S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

09/29/2018 - 22:42

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
*
చంటిపిల్ల గుక్కపెట్టి ఏడుస్తున్నట్టు పదేపదే అన్పించసాగింది పొలంలో కూలి పని చేస్తోన్న కాశమ్మకి.
మరి తల్లి మనసు నిలవలేకపోయింది.
‘పొద్దుటనగా పాలిచ్చాను. బిడ్డ ఆకలికి తాళలేదు. పాలిచ్చి ఇదిగో ఇక్కడున్నట్టుగా వచ్చేత్తా’ రైతుకి చెప్పి, అతడి అంగీకారం కోసం చూడకుండా, పొలాలకి అడ్డం పడింది.

09/22/2018 - 19:15

ఆదివారం.. ఉదయం తొమ్మిది గంటలు.. నగరంలో పేరుమోసిన ఇంజనీరింగ్ కాలేజీ.. కంప్యూటర్ బ్లాక్ ముందు అమ్మాయిలంతా ఒక క్యూలో, అబ్బాయిలంతా మరో క్యూలో బారులుతీరి నిలబడి ఉన్నారు.
వాళ్లలో కొందరి ముఖాల్లో ఆతృత, ఆందోళన, ఉత్సుకత నిండి ఉంటే, మరి కొందరి ముఖాల్లో నిర్లక్ష్యం, బద్దకం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. వాళ్లంతా బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్ష అటెండ్ కావడానికి నిలబడి ఉన్నారు.

09/01/2018 - 18:53

‘నీ ముద్దుల కొడుకు నుంచి సమాధానం వచ్చిందా? ఏమిటీ అలా ఆముదం తాగిన మొహం పెట్టేవ్.. ఓహో... సమాధానం వచ్చిందన్నమాట. అదీ ‘ల’ కేత్వం, ‘ద’కి కొమ్ము.. అందుకా ఈ మొహం.. వాడు ఆ ముదనష్టపు దేశం వెళ్లేటప్పుడే చెప్పేను. వాడి మెడలు వంచి పెళ్లి చేసేసి పంపుదామే.. అంటే విన్నావూ.. వివాహం విద్యా నాశాయః.. దిబ్బ దిరుగుండం, ఉద్యోగం వచ్చేక చేద్దాం అన్నావ్.. సరే పోనీలే అనుకున్నాను.

08/18/2018 - 20:52

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఉయ్యాల బల్లపై కూర్చుని మరుసటి రోజు ఉదయమే వెళ్లిపోబోతున్న మనవరాలితో పరంధామయ్యగారు కబుర్లాడుతున్నారు. ఇంతలో భార్య అనసూయమ్మ తాంబూలం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ముభావంగా లోపలకి వెళ్లిపోయింది.

07/28/2018 - 18:42

అనగనగా ఓ అడవి. అది చిట్టడివే. అయినా చీమలు దూరుతాయి. అది కారడివే. అయినా కాకులు దూరుతాయి. అటవీ శాఖ వారు తమ జీపులూ మందీమార్బలంతో యధేచ్ఛగా దూరుతారు. ఇక వేటగాళ్ల సంగతి వేరేగా చెప్పనవసరం లేదు. అటవీ శాఖ వారి సహకారంతో అప్పుడప్పుడూ, వాళ్ల కళ్లుగప్పి తరచూ దూరిపోతుంటారు.

07/21/2018 - 20:16

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
వనజకి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కోపంతో, ఉడుకుమోత్తనంతో దహించుకు పోతోంది.
నిన్న సాయంత్రం ముగ్గురూ కలిసొచ్చారా! తలోదిక్కునా ఉద్యోగాలు చేసుకునే ముగ్గురూ కలిసెట్లా వచ్చారని అడిగితే కలిసి రాలేదు, వీధి చివరే కలుసుకున్నాం అన్నారు ముగ్గురూ కలసికట్టుగా. ఆలస్యమైందేంటని అడిగితే ఇంక మొదలుపెట్టారు, తలా ఒక కథ చెప్పడం.

07/14/2018 - 21:07

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
=====================

07/14/2018 - 20:43

గంగన్న గజదొంగ. దొంగతనాలు, దోపిడీలు చేయడం అతడి వృత్తి. అతడికి కన్నయ్య ఒక్కగానొక్క కొడుకు. కనీసం వాడికైనా విద్యాబుద్ధులు నేర్పిద్దామన్న ధ్యాస లేదు.
ఉన్నట్టుండి జబ్బు చేసి మంచాన పడ్డాడు గంగన్న.
కన్నయ్య తండ్రి దగ్గరకొచ్చి ‘నాన్నా! నాకు చదూకోవాలని ఉంది. ఎవరైనా గురువు దగ్గరకు పంపించవా?’ అని అడిగాడు.

07/07/2018 - 23:46

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*

07/01/2018 - 01:22

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
-----------------------------------------

Pages