S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

05/14/2016 - 22:43

ఆవాల మ్యూజియం - ప్రపంచంలో ఖరీదైన ఫలం - వెక్కిరింత లాంటి శుభాకాంక్ష, టోపీ హిస్టరీ ముచ్చటగొలిపేవిగా ఉన్నాయి. ఇప్పుడు మూడు కాదు ఒకటే కాలం. ఎండాకాలం! నీళ్లు లేని కన్నీళ్లు తెప్పించే మండేకాలం! అంటూ ‘సండే గీత’లో వ్యక్తం చేసిన ఆవేదన కలచివేసింది. తరచి చూస్తే చెట్లు నరికేసి, పర్యావరణ స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్న మన వల్లనే మనకీ దుస్థితి.

05/07/2016 - 22:24

‘మీకు తెలుసా?’ అని అడిగి మరీ చెప్పిన గొడుగు కథ, చదరంగం ఉండే పుచ్చకాయలు, చేతి రుమాళ్ల విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని మరో కోణంలో పరిశీలించి ‘సండే గీత’లో బాగా చెప్పారు. నిజమే. కోపంవల్ల అమూల్య కాలం వృధా అయి పని నుంచి దృష్టి మరలుతుంది. ఎవరికి మొర పెట్టుకున్నా చూస్తాము అనే అంటారు అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

05/02/2016 - 22:35

మనమెప్పుడూ గతించిన కాలమే మంచిదని, గడుస్తున్న కాలం మోసపూరితమని, రాబోయే కాలం భయంకరంగా ఉంటుందేమోనని అనుకుంటూంటాం. కానీ గడచిన కాలం వర్తమానంలో సమస్యలను అధిగమించేట్టు మార్గదర్శకం కావాలి. అప్పుడే భవిష్యత్కాలం సుఖవంతమవుతుంది. ఎంత గొప్పగా స్ట్రాటజిక్ ప్లాన్ వేసుకున్నా ఒడిదుడుకులు తప్పవు. మన పెద్దవాళ్లు అందుకే అంటారు - సంపాదిస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని.

04/23/2016 - 22:31

మనోహరమైన ఆ పాటలు వింటూంటే మధురమైన మరో లోకంలో తేలిపోతూంటాం. కోకిలమ్మలు.. చిగురాకుల తోరణాలు.. సన్నాయిలా సాగే చిరుగాలి... వసంతం.. వనంలో సందడి.. పూల సోయగాలు, తలంబ్రాలు.. పున్నమి.. తొలి రేయి.. ఈ దృశ్యాలన్నీ మన కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. తరాలు గడిచినా ఈ పాటలోని స్వర మాధుర్యం నిత్యనూతనం.. ఇంతటి కమ్మనైన గీతాల్ని ఆలపించిన ‘గానకోకిల’ గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం..

04/16/2016 - 22:37

వసంత గానం చేస్తున్న వసంత లక్ష్మి ముఖచిత్రం చాలా బాగుంది. ఆంగ్ల ఆంధ్ర సంవత్సరాదుల భేదం చెప్తూ గత సంవత్సర వైఫల్యాలు, నూతన సంవత్సర తీర్మానాలను సమీక్షించుకోవలసిన ఆవశ్యకతను ఓ చిన్న మాటగా బాగగా వివరించారు. గోపాలంగారి ‘కళ - కలకల’ గురించి మాటల గలగల విని (చూసి, చదివి) కిలకిల నవ్వుకున్నాం. అనూహ్య మలుపులతో క్రైం కథ బాగుంది. అబద్ధం చెప్పి హంతకుడిని ట్రాప్ చేసిన ముసలమ్మని మెచ్చుకోవలసిందే!

04/10/2016 - 00:49

‘దయ్యాల మేడ’ క్రైం కథ నిజానికి దయ్యం కథ అయినా తమాషాగా ఉంది. మన సినిమాల్లోనూ కథల్లోనూ వచ్చే పగ, ప్రతీకారాల దయ్యంలా కాక ఇది మేలుచేసే మంచి దయ్యం! హన్సిక తమిళ రంగంలో సెటిల్ అయితేనేం? ఆ చిత్రాలు డబ్ అయి తెలుగులోనూ వస్తాయి కదా. సర్వేశ్వర శర్మగారు చెప్పినట్టు శరీరం తన ఆరోగ్యం తనే చూసుకుంటుంది. తమ శరీరంపై నమ్మకం లేక కొందరు సొంత వైద్యంతోను ఇంకొందరు డాక్టర్లను నమ్మి శరీర వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారు.

04/03/2016 - 07:36

ఈ వారం అనుబంధంలో ‘జాడలేని జలం’ ఈ వారం స్పెషల్ మంచినీటిని వృధా చేసేవారికి కనువిప్పు కలిగించే విధంగా ఉంది. ప్రకృతి వనరులను తన స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న మానవులు భవిష్యత్తులో ఎంతటి దుష్పరిణామాలు ఎదుర్కొననున్నారో ఈ వ్యాసం కళ్లకు కట్టినట్లు వివరించింది. ప్రస్తుతం నీటి కోసం కన్నీళ్లు పెడుతున్న జనం మున్ముందు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.

03/26/2016 - 21:13

జీతం ఉద్యోగి ఖాతాలో పడెయ్యడం వచ్చేక మొదటి తారీఖున జీతం తీసుకునే మజా మాయమవడం ‘ఓ చిన్న మాట’గా చెప్పడం బావుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఖ్యాతి కొట్టేసిన కాంగ్రెస్ ప్రతిపక్షం అనేదే లేకుండా దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. ఆ స్థాయిలో కాకపోయినా అలాంటి ఖ్యాతి కొట్టేసి తెరాస రాష్ట్రాన్ని ఏలుతున్నది. కొంతకాలం విపక్షాలకు స్థానం లేకపోవడం సహజమే.

03/20/2016 - 00:14

బాధాకరం

03/13/2016 - 08:22

కథ
‘దాగుడుమూతలు’ కథ - త్రికరణశుద్ధిగా నమ్మి కొలిచే భక్తులను ఆ భగవంతుడు తప్పక ఆదుకుంటాడనీ, వారి బాగోగులను తనే స్వయంగా చూసుకుంటాడన్న అద్భుత సత్యాన్ని చక్కగా ఆవిష్కరించింది. ఆత్మానే్వషణ కోసం ప్రాపంచిక ఆసక్తులు తగ్గించుకొని అంతర్ముఖం కావాలన్న సందేశాన్ని ‘వినదగు’లో చక్కగా వివరించారు. ఆత్మ సంయమ యోగంపై ఇంతటి అద్భుతమైన, విభిన్నమైన వివరణ ఇంతవరకూ చదవలేదు.
-ఎం.కనకదుర్గ (తెనాలి)

Pages