S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

03/05/2016 - 20:29

అవీ-ఇవీ

02/28/2016 - 16:08

మీసాల కృష్ణుని గురించి ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు చెప్పిన విషయాలు భలే పసందుగా ఉన్నాయి. కృష్ణుడు మహాయోధుడు కనుక ఆ విధంగానే పటాలు ఉండాలన్న ప్రతాపరెడ్డిగారి యోచన, రామాచార్లుగారి సృష్టి నిజంగా అభినందనీయం. మీసాల కృష్ణుడనగానే ఆలయాల్లో మీసాలతో కనిపించే ఒకే ఒక్క దేవుడు అన్నవరం సత్యదేవుడే కనిపిస్తాడు. పౌరాణిక సినిమాలు చూస్తూ దేవతల కెందుకు మీసాలుండవన్న అంశంపై చిన్నప్పుడు జోకులు చెప్పుకునే వాళ్లం.

02/14/2016 - 17:28

జనవరి 24, ఆదివారం అనుబంధంలో ‘బాలమురళీకృష్ణ’ ప్రత్యేక వ్యాసం మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొంది. ఆయన ఇంటర్వ్యూ సంగీత ప్రియులందరికీ ఆకర్షణీయమైనది. మురళిగారి కీర్తనల్లో రాగం భోగం స్నేహం మోహం దోబూచులాడుతుంటాయి. ఆవేదన ఆకాంక్ష తపన కొట్టొచ్చినట్టు కనపడతాయి.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
సండే గీత

02/08/2016 - 08:00

దిల్లీ నగరం నడిబొడ్డున పార్లమెంట్ భవనాన్ని చూస్తే ప్రతి భారతీయుడి మనస్సు ఉప్పొంగిపోతుంది.. ఠీవిగా, దర్పం వొలకబోస్తూ పరిఢవిల్లిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.. అంటూ సాగిన ‘ప్రజా దర్బారుకు కొత్త రూపు?’ ఈ వారం స్పెషల్ ఆలోచింపజేసేదిగా ఉంది.

02/01/2016 - 08:46

‘నాన్నా! నా ఫ్రెండ్ నాకు ఇప్పుడే ఫోన్ చేశాడు. వాడు పంపిన ఇ-మెయిల్‌కి అటాచ్ చేసిన గేమ్‌కి వైరస్ ఉందిట. నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. నా కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌ని అది నాశనం చేయచ్చేమో?’ అనూప్ భయంగా చెప్పాడు.
వెంటనే అనూప్ తండ్రి వాడి డెస్క్‌టాప్‌లో ఎవాస్ట్‌ని ఉపయోగించి వైరస్‌ని తీసేశాడు.
‘వైరస్ అంటే ఏమిటి? ఫ్లూ జ్వరాన్ని ఇచ్చేది అదే కదా?’ అనూప్ తమ్ముడు ప్రశ్నించాడు.

02/01/2016 - 08:21

‘భగత్‌సింగ్’ సీరియల్ చదువుతూంటే ఆయా సంఘటనలు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయి. భగత్ తల్లి జ్యోతిష్యుని మాట విని.. హతాశురాలవటం.. ‘దేశాన్ని ఏలుతాడు.. లేదా ఉరికంబమెక్కుతాడు’ అనటంతో ఆ తల్లి ఎంత వేదన చెందిందో? దేశం కోసం తమ ప్రాణాల్ని సైతం త్యాగం చేసి.. స్వాతంత్య్రాన్ని రప్పిస్తే.. ఇప్పటి పరిస్థితిని తలచుకుంటే వొళ్లు గగుర్పొడుస్తోంది.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
ఈ వారం స్పెషల్

01/23/2016 - 18:15

ప్రతి పండుగకు నిర్దేశింపబడిన సంప్రదాయాలు, వాటి అంతరార్థాలను గ్రహించి, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రజా శ్రేయస్సుకు ఉపకరించాలని హితవు పలికేవి పండుగలు. చైతన్య స్ఫూర్తి.. సంక్రాంతి దీప్తి.. అంటూ మా ఇంట సంక్రాంతి శోభను వెల్లివిరిసేట్టు చేశారు - ఈ వారం స్పెషల్ ద్వారా.
-పి.బాబ్జీ (తెనాలి)
వినదగు

01/09/2016 - 17:54

భగత్‌సింగ్

01/02/2016 - 17:54

భగత్‌సింగ్
తను ఎంతగానో నమ్మి, మహాత్మాగాంధీకి జై అంటూ నినదించిన భగత్‌సింగ్, ఏదో ఊళ్లో ఎవరో చేసిన దానికి దేశాన్ని శిక్షించడం చూసి విచలితుడు అవడం మా హృదయాల్ని కదిలించింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సీరియల్ సాగుతోంది. నమ్మండి ఇది నిజం శీర్షికలో పీతల గురించి రాసిన వివరాలు ఆశ్చర్యం గొలిపాయి. నాలుగున్నర అడుగుల చుట్టుకొలతగల పీతలున్నాయంటే నమ్మలేకపోయాం. అసలు-నకిలీ క్రైం కథ సస్పెన్స్‌తో సాగింది.

12/26/2015 - 23:51

భగత్‌సింగ్
సభలోని లక్షల మందితో గొంతు కలిపి ‘మహాత్మాగాంధీకీ జై’ అని ఎలుగెత్తి అరిచిన భగత్‌సింగ్‌లోని విప్లవకారుడు జూలు విదిలించాడు... భగత్‌సింగ్ చదువుతున్నంతసేపు భగత్‌సింగ్ ఆత్మతో ప్రయాణం చేయించిన రచన మీది. మీ శైలి అనితరసాధ్యము. నిరుపమాన భగత్‌సింగ్ స్ఫూర్తి చల్లారిన యజ్ఞకుండము నుంచి వెలికితీస్తున్న అమృత రచనగా స్వాతంత్య్ర యోధునికి మీరిస్తున్న నిజమైన నివాళి.

Pages