S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

10/14/2017 - 20:08

దర్పం ఒలకపోస్తూ సోఫాసెట్‌లో కూర్చుని పోజులిస్తున్న ఈ ఎలుగుబంటిని చూసి ఓ నర్సు ఆశ్చర్యపోయి కెమెరాకు పనిచెప్పింది. ఎందుకూ పనికిరాని ఆ సోఫను చెత్తకుప్పలో పడేశారు. ఆహారం కోసం అటుగా తిరుగుతూ వచ్చిన ఓ భల్లూకం కొద్దిసేపు అందులో కూర్చుంది. అదికూడా ఎవరో నేర్పినట్లు, బాగా సౌకర్యంగా ఉన్నట్లు హావభావ విన్యాసాల ప్రదర్శిస్తూ కొంతసేపు గడిపింది.

10/14/2017 - 20:06

అమెరికాలోని నెవెడా బ్లాక్‌రాక్ ఎడారిలో వారం రోజుల పాటు బర్నింగ్ మ్యాన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అద్భుతంగా జరిగింది. వేలాదిమంది కళాకారులు ఇక్కడ పాల్గొని వివిధ కళారంగాలలో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఓల్ ఆర్ట్ విభాగంలో లారెన్ రాక్ అనే కళాకారిణి రూపొందించిన ఓ గుడ్లగూబను పోలిన కట్టడంపై ఉండి భర్త బాబ్ పీటర్సన్‌తో కలసి వేడుకల్లో పాల్గొంది. ఈ కళాఖండానికి ‘మ్యూకరో’ అని పేరుపెట్టింది.

10/14/2017 - 20:05

ఈ రాతికట్టడాన్ని చూస్తే అచ్చం మహిళ తలలా కనిపిస్తోంది కదూ! బ్రిటిష్ రాణి ఎలిజబెత్ తలకట్టును తలపిస్తోందనేవారూ ఉన్నారు. తైవాన్ రాజధాని తైపీకి 45 నిమిషాల ప్రయాణం చేస్తే యెహిలియూ పట్టణం వస్తుంది. అక్కడ ఉన్న జియోపార్కులో ఈ రాతిబొమ్మ కనిపిస్తుంది. గాలి రాపిడికి బండరాయి ఇలా తయారైంది. ఇలాంటి వింతలు ఎన్నో అక్కడి పార్కులో కనిపిస్తాయి. దాదాపు నాలుగువేల ఏళ్లనుంచి ఆ రాయి ఇలా మార్పులకు లోనయి ఉంటుందని అంచనా.

10/02/2017 - 23:01

బ్రిటన్ సారథ్యంలో యూరప్ స్థాయి వైమానిక విన్యాసాలకు గ్రీస్ వేదికైంది. తంగారా ఎయిర్‌బేస్‌లో వివిధ దేశాలకు చెందిన పైలట్లు ఆయా దేశాల ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో సాహసోపేతమైన విన్యాసాలు ప్రదర్శించారు. సందర్శకుల ఒళ్లు జలదరించేలా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈజిప్ట్‌కు చెందిన 9మంది సభ్యుల సిల్వర్‌స్టార్ బృందం క-8ఇ కరోకరమ్ ఎయిర్‌క్రాఫ్ట్ విన్యాసాలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి.

10/02/2017 - 22:59

జంతువులు నవ్వడమేమిటి అని ఆశ్చర్యపోవద్దు. మనిషి నవ్వినట్టు కాకపోయినా నవ్వుమొహంతో కనిపించిన ఓ వరాహం ఇంటర్నెట్‌లో హడావిడికి కారణమైంది. ఆ మధ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో వరదలు ముంచెత్తాయి. వరదనీటిలో ఓ వరాహం చిక్కుకుపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న ఆ వరాహాన్ని పోలీసులు రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆ వరాహం ముఖం నవ్వుతున్నట్లు ఉండటంతో ఆ దృశ్యం వైరల్ అయ్యింది.

10/02/2017 - 22:57

జర్మనీలోని మ్యూనిచ్ జూలో కనిపించిన ఈ పక్షి పేరు వైట్ ఫ్రాగ్‌వౌత్. కప్పనోటిలా దీని ముఖం ఉంటుంది కనుక వీటికి ఆ పేరు వచ్చింది. మ్యూనిచ్ జూలో ఇటీవలే పొదగబడిన గుడ్డులోంచి ఈ పిల్లపక్షి పుట్టుకొచ్చింది. వచ్చీరావడంతోనే సందర్శకుల మనసుచూరగొంది. రెండు మగ, రెండు ఆడ ఫ్రాగ్‌వౌత్ పక్షులు ఈ జూలో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఐదవది. చూడటానికి బొమ్మలా ఉన్న ఈ పక్షి పుట్టింది ఈ ఏడాది ఆగస్టు 31నే సుమా!

09/16/2017 - 23:06

ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళగా, పొడవైన కాళ్లున్న మహిళగా, ఎతె్తైన క్రీడాకారిణిగా గిన్నిస్ రికార్డు సాధించిన మోడల్ ఈమె. రష్యాకు చెందిన ఎకటెరినా లిసిన ఏకంగా 6 అడుగుల 9 అంగుళాల పొడవు ఉంది. ఆమె ఎడమకాలు 132.8 సెంటీమీటర్లు (52.2 అంగుళాలు), కుడికాలు 132.2 (52.0 అంగుళాలు) పొడవున్నాయి. పొడవైన కాళ్లున్న మహిళగా ఇప్పుడు ఆమె గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె కుటుంబ సభ్యులందరూ పొడగరులే.

09/16/2017 - 23:03

నేపాల్‌లోని ఖాట్మండూలో ఇటీవల భక్తులు ఇలా లఖే నృత్యంతో అలరించారు. దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా చూసే భాగ్యం కలగాలని కోరుతూ లఖే అమ్మవారి వేషధారణలో భక్తులు ఇలా వీధుల్లో నృత్యం చేయడం అక్కడి సంప్రదాయం.

09/16/2017 - 23:01

ఫొటోగ్రఫీ ఒక కళ. కళ్లముందు అనుకోకుండా కనిపించే అందమైన, వింతైన దృశ్యాన్ని నాణ్యంగా, ఆకట్టుకునేలా చిత్రీకరించడం మామూలు విషయం కాదు. అననుకూల పరిస్థితులు, ప్రాంతాల్లో తమ ప్రతిభాపాటవాలను కళ్లకు కట్టించే ఫొటోగ్రాఫర్లకు ఈ మధ్య ఓ పోటీ నిర్వహించారు. ప్రపంచ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలకు వేలాది ఎంట్రీలు వచ్చాయి. వాటిలో ఇవి కొన్ని.

09/09/2017 - 23:39

అందాల పోటీలు కాదుకానీ.. సంప్రదాయ కార్యక్రమానికి ఇలా ముస్తాబైంది కొసావాకు చెందిన ఓ ముద్దుగుమ్మ. ఫ్యాషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే పాశ్చాత్య దేశాలకు చెందిన మగువలు ఇలాంటి గిరిజన సంప్రదాయ వేడుకల్లో పాల్గొనేందుకూ
ఆసక్తి చూపిస్తారు.

Pages