S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

05/07/2016 - 23:12

బల్గేరియాకు చెందిన ఓ ముస్లిం పెళ్లికూతురు ఇలా ముస్తాబై ఆకట్టుకుంది. బల్గేరియా భాష మాట్లాడే ముస్లింలను అక్కడ బల్గేరియన్ పొమక్ అని పిలుస్తారు. ఆ తెగకు చెందిన ఎమిల పొచిన్‌కొవ (24) పెళ్లికి సిద్ధమైంది. అక్కడ పెళ్లి మూడురోజులపాటు నిర్వహిస్తారు. భారతీయ సంప్రదాయంలో మెహందీ మాదిరిగానే అక్కడా ఓ సంప్రదాయం ఉంది. పెళ్లికి ముందురోజు వధువు మోమును ఇలా సింగారిస్తారు.

05/07/2016 - 23:10

ఈ ఫొటోలో కన్పిస్తున్న రోబో అచ్చం హాలీవుడ్ తార స్కార్‌లెట్ జాన్స్‌న్‌లా కన్పిస్తోందికదూ..అది నిజమే. ఆమె రూపంలో నిలువెత్తు ‘హ్యూమనాయిడ్’ను రూపొందించాడు హాంకాంగ్‌కు చెందిన రికిమ. తన దుకాణంలో దానిని ప్రజల సందర్శనార్థం ఉంచాడు. ఇలాంటి రోబోను తయారు చేయాలని చిన్నప్పటినుంచి అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు తన కల వాస్తవరూపందాల్చిందని తెగ సంబరపడిపోతున్నాడు.

05/07/2016 - 23:09

శాన్‌ఫ్రాన్సిస్కోలోని సివిక్‌సెంటర్ ప్లాజా ఎదురుగా భారీగా కన్పిస్తున్న తెల్లటి కుందేళ్ల బొమ్మలు అందంగా ఉన్నాయికదూ. స్వతహాగా పుట్టిపెరిగే ప్రాంతాలకు చెందని జీవజాలాన్ని కొత్త ప్రాంతాలకు పరిచయం చేయడాన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన కళాకారుడు అమందా పారెల్ వీటిని రూపొందించి ప్రదర్శిస్తున్నాడు. 23 అడుగుల ఎతె్తైన ఐదు కుందేళ్ల బొమ్మలను ఆయన ఇక్కడ ఏర్పాటు చేశాడు.

05/07/2016 - 23:05

ఈ ఫొటోలో కన్పిస్తున్న మార్జాలం పేరు వీనస్. దీని వయస్సు ఐదేళ్లు. ముఖంపై సగభాగం నలుపు, ఆ భాగంలో పసుపువర్ణపు కన్ను, మిగతా సగభాగం ఆరెంజ్ రంగు, ఈవైపునీలికన్నుతో ఉన్న దీనిముఖం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపేరుమీద ప్రారంభించిన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పదిలక్షల లైక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 6.7 లక్షల ఫాలోవర్లు వచ్చారంటే సామాజిక మాధ్యమాల్లో దీని హవా ఏంటో అర్థమవుతుంది.

04/30/2016 - 23:13

విశ్వాసానికి శునకాలు మారుపేరుగా చెప్పుకుంటాం. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాల తరపున జరిపిన పోరాటంలో పాల్గొని రెండు కాళ్లూ కోల్పోయిన అమెరికాకు చెందిన మాజీ సైనికుడు నాక్స్ విల్లే ఇలా విశ్రాంతి తీసుకుంటూంటే అతడివద్ద శిక్షణ పొందిన సైనిక శునకం ఇలా విధేయత చాటుకుంది. ఆఫ్గానిస్తాన్‌లో 2012లో విధులు నిర్వహిస్తుండగా తాలిబన్ల దాటిలో విల్లే కాళ్లు కోల్పోయాడు.

04/23/2016 - 22:08

మొసలిలా కన్పించే యాలిగేటర్ ఇది. తన వ్యవసాయ క్షేత్రంలోని పశువులను తినేస్తున్న దీనిని పట్టుకునేందుకు ఇద్దరు రైతులు నెలల తరబడి ప్రయతిస్తు చివరికి మట్టుబెట్టారు. పదిహేను అడుగుల పొడవు, 363 కేజీల బరువున్న ఈ యాలిగేటర్ ఇన్నాళ్లూ తమను నిద్రపోనివ్వలేదని లీలైట్‌సె అనే రైతు చెబుతున్నాడు. పక్కనే ఉన్న చెరువులో ఉండి రాత్రిపూట ఇది పశువులపై దాడి చేస్తోంది. చివరకు తుపాకీతో కాల్చి చంపేశాడు లీ.

04/23/2016 - 22:05

చైనాలోని ఓ థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత ఈజిప్టు శిల్పం ‘స్ఫింక్స్’ నమూనా ఇది. వేల ఏళ్లక్రితం ఈజిప్టులో లభించిన నిర్మాణాన్ని పోలినవిధంగా దీన్ని రూపొందించారు. అయితే ఈజిప్టునుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లడవడంతో దీనిని ధ్వంసం చేయాల్సివచ్చింది. అందులోభాగంగా ఆ విగ్రహం తలను ఇలా తొలగించి పక్కనపడేశారు. హెబ్రి ప్రావిన్సులోని షిజియాజుంగ్ పార్కులో ఇది ఉంది.

04/23/2016 - 22:03

చేతిలో చెయ్యి వేసి...ఇలా ప్రపంచం అంతా చుట్టివస్తు సంచలనం సృష్టిస్తున్న జంట ఇది. ప్రపంచ ప్రఖ్యాత స్థలాలకు వెళ్లడం, అక్కడి సౌందర్యాన్ని తిలకిస్తున్న ఆ అమ్మడు చేతిని ఇలా వెనకనున్న ప్రియుడికి అందించడం, ఆ చేతిని అందుకున్న అతగాడు ఆ దృశ్యాన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో వదలడం ఓ సంచలనంగా మారిపోయింది. ఈ ముచ్చటకు ‘్ఫలో మి’ అని పేరుపెట్టుకున్నారు ఆ ఫొటోగ్రాఫర్ జంట.

04/16/2016 - 22:01

ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో ఇప్పుడు సంగీత తరంగాల హోరు వీనులవిందు చేస్తోంది. ఏటా ఏప్రిల్‌లో ఈ సంగీత విభావరి అందరినీ అలరించడం సంప్రదాయం. ‘ది సైరన్ షో’గా చెప్పుకునే ఈ వేడుకలో సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించడం పూర్తిగా ఉచితం. సంధ్యవారాక ఇసుక తినె్నలపై కూర్చుని సేదదీరుదూంటే..నాలుగు మీటర్ల ఎతె్తైన ప్రత్యేక వేదికలపై కళాకారులు సంగీతాన్ని విన్పించడం ఆనవాయితీ.

04/11/2016 - 01:01

ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలోని హిందూసముద్ర తీరం ‘కొట్టిస్లోయ్) ఏటా ఈ సీజన్‌లో కళాఖండాలతో ఓ గ్యాలరీగా మారిపోతుంది. ప్రపంచప్రఖ్యాతిగాంచిన శిల్పులు ఇక్కడకు చేరి తమ సృజనాత్మకతను జోడించి రూపొందించిన కళాఖండాలను చూసేందుకు వేలాదిమంది ఇక్కడి బీచ్‌కు వస్తారు. ఇప్పుడిక్కడ కొలువుదీరినవాటిలో ఆర్టిస్ట్ కియాన్ సిహువ్ రూపొందించిన ‘బబుల్ నెం.7’వద్ద ఫొటోకు ఫోజిచ్చిన ఓ మహిళను చూడొచ్చు.

Pages