S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

08/24/2019 - 18:50

చంగల్రావ్‌కి చిన్నప్పటినించీ డిటెక్టివ్ నవలలు చదవటమంటే చాలా ఇష్టం. స్కూలుకి సెలవు దొరికితే చాలు ఏదో ఒక డిటెక్టివ్ నవల పట్టుకుని కూర్చునేవాడు. వేసవి సెలవలైతే ఇక చెప్పనే పనిలేదు. రోజంతా అదే పని. కొమ్మూరి సాంబశివరావు నవలలంటే అతనికి చాలాఇష్టం. డిటెక్టివ్ యుగంధర్ అతని ఆదర్శ డిటెక్టివ్. స్కూల్ రోజులు దాటి కాలేజీకి వెళ్ళేటప్పటికి ఈ పుస్తకాలు చదవటానికి టైం ఉండేది కాదు.

08/17/2019 - 19:43

నల్లని తారురోడ్డు మీద కారు సాఫీగా సాగిపోతోంది. ఆ ప్రయాణం ఎంతవరకూ అలా సాగుతుందో ఎవరికి తెలుసు? కాసేపటికి రోడ్డు మీద గతుకులు రావచ్చు. డ్రైవర్ రెప్పపాటు కునుకు వేస్తే అర్థాంతరంగా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోవచ్చు. జీవితం అంటే అంతే గదా!

08/10/2019 - 18:13

సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కల్యాణికి వినబడింది. ఇప్పుడింకా ఉసూరుమంటూ ఆఫీసు నుండి వచ్చింది. ఎక్కడివక్కడే పడేసి ఉదయం హడావిడిగా బయలుదేరింది. అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలుపెట్టబోతూ ఉండగా ఈ ఫోనొకటి. వదిలించుకోటానికి పదిహేను నిమిషాలయినా అవుతుంది అని విసుక్కుంటూ నంబరు చూసి ఇంటికి రాబోతూ ఫోనెందుకు చేశారు అనుకుంటూ ‘ఏమిటండీ అంత అర్జంటు?’ అంది విసుగును దాచుకుంటూ. ‘మరేం లేదు.

08/03/2019 - 19:06

శేషయ్యకి పిల్లలు లేరు. పిల్లల కోసం మొక్కని చెట్టు, పుట్ట, దైవం లేదు. అందరూ అతన్ని షావుకారు శేషయ్య అనేవారు. శేషయ్యంటే ఎవరో కాదు, మా ఇంటి ఎదురు డాబా ఇల్లే అతనిది. నా చిన్నప్పటి నుంచీ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నేనంటే ఇష్టంగా ఉండేది ఆ దంపతులకి. ఇల్లు దుకాణంకి ఉపయోగించేలా ఇంటి ముందు గదిని పెద్ద హాలుగా కట్టుకున్నాడు శేషయ్య.

07/27/2019 - 18:58

‘‘బాబూ.. బారెడు పొద్దెక్కింది. తమరికి లేచే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ముసుగుదన్నుకుని సాయంత్రం వరకూ ఇలాగే పడుకుంటారా?’’ కొడుకు మీద అరిచాడు సుబ్బారావ్.
‘‘అబ్బా ఇంత పొద్దునే్న లేచి ఏం చేయాలి నాన్నా’’ అన్నాడు సీతాపతి ముడుచుకుని పడుకుంటూ.
‘‘అబ్బో తమరు రోజూ పొద్దునే్న లేచి ఏదో పీకేస్తున్నట్టూ... పడుకుంది చాలు పైకి లెయ్ దున్నపోతా’’ మళ్ళీ తిట్టాడు సుబ్బారావ్.

07/20/2019 - 19:42

ఒక అమ్మాయి - ఇద్దరు అబ్బాయిలు.
అమ్మాయి అనూరాధ, అబ్బాయిలు రామకృష్ణ, వంశీకృష్ణ.
ముగ్గురూ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అబ్బాయిలకు ఉద్యోగాలు దొరికాయి. రామ్‌కి హైదరాబాద్‌లో. వంశీకి చెన్నైలో. విజయవాడలోనే ఉంటున్న అనూరాధ మాత్రం ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. శని ఆదివారాలు ముగ్గురూ విజయవాడలో కలుస్తూనే ఉంటారు.

07/13/2019 - 19:07

రాత్రి ఎనిమిది గంటలు అయింది. రైల్వేస్టేషన్‌లో స్టేషన్ మాస్టర్ పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. స్టేషన్ చుట్టూ చెట్లు, ముళ్లపొదలు ఉన్నాయి. కీచురాళ్ల ధ్వనులు, కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. పేరుకు స్టేషనే గానీ ఒకే ఒక్క గది, ఒకే ప్లాట్‌ఫాం. ఎప్పుడో ఒకసారి రైలు వెళ్లడం తప్ప ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అది అటవీ ప్రాంతం కావటంవల్ల చుట్టుపక్కల అన్నీ చిన్నచిన్న పల్లెటూళ్లు.

07/06/2019 - 19:04

అబ్బా.. పచ్చ సిగ్నల్ పడింది. ఓ నిముషం పాటు గాలి పీల్చుకోవచ్చు. ఆ.. ఏ గాల్లే! అంతా దుమ్ము, ధూళితో నిండిన గాలి. త్వరత్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వేగంగా వెళ్ళే బండ్లు. వెచ్చటి వాహనాల పొగతో కూడిన గాలి ముఖానికి తగులుతుంది. ముక్కు దగ్గర చేయి ఎంత అడ్డు పెట్టుకుని అటూ ఇటూ ఆడించినా, పొగ ముక్కులోకి పోతూనే వుంది. ఏమిటో నాకీ కష్టం? అనిపిస్తుంది. కానీ తప్పదు. నా రూపం నాకే అసహ్యంగా వుంది.

06/29/2019 - 18:27

‘హాయ్ అంకుల్, రేపు మీరు వూళ్లోనే ఉంటారా?’
‘ఎవరూ మాట్లాడుతోంది’ రాజశేఖర్, చంద్రశేఖర్‌కు ఫోన్ ఇస్తూ.
‘నేనే ప్రసన్న అంకుల్, గుర్తు పట్టలేదా?’
ఈ మధ్య ఇదొకటి ఎవడో సెల్‌ఫోన్ చేయడం, ‘హాయ్’ అనడం ‘గుర్తు పట్టలేదా’ అని ఒక ఐ.క్యూ. విసుక్కున్నాడు చంద్రశేఖర్ అప్పుడే ఆఫీస్‌కి వెళ్లే తొందరలో తయారవుతూ ఫోన్ కట్ చేశాడు.

06/22/2019 - 18:58

ఫోన్ రింగయింది.
స్క్రీన్ వైపు చూస్తూ ‘మీ బాబాయిలా వున్నారు. వదిలిపెట్టేలా లేరు’ కేకేసింది కాత్యాయని.
‘ఎత్తమాకు. ఆయనే మానుకుంటాడు. రామకోటి, పూజ వ్యవహారాలు చాలా ఉన్నై. ఇప్పుడు కుదరదు. తరువాత చూసుకుందాం’ విసుగు ధ్వనిస్తూండగా భార్యకు సమాధానమిచ్చాడు వైద్య.

Pages