S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

01/23/2016 - 18:13

‘హుమ్...’ ఇరవై ఒకటవసారి నిట్టూర్చింది రాజేశ్వరి. ప్రస్తుతం ఆమెను ‘అభిమాన వైరాగ్యం’ పట్టి బాధిస్తోంది. అభిమాన వైరాగ్యమనేది ప్రేమాభిమానాల మీద వైరాగ్యమో లేక తన అభిమానం దెబ్బ తినడం వల్ల వచ్చిన వైరాగ్యమో కావచ్చు.

01/21/2016 - 15:31

‘ఏమిటండీ! మన అబ్బాయి ఆనంద్ సంగతి నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నా మాటంటే వాడికి లక్ష్యం లేదు. మీరో మారు వాడితో గట్టిగా చెప్పండి. వాడు మనతో మాట్లాడి సుమారు నెల రోజులైంది. మనం ఫోన్ చేద్దామంటే వాడి నెంబర్ మనకు కనెక్టవటం లేదు. ఇక కోడలు కావేరీ సంగతి సరేసరి. మీకు తెలుసు కదా! ఏ విషయం చెప్పదు. మనం ఏదైనా అడిగితే పొడిపొడిగా అవును కాదు అని జవాబులు చెపుతుంది.

01/09/2016 - 17:56

సీతారత్నమ్మ ఇద్దరు కుమారులు రాజవరంలో నివసించేవారు. పెద్దవాడు రాహుల్ ఆఫీసులో పనిచేస్తూ పెద్ద ఇంటిలో హుందాగా ఉండేవాడు. చిన్నవాడు రాకేష్ మామూలు గుమాస్తాగా పనిచేస్తూ ఇరుకు గదిలో ఉండేవాడు.
ఆ రోజు సీతారత్నమ్మ చాలా హడావుడి పడసాగింది. దానికి కారణం ఆమె అన్నయ్య చంద్రశేఖర్ అమెరికా నుండి రావడమే. ఇరవై ఏళ్లు అమెరికాలో ఉన్న చంద్రశేఖర్ హైదరాబాద్‌కు వచ్చి రాజవరం వస్తున్నానని సోదరికి కబురు పెట్టాడు.

01/02/2016 - 17:57

‘మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?’ అడిగాను నాతో ఆఫీసులో పని చేస్తున్న రమని.

12/26/2015 - 23:41

ఆ రోజు ‘ప్రశాంతి వృద్ధాశ్రమం’ కళకళలాడుతోంది. చక్కగా మామిడి తోరణాలు కట్టి అందమైన ముగ్గులతో ఉగాది వేడుకలు చేసుకోవడానికి ముస్తాబు అయింది. ఉదయం ఆరు గంటలకే ఆ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి పండుగ చేసుకోవటానికి వచ్చారు. అక్కడి వృద్ధులందరికీ ఆదిత్య, అతని స్నేహితులు సంవత్సర కాలంగా పరిచయస్తులే. వారికి పరిచర్యలు అందించటానికి అక్కడికి వస్తూ ఉంటారు.

12/19/2015 - 18:32

కాచిగూడ స్టేషన్లో బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ కదలటానికి సిద్ధంగా ఉంది.

12/12/2015 - 18:29

ఇంట్లో పెద్ద దుమారమే చెలరేగింది.

12/05/2015 - 18:09

‘మా నాయన్ని దహనం చెయ్యాలి, వస్తావా?’
‘పోయారా? అయ్యో! ఐ యామ్ వెరీ సారీ, నీకెంత కష్టమొచ్చింది!’
‘అంత సానుభూతి చూపించనక్కర లేదు, పోయి నన్ను బతికించాడు. ఉన్న డబ్బంతా ఆయన రోగానికే ఖర్చయింది. ఆపైన ఆంక్షలు! నేనెక్కడికి వెళ్లాలన్నా ఆ ముసలాడికి చెప్పి చావాలి’
అతనికి తెల్సిన విషయమే అది. ‘సరే వస్తున్నాను’ అని ఫోన్ ఆఫ్ చేసి, బట్టలేసుకుని బయలుదేరాడు.

11/28/2015 - 16:49

‘‘ఏవండీ! మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం, పట్టింపు ఎందుకు? సంసారం అన్న తరవాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్లు ఒకచోట చేరితే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు పంచుకుంటారు. అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటినే పట్టుకుని శపధాలు చేయడం, మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి. ఇంతకీ మావయ్య గారి కోపం, ఎవరిమీద? కొడుకుమీదా? కోడలి మీదా? లేక మనవల మీదా? అంది సునీత.

11/21/2015 - 22:14

సమయం రాత్రి పదకొండున్నర..
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఓల్వో బస్సు టెర్మినల్ నుంచి బయల్దేరింది.
కుండపోతగా కురుస్తోంది వాన. అసలే విపరీతమైన రద్దీ. దానికితోడు ఉధృతంగా కురుస్తున్న వర్షం నెమ్మదిగా నిక్కుతూ, నీలుగుతూ కృష్ణానది బ్రిడ్జి మీదికి వచ్చింది.
శాలువా తలమీంచి చెవులను కప్పేస్తూ లాక్కుని ముడుచుకుని కూర్చుంది శిశిర.

Pages