S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

11/05/2017 - 00:06

చలికాలంలో మనం వెచ్చదనం కోసం స్వెట్టర్లు వేసుకుంటాం. కానీ చైనాలో కొందరు చెట్లను చలి నుంచి రక్షించడం కోసం రహస్యంగా స్వెట్లర్లు, ఊలుదారాలు చుట్టి సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా షెన్‌యాంగ్ పట్టణంలో రాత్రుళ్లు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చెట్లకు స్వెట్టర్లు అల్లేస్తున్నారు. ఇది కొద్ది సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా మారిపోయింది. చైనాలోని లియాంగ్ ప్రావిన్స్‌లో ఇది ఒక పర్యాటక ఆకర్షణ.

11/05/2017 - 00:04

స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతం ప్రత్యేక దేశంగా విడిపోవాలని ఉద్యమిస్తోంది. కాటలోని భాష మాట్లాడే వారంతా ఉద్యమిస్తున్నారు. ఈ ప్రాంతం లో పది అంతస్తుల్లో ఒకరిపై ఒకరు నిలుచుని మానవ స్థూపాల్లా నిలబడటం కాటలోనియన్ల ప్రత్యేకత. ఉత్సవాలు, ఉద్యమాల వేల వారు ఈ ప్రదర్శనలు ఇస్తూంటారు. ఇక్కడి మానవస్థూపాలకు ‘యునెస్కో’ గుర్తింపు కూడా ఉండటం దీని ప్రాధాన్యతను తెలుపుతుంది.

11/05/2017 - 00:02

ముఖం కన్పించకుండా చెట్లు లేదా తెరవెనుక నించుని తొంగి చూస్తూ ఎక్కడున్నానో చెప్పుకో అంటూ చిన్నపిల్లలు ఆడే దొంగాట తెలుసుగా.. ఇదిగో ఇక్కడ కన్పిస్తున్న ఓ గుడ్లగూబ ముఖం కనీకన్పించకుండా చటుక్కున ఎగిరి వచ్చి ఆహారాన్ని తన్నుకుపోయే ప్రయత్నంలో ఉంది. తన రెక్కలను ముఖానికి అడ్డుగా వచ్చేటట్లు విసురుతూ మాటువేసి దెబ్బతీయడం ఈ పక్షుల ప్రత్యేకత. పైగా మిగతా పక్షులు ఎగిరినప్పుడు రెక్కల చప్పుడు వినిపిస్తుంది.

10/28/2017 - 17:59

ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన వంతెనల మార్గం ఇది. చైనాలోని హింగ్‌జువాన్ ఓవర్‌పాస్ ఇది. ఐదంచెలలో 16414 మీటర్ల పొడవుతో దీనిని రూపొందించారు. 20 ర్యాంపులు, 15 బయటకు వెళ్లే మార్గాలు ఉన్నాయి. పొరపాటున ఒక మార్గానికి బదులు మరో మార్గంలోకి వెళితో సరైన మార్గంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అయితే కనీసం ఒక కిలోమీటర్ దూరం వెళ్లాకే మనం అసలు మార్గంలోకి వెళ్లగలం. 2009లో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు.

10/28/2017 - 17:57

న్యూయార్క్‌లోని క్రొటన్ అండ్ హడ్సన్ ప్రాంతంలోని నదీతీరంలో ఏటా జరిగే ‘గ్రేట్‌జాక్ ఒ’లాంటర్న్ బ్లేజ్’ వేడుకలు జరగడం ఆనవాయితీ. దాదాపు 7వేల గుమ్మడి పండ్లను కళాఖండాలుగా తీర్చిదిద్ది వాటికి వెలుగదివ్వెలను అమర్చి అద్భుత కళాకాంతులు వెదజల్లేలా చేయడం ఈ వేడుకలో భాగం. విచిత్ర వేషధారణలు, వివిధ చిత్రాలు, సీరియల్స్‌లోని పాత్రలు, దెయ్యాలు, భూతాల రూపాల్లో వీటిని తీర్చిదిద్ది ప్రదర్శించడం ఈ వేడుకలో ఆకర్షణ.

10/28/2017 - 17:55

ఇది ఒక చిత్తరువు. బెల్‌పాస్ట్‌లోని ఉల్‌స్టర్ మ్యూజియంలో కళాకారులు తీర్చిదిద్దారు. అందంగా కనిపిస్తున్న ఈ చిత్రానికి పెట్టిన పేరు వీపింగ్ విండో. బాగుంది కదూ!

10/28/2017 - 17:54

అమెరికా సరిహద్దు దేశమైన మెక్సిలో ఒక సంప్రదాయం ఉంది. ఏటా అక్టోబర్ 31న ‘డే ఫర్ డెడ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరణించిన తమవారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళి అర్పించడం ఈ కార్యక్రమంలో విశేషం. అయితే మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని, ఊర్ధ్వలోకంలో వారి ప్రయాణం సాగిపోవాలని కాంక్షిస్తూ వారి బంధువులు, సన్నిహితులు కలుసుకుంటారు. విందు నిర్వహిస్తారు.

10/21/2017 - 20:24

గ్రీస్‌లోని పురాతన నగరం ఏథెన్స్‌లోని శిథిలాలకు ఇప్పుడు కొత్తకళ వచ్చింది. బాలికి చెందిన ప్రఖ్యాత గ్రాఫిటీ కళాకారుడు ఏథెన్స్‌లోని పాడుబడిన గోడలపై ఇలా చిత్రాన్ని గీశాడు. కకోరాళ్లను వినియోగించి ఈ చిత్రాన్ని అతడు గీశాడు. గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభాన్ని గుర్తు చేస్తూ ఈ బొమ్మ వేశాడు. ‘ఆర్టిస్ట్స్ ఇన్ ఏథెన్స్ సిటీ ఆఫ్ క్రైసిస్’ అన్న నినాదంతో ప్రస్తుతం అక్కడ గ్రాఫిటీ కళాకారులు సమావేశం అవుతున్నారు.

10/21/2017 - 20:22

థాయ్‌లాండ్‌కు ఏనుగులకు అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ఉన్నన్ని తెల్లఏనుగులు మరే దేశంలోనూ ఉండవు. థాయ్ రాజు భూమిబల్ అతుల్యదేవ్ కొద్ది సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన వర్థంతి సందర్భంగా ఇలా ఏటా తెల్ల ఏనుగులను వరుసగా నిలబెట్టి నివాళి అర్పించడం సంప్రదాయంగా మారింది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అయట్టయలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ప్రజలకు రాజంటే ప్రాణం.

10/21/2017 - 20:21

భారత మాజీ రాష్టప్రతి దేశ యువత మనసు చూరగొన్న శాస్తవ్రేత్త. ఇటీవల జరిగిన ఆయన 86వ జయంతి సందర్భంగా దేశం ఆయన సేవలను స్మరించుకుంది. భారత క్షిపణి పితామహుడిగా ఆయన ఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా చెన్నయ్ నగరంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఇలా నివాళి అర్పించారు.

Pages