S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలో - మనం

04/23/2016 - 22:45

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
భారత్, పాక్‌లు తమ ఆయుధ సామాగ్రిని తగ్గించుకోవాలని, అమెరికా అధ్యక్షులు ఒబామాగారు సలహా ఇచ్చారు. పాక్‌కు ఈ యుద్ధ సామాగ్రిని అమెరికాయే అమ్మి వ్యాపారం చేస్తున్నదిగా.
యుద్ధం చేయడం ద్వారా ఆయుధాల నిల్వను తగ్గించుకోవాలని వారి ఉద్దేశమేమో!

ట్రంప్ మహాశయుడు అధ్యక్షుడయితే ఈ అమ్మకాలను ఆపగలడా?
ఆపడు. ఆపలేడు.

04/16/2016 - 23:03

సి.ప్రతాప్, శ్రీకాకుళం
జగన్ అక్రమాస్తులు, ఓటుకు నోటు, విజయవాడ కాల్‌మనీ కేసులు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు! మీడియాలో దాదాపుగా నెల రోజులు ప్రధాన వార్తలుగా చెలామణి అయిన ఈ కేసుల గురించి ఇప్పుడు ఎక్కడా ఏమీ వినపడటం లేదు. పత్రికలలో వార్తలు కూడా రావడంలేదు. కారణం ఏమిటంటారు? ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన కేసులను మూసెయ్య వీలుంటుందా?
మన పణ్యభూమిలో ఏదైనా సాధ్యమే.

04/09/2016 - 22:48

మామెడ రాజేంద్రప్రసాద్, వౌలాలి
మహాశివరాత్రి రోజున దాదాపు అన్ని ఛానళ్ల వాళ్లు మహాశివుడి పైన చాలా ప్రోగ్రామ్‌లు ప్రసారం చేశారు. చాలా సంతోషం. కానీ అన్ని ఛానళ్లలో కూడా మధ్యలో వచ్చే ప్రకటనల్లో నిన్నటి తరం హీరో అబ్బాస్ వచ్చి ఇది వాడితే మీ టాయిలెట్ ఇలా ఉంటుంది అని చెప్పడం అస్సలు బాగులేదు. ఛానళ్లకిది తగునా?

04/03/2016 - 07:57

అందవరపు నాగేశ్వరరావు, పలాస
అమరావతి పూర్తి అగుటకు కనీసం 5,6 సంవత్సరాలు కాగలదు. ప్రణాళిక ప్రకారం ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఇంకా వేగవంతము చేసే మాలాంటి వాళ్లు చూచి తరించాలని ఉంది. నా కోరిక నెరవేరుతుందా?
కంటినిండా కునుకు తీయండి. ఏదో ఒకరోజు తీరుతుంది.

03/26/2016 - 21:12

సుగుణా మహీధర్, ఏలూరు

03/20/2016 - 00:17

యుగంధర్, వక్కలంక
పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకంపైనా, బలహీన వర్గాల హాస్టళ్లల్లోని సౌకర్యాలు, ఇతర విషయాల గురించీ ఆయా గ్రామాలలోని సచ్చరిత్రులు అనబడేవారికి పెత్తనం ఇస్తే ఎలాగుంటుంది? ఏ రాజకీయ నాయకుడికీ అవకాశం ఇవ్వకూడదు.
మంచిదే. కాని ఎవరు సచ్చరిత్రులు? వారిని ఎవరు ఏ పద్ధతిన ఎంపిక చేస్తారు? నిజమైన సచ్చరిత్రులకు తీరిక, ఓపిక ఉంటాయా?

03/13/2016 - 08:26

వాండ్రంగి కొండలరావు, పొందూరు
క్రైస్తవులు చర్చికి వెళ్లేటప్పుడు నిరక్షరాస్యులైనా సరే బైబిల్‌ను తీసుకొని వెళ్తారు. మరి హిందువులు భగవద్గీతను తీసుకొని వెళ్తే నామోషీ ఎందుకు సార్?
తీసుకువెళ్లి ఏం చేయాలి? వేరే మతం వాళ్లు చేసిందల్లా మనం చేయనక్కర్లేదు. ఎవరి పద్ధతి వారిది.

03/05/2016 - 20:33

బొడ్డు రామకృష్ణ, చిరతపూడి
ప్రభుత్వంవారు మరుగుదొడ్లు ఉచితంగా కట్టించి ఇచ్చుచున్నారు. వాటిని ఎంతమంది ఉపయోగించుచున్నారో పట్టించుకొనుట లేదు. నూటికి తొంబది వాడుట లేదు. ఇది ఎంతవరకు సబబు?
వాటిలో ఎన్ని ఉపయోగించుకోగల స్థితిలో ఉన్నాయి?

02/28/2016 - 15:22

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు, ప్రకాశం జిల్లా
‘వెనె్నల’ శీర్షిక శుక్రవారం నుండి మంగళవారం మార్పు నాకు అసంతృప్తిగా ఉంది. ఈ మార్పునకు కారణం?
శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాల సమీక్షలు ఇంకో వారం దాకా ఆగకుండా త్వరగా ఇవ్వొచ్చని.

02/14/2016 - 16:53

చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్
రాజకీయాలతో ముడిపెట్టి విద్యార్థుల భవిష్యత్తును విధ్వంసం చేయడం మంచిదంటారా?
రాజకీయులకు మంచిదే.

Pages