S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

01/12/2020 - 23:13

అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా....
తొలిసారి నా చెవుల్లోకి దూరిన రసామృతధారలాంటి ఈ శ్లోకం. నా ఊపిరై అనునిత్యం నన్ను నడిపిస్తోంది. అనుక్షణం నా జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ దిక్సూచిలా దారి చూపిస్తోంది. నా జీవితంలో అమృతం కురిసిన వేళ నుంచి అడుగడున ఆనందమయం చేస్తోంది.
ఆ శ్లోకమే మానవ రూపంలో జన్మిస్తే

01/05/2020 - 23:19

ఎప్పటి నుండో ప్రసాద్‌ను చూద్దామనిపించి అఫీస్ పనిమీద ముంబయి వెళ్లినవాడిని తిరిగి వస్తూ పూణేలో దిగి ప్రసాద్‌కు ఫోన్ చేశాను. గంటలో వచ్చి నన్ను తను ఉంటున్న ఆఫీసు క్వార్టర్స్‌కు తీసుకు వెళ్లాడు. అతని ఇంటికి రావడం అదే మొదటిసారి. ఇల్లు ఏమంత పెద్దది కాకపోయినా ఒంటరివాడికి పెద్దది లానే అనిపించింది. అప్పటికి అతని పెళ్లి ప్రయత్నాలు లూప్ లైన్ లో ఆగి ఉన్నాయి. అంతకుమునుపు నేనూ పూణేలో పనిచేశాను.

12/29/2019 - 00:00

ఆఫీసుకు వచ్చి నా కేబిన్‌లో కూర్చొన్నా. ఏసీ నుండి చల్లగాలి తాకుతూ ఉన్నా, నా మనసు ఆందోళనగానే ఉంది. బ్రాంచ్ మేనేజర్ హోదాలో ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు. వీటన్నిటికీ అలవాటు పడ్డాను. కానీ, రాత్రి ఇంట్లో జరిగిన సంఘటన నా మనసును కలిచి వేస్తూ ఉంది.

12/22/2019 - 23:08

నెల్లూర్ రైల్వేస్టేషన్ నండి అద్దెకారు పరుగులు తీస్తోంది. అల్లూరు రోడ్ లోకి మలుపు తిరిగింది. రెండు కిలోమీటర్ల తరువాత విశాలమైన ఒక భవంతి ముందు ఆగిం.
‘‘ఇదేనమ్మా!దయానిధి ప్రజావైద్యశాల’’ అన్నాడు డ్రైవర్.
బాలామణి తల వూపి ‘సరే’ అంది
వెనక సీట్లో ఆమె కూర్చుని ఉంది. ఆమె ఒడిలో ఒక సాధువు పడుకుని ఉన్నాడు. నిజానితకు స్పృహ లేని స్థితిలో ఉన్నాడు.

12/14/2019 - 23:58

‘సుముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల 30 సెకెండ్లకు ముగుస్తుంది’ చెప్పాడు పెళ్లి చేయటానికి వచ్చి పూజారి -కం- పురోహితుడు.
‘ఆపైన దుర్ముహూర్తం’ అనీ హెచ్చరించాడు.
‘ఎంత దుర్ముహూర్తం?’ అడిగాడు పెళ్లికూతురు తండ్రి.

12/13/2019 - 06:28

ఆదివారం -
తెలతెలవారుతోంది.
వీధి తలుపు చప్పుడు. వెళ్లి చూశాను. మా సుందరమ్మత్తయ్య. పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఆమె ఎప్పుడూ చెప్పాపెట్టకుండా ఇలాగే వచ్చేస్తూ ఉంటుంది. ఎవరింటికైనా వెళుతూ ఉంటుంది. రమ్యని చూడటానికి వచ్చిందన్నమాట! మా అమ్మాయి రమ్య కానుపు అయి ఇవ్వాళ ఎనిమిదో రోజు.
మా ఆవిడ శారద - అప్పటికప్పుడే స్నానాదికాలు పూర్తి చేసుకుని పూజగదిలో ఉంది. తానూ హాల్లోకొచ్చింది.

11/30/2019 - 23:37

హై దరాబాద్ మహానగరం డెబ్భైలక్షల జనాభాతో కిటకిటలాతుంది. వివిధ కులాలు, వివిధ మతాల, అనేక భాషా సమూహాల జనంతో భిన్నత్వంలో ఏకత్వానికి మరోపేరులా ఉంది. నగరంలో రద్దీగా వుండే స్థలాల్లో దిల్‌సుక్‌నగర్ ఒకటి. తీవ్రవాదుల బాంబు పేలుళ్ళకు గురైన దిల్‌సుక్‌నగర్ బస్టాండ్ ప్రాంతం జనం ఈనినట్టుగా ఉంది. ఆఫీసుకెళ్ళే సమయం కావడంవల్ల మరింత రద్దీగా ఉంది. సికిందరాబాద్‌కెళ్ళే ఒకటవ నెంబర్ సిటీ బస్సొచ్చి బస్టాపులో ఆగింది.

11/23/2019 - 23:49

శపథం చేసింది, చేసేది ఆడది కదా?! కాదు. ఆ శపథం చేసింది సుబ్బారావు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మగవాడేంటి మంగమ్మ శపథం ఏమిటి? చూద్దాం!

11/16/2019 - 23:39

నేస్తం...

11/09/2019 - 19:00

‘మన పెళ్లై ఇంకా సంవత్సరం కూడా నిండలేదు. అప్పుడే ఏమిటీ గొడవలు?’ అన్నాడు శ్రీనివాసరావు.
‘అన్నిటికీ కారణం మీ అమ్మ’ అంది నాగశ్రీ.
‘నేనేం చేశానమ్మా?’ అంది రమణమ్మ.
అత్త రమణమ్మ వైపు తిరిగి ‘చేసేదంతా చేసి నంగనాచిలా నటించకు!’ అని, భర్త శ్రీనివాసరావు వైపు తిరిగి ‘నీ తల్లికి నా మీద అనుమానం. ఇంకా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ నన్ను సాధిస్తుంది’ అంది నాగశ్రీ.

Pages