S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలో - మనం

02/08/2016 - 08:12

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
జంట నగరాల్లో పదివేల సిసి కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చు. దీనికి మీరేమంటారు?
ఆ కెమెరాలను ఎత్తుకుపోతే...?

01/31/2016 - 18:29

పుష్యమీసాగర్, హైదరాబాద్

01/23/2016 - 18:17

సీతారామరావు కొడాలి, విజయనగరం
పని లేనివాళ్లే ఇలాంటి శీర్షికలకి ప్రశ్నలు పంపిస్తారనుకుంటాను. ఏమంటారు?
మీకు తెలియాలి.

01/14/2016 - 18:05

వరిగొండ కాంతారావు, హనుమకొండ
ఒక ఊహ: మాన్య ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌గారే ఢిల్లీలో ‘సరిబేసి’ ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. బేసి రోజున 88 అన్న నెంబరున్న టాక్సీని పట్టుకొని ఫైన్ కట్టమన్నారు. అందుకా టాక్సీ డ్రైవర్ ఏకసంఖ్య చేస్తే 7 వస్తుంది. అది బేసి సంఖ్య కాబట్టి ఫైన్ కట్టక్కర్లేదు అన్నాడు. అప్పుడు కేజ్రీవాల్ ఏమంటారు?
మరునాడూ తిరగనీయం అంటాడు.

01/09/2016 - 17:53

మామెడ రాజేంద్రప్రసాద్, వౌలాలి, హైదరాబాద్
వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ఇసుకవేస్తే రాలనంత జనం.. మరుసటి రోజు ఒక్కరు కనిపిస్తే ఒట్టు.. దీని భావమేమి ఎడిటర్‌గారూ..?
ఏడాది కొకసారి లభించే ప్రత్యేక దర్శనానికి భక్తులు విరగబడటంలో వింత లేదు. మిగతా రోజుల్లోనూ గుళ్లు మరీ ఖాళీగా ఏమీ ఉండవు.

01/02/2016 - 17:53

చిల్లర భవానీదేవి, హైదరాబాద్
‘అసలు మహాత్ముడు’లో 52, 53 పేజీల్లో పంజాబ్‌లో పోలీస్ అత్యాచారాల అంశాలు ‘్భగత్‌సింగ్’లో రిపీట్ అయ్యాయి. అదే సంఘటనలకు సంబంధించినవి కాబట్టి ఉంచేశారా?
ఆ ఘటనలు జరిగింది లాహోర్‌లో. భగత్ కళ్ల ముందే. కాబట్టి వాటిని వదిలేయడం కుదరక. వాటికి సంబంధించి అదనపు సమాచారం దొరకక.

12/26/2015 - 23:52

బి.రామలక్ష్మి, పాల్వంచ
మొన్నటికి మొన్న గోదావరి పుష్కరాలు, నిన్నటికి నిన్న బతుకమ్మ సంబరాలు, నేటికి నేడు చండీయాగాలు, రేపటికి రేపు సమ్మక్క జాతరలు కొన్ని కోట్ల ఖర్చు. మన సంప్రదాయాలు, ఆచారాలు, మన దేవతలు కాదనను. కానీ ఆ పేరుతో మనం ముందుకు వెళుతున్నామా? వెనుకకు వెళుతున్నామా? ప్రజలకు ఉపయోగపడకుండా అన్ని కోట్లు అనవసరంగా వృధా చేస్తున్నామా? మీ అభిప్రాయం ఏమిటి?

12/19/2015 - 18:53

పుష్యమీ సాగర్, హైదరాబాద్
సాధారణంగా ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసులలో ఎమ్మెల్యే, ఎం.పీ సీటు కేటాయిస్తారు కదా. నిజంగా మన ప్రజా ప్రతినిధులు సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణం చెయ్యగలరా... కనీసం అప్పుడైనా ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు తెలుస్తాయి కదా... మరి వాళ్లు మన బస్సులలో ప్రయాణం చెయ్యనప్పుడు ఆ కోటా ఎందుకండీ?
వాళ్లకు కావలసిన వాళ్లని ఆ సీట్లలో కూచోబెట్టించేందుకు.

12/12/2015 - 18:26

కోడూరి సుధీర్, కోరుట్ల
కాంగ్రెస్ అంటున్న హిందూ మతోన్మాదం అంటే ఏమిటి?
హిందువుల అస్తిత్వ వాదమే కాంగ్రెసు కంటికి మతోన్మాదంలా కనపడుతుంది.

జిహాద్ అంటే ఏమిటి?
సెక్యులర్ పెద్ద మనుషులు చూసీ చూడనట్టు... ముస్లిం మతానికేమీ సంబంధం లేనట్టు ఉపేక్షించవలసిన విదేశీ దుర్మార్గం.

12/05/2015 - 18:57

హరి, విశాఖపట్నం

Pages