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది.

09/03/2016 - 21:12

తక్కువ వ్యవధిలో ఎక్కువ తినడం అన్న పోటీ సాధారణమే. స్పెయిన్‌లోని సెయింట్ బాత్రోలోమ్ ఫెయిర్ సందర్భంగా అక్కడ పుచ్చకాయలు తినే పోటీ నిర్వహించారు. తక్కువ సమయంలో ఎవరు ఎక్కువ పుచ్చకాయలు తింటే వారే విజేత. ఈ పోటీలో పుచ్చకాయ తినేందుకు ఇలా అవస్థపడుతున్నాడీ యువకుడు. కాగా జర్మనీలో ఇటీవల నిర్వహించిన పశువుల పరుగుపందెంలో తన పెంపుడు ఎద్దును కదలమంటూ ఇలా నెడుతోంది ఓ మహిళ.

08/27/2016 - 22:38

తన పెంపుడు శునకం ఈతకొడుతూంటే ఫొటో తీయాలని ఉబలాటపడిపోయింది చైనాకు చెందిన ఓ యువతి. సరే, అందుకు తగ్గ విధంగా ఫోజిచ్చిన ఈ శునకం ఎంత శ్రద్ధగా ఫొటో తీయించుకుంటోందో చూడండి మరి. చెంగ్డు నగరంలోని ఓ స్విమ్మింగ్‌పూల్ వద్ద ఈ దృశ్యం కన్పించింది.

08/27/2016 - 22:37

ఎండలో తిరగడం వల్ల మోము నల్లబారకుండా, అతినీలలోహిత కిరణాల ప్రభావం లేకుండా, ఈతకొట్టేటపుడు జెల్లీఫిష్‌వంటి వాటివల్ల ప్రమాదం కలగకుండా ఉండేందుకు వాడే మాస్క్‌లను ఫేస్కిని అంటారు. చైనాలో ఎక్కువగా వీటిని వాడతారు. వివిధ రంగుల్లో ఉండే ఈ మాస్క్‌లు మెత్తగా, వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి. క్వింగ్డొ నగరంలో ఓ వ్యక్తి ఇలా ఫేస్కిని మాస్కోతో అందరినీ ఆకట్టుకున్నాడు.

08/27/2016 - 22:36

కళాకారుల ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్ ఫొటోగ్రాఫర్ ‘జెఆర్’ ఆలోచనలూ అలాంటివే. ఒలింపిక్ కమిటీ ఆహ్వానం మేరకు ఈ మధ్య రియోడిజెనీరో వెళ్లిన ఆయన తను తీసిన ఫొటోలను, ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలవద్ద ఇలా కళాఖండాలుగా తీర్చిదిద్దాడు. ప్లాస్టర్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో వీటిని రూపొందించాడు. ఈ కళలో ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు.

08/20/2016 - 21:44

ఈమె రంగురంగుల కురుల సుందరి. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇప్పుడో సంచలనం. రంగుల్లో సింగారించుకున్న ఆమె పొడవైన కురులే ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టాయి. ఈమె శిరోజాల పొడవు నాలుగు అడుగులు. అతిపెద్దవైన ఆ కురులకు కాస్త విభిన్నమైన రంగులద్ది, జాగ్రత్తగా అలంకరించుకుని ఇలా ప్రదర్శనలివ్వడం ఆమెకు అలవాటు. ఇలా తీసుకున్న వేలాది చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఆమెకు మరింత ఇష్టం.

08/20/2016 - 21:41

మ్యూజియం నోరూరించడం ఏంటని అనుకోకండి. న్యూయార్క్‌లో విభిన్నమైన ఆలోచన వచ్చిన కొందరు ఐస్‌క్రీమ్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో లభ్యమయ్యే రకరకాల ఐస్‌క్రీమ్‌లు, చాక్‌లెట్లు, డిసర్ట్‌లు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఆ మ్యూజియం లోపల ఏం చూసినా ఐస్‌క్రీమ్ థీమ్‌కు అనుగుణంగా ఉంటాయి. కోన్ ఐస్‌క్రీమ్‌లకు ఈ మ్యూజియం పెట్టింది పేరు. కేవలం నెలరోజులపాటు దీనిని నిర్వహిస్తారు.

08/20/2016 - 21:14

బ్రిటన్‌లో జాన్ రౌలీ అనే వ్యక్తి తన పల్లెటూర్లో కారులో వెడుతూంటే ఓ చెట్టు కన్పించింది. ఆ చెట్టును చూస్తే ఎవరినో చూసినట్లు అన్పించింది. ఆలోచనలో పడ్డాడు. తళుక్కున ఆలోచన మెరిసింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ రూపం గుర్తొచ్చింది. అచ్చం అతని శిరస్సులా ఆ చెట్టు కన్పించింది. వెంటనే ఓ ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో వదిలాడు.

08/12/2016 - 22:22

గోడలపై బొమ్మలు వేయడం ఓ కళ. ఒలింపిక్స్ జరుగుతున్న బ్రెజిల్‌లోని పోర్టొ మరవిల్లలో ప్రఖ్యాతిగాంచిన గ్రాఫిటి కళాకారుడు ఎడ్యూర్డొ కొబ్ర తన కుంచెకు పనిచెప్పాడు. ఒకే ఒక కళాకారుడు వేసిన అతిపెద్ద గ్రాఫిటీగా వేసిన ఈ కుడ్యచిత్రం ఇప్పుడో పెద్ద ఆకర్షణగా మారిపోయింది. దీనికి ‘ఎట్నియాస్’ అని పేరుపెట్టారు. ఈ బొమ్మతో ఓ వీధిగోడంతా నిండిపోయింది.

08/12/2016 - 22:21

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ మధ్య నిర్వహించిన బోనాలు ఉత్సవంలో అమ్మవారిగా అలంకరించుకుంటున్న ఈ భక్తుడి పేర కొరాకుల మునీష్. నగరంలోని అక్కన్నమాదన్న మల్లికార్జున ఆలయంవద్ద మేకప్‌తో ఇలా సిద్ధమయ్యాడు.

Pages