S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

07/24/2016 - 02:05

ఈ శీర్షికన అందిస్తున్న కథలూ సందేశాలూ బాగుంటున్నాయి. ‘్భజనం’ చదివి స్ఫూర్తి పొంది రోజులో కనీసం ఒకసారి కుటుంబ సభ్యులందరం కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంటర్నెట్, టీవీ, కంప్యూటర్, మొబైల్ అన్నీ ఈ సమయంలో బంద్. లాండ్ ఫోన్ కూడా పక్కన పెట్టేస్తున్నాం. ఈ చిన్న విషయాన్ని శ్రద్ధతో పాటిస్తే కుటుంబంలో ఐక్యత పెరిగి, మమతానురాగాలు వృద్ధి చెందుతాయన్న నమ్మకం బాగా కలిగింది.

07/16/2016 - 22:38

మహాయోగి, ధర్మమూర్తి, ఆదర్శ గురువు బ్రహ్మశ్రీ కందుకూరి శివానంద గారిపై వ్యాసం ద్వారా అనేక విషయాలు తెలుసుకొని ఆనందించాం. ముఖాముఖిలో ‘అద్దెకున్నవాడు వారసుడ్ని చూస్తానంటే ఇల్లుగలాయన ఊరుకోడు’ అన్న సమాధానం భలేగా నవ్వించింది! మనం కోపంలో, ఆవేశంలో తిడతాం. శాపనార్థాలు పెడతాం. అందువల్ల కలిగే అనర్థాన్ని ‘సండే గీత’లో గొప్పగా వివరించారు. టాబ్లాయిడ్ రూపంలో ఆదివారం ఆంధ్రభూమి ముచ్చటగా ఉంది.

07/09/2016 - 22:02

గతాన్ని తవ్వుకుంటూ ఆనాటి మధుర స్మృతుల్లో ఓలలాడుతుంటారు. నేడు రేపటికి గతమే కదా! అందుకని నేడు కూడా మాధుర్యం నింపుకుంటే వర్తమానంలో గతాన్ని చూసుకుంటూ జీవితం మరింత మధురంగా ఉంటుందన్న ‘ఓ చిన్న మాట’ ఒక గొప్ప సత్యం. చెప్పేది కథలాగ నడిస్తే వాస్తవం మరింత బాగుంటుందంటూ గోపాలంగారు చెప్పిన ‘తులసి కథ’ భలేగా ఉంది. ఎక్కడో మొదలుపెట్టి మరెక్కడికో లాక్కుపోయి పాఠకుల్ని రంజింపజేయడం ఆయన హాబీ! ఇంతకూ ఆయన కథ చెప్పారా?

07/02/2016 - 21:43

దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన దేశభక్తులకు కారాగారంలో తినలేని తిండిని పెడుతూ, అదే సాంఘిక దురాచారాలైన దొంగతనం, దోపిడీలు, మానభంగాలు, దొమీలు లాంటి నికృష్ట నేరాలు చేసిన వారికి రాజభోగాలా? - చదువుతూంటే మనిషై పుట్టిన బ్రిటీష్ దొరలకు మానవత్వం కనుమరుగై ఇంత కాఠిన్యమెలా కలిగిందో అని బాధ వేసింది. మన దేశంలో మన వారిని ఇంత క్షోభపెట్టిన చరిత్రను యథాతథం ప్రపంచానికి విస్తృతంగా ప్రచారం చేయాలి.

06/25/2016 - 23:38

బ్రతుకు పరుగు పందెంలో అలసిసొలసి పోయి, బాధ్యతల బరువుతో కృంగిపోయి అనేక భావాలతోపాటు నవ్వడం కూడా మర్చిపోయిన వారందరికీ ‘ఓ చిన్న మాట’లో నవ్వడమే ఒక టానిక్ అంటూ ప్రచురితమైన కథనం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్ని ఒత్తిళ్లలో వున్నా రోజులో కనీసం పది నిమిషాలు రిలాక్సింగ్‌గా కూర్చొని మనసారా నవ్వుకోవాలని నిర్ణయించుకున్నాం.

06/18/2016 - 21:43

పెద్దవాళ్లు ఏది ఆచరిస్తే దానినే చిన్నవాళ్లు అనుసరిస్తారని భగవద్గీత బోధించింది. మంచి మర్యాదలు, పలకరింపులు, స్వాగతాలు, గుర్తుండిపోయే కన్నీటి వీడ్కోలు మధురంగా అనిపిస్తాయి. మనిషిని బ్రతికిస్తాయి. ప్రశాంతతను కలుగజేస్తాయి. ‘సండే గీత’ చిన్న మాటలతో గొప్ప విషయాన్ని బాగా చెప్పింది.
-ఎన్.ఆర్.లక్ష్మి (సికిందరాబాద్)

06/11/2016 - 22:13

ఈ వారం ‘సండే గీత’లో పనిమనిషి కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. మానవులందరూ ఏదో ఒక కార్యం నెరవేర్చేందుకు ఆ పరమాత్మ చేత సృష్టించబడిన వారేనని, అందరూ ఏదో ఒక ప్రత్యేకత వున్నవారని, అందరిలో వున్న ఆత్మస్వరూపుడైన ఆ సర్వేశ్వరుని దర్శించి, సర్వ మానవ సౌభ్రాతృత్వం అలవరచుకోవాలన్న వేదోక్తిని చక్కగా చెప్పినందుకు కృతజ్ఞతలు. అలాగే ‘బంగారు ఉంగరం’ ఆలోచింపజేసేదిగా ఉంది.

06/04/2016 - 22:52

ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా చక్కని కవర్‌స్టోరీని అందించారు. కుటుంబ దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శం అంటూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎలా కలసిమెలసి ఉండేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, సమస్యలు, రాన్రాను చిన్న కుటుంబాలు ఏర్పడటంవల్ల తలెత్తుతున్న సమస్యలను క్లుప్తంగా అర్థవంతంగా వివరించినందుకు ధన్యవాదాలు.

05/29/2016 - 04:55

కేన్స్ కళకళ...

05/21/2016 - 21:15

పెన్సిల్ గురించిన నమ్మలేని నిజాలు, చైనా కివీ ఫలం విశేషాలు, పెసరపప్పు వంటకాల గురించిన అంశాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఇప్పుడంటే పెళ్లిళ్లలో కందిపప్పు వాడుతున్నారు గాని అప్పట్లో పెసర పప్పన్నం పెట్టేవారు. పెసరపప్పు సులభంగా జీర్ణమవుతుంది. ఆరోగ్యం కూడాను. టీవీ జ్ఞాపకాల గురించి సండే గీతలో బాగా చెప్పారు.

Pages