S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

12/17/2017 - 00:33

ఎప్పుడో ఐదువేల ఏళ్ల క్రితం గ్రీన్‌లాండ్‌కు వచ్చిన ఈ శునకాలను ‘గ్రీన్‌లాండ్ డాగ్’ అని పిలుస్తారు. తోడేళ్ల లక్షణాలను పుణికిపుచ్చుకున్న వీటిని పెంచడం ఆషామాషీ కాదు. బలమైన, ధైర్యమైన యజమాని సంరక్షణలో మాత్రమే ఇవి చెప్పినమాట వింటాయి. యజమానికి వెనుక లేదా, పక్కనుంచి నడవటానికి ఇష్టపడతాయి. యజమానికన్నా ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లడానికి ఇష్టపడవు.

12/02/2017 - 19:08

ముత్యం అనగానే నిగనిగ తెల్లగా మెరిసిపోయే గుండ్రటి, బియ్యపు గింజల్లాంటివి గుర్తొస్తాయి. కానీ వీటిలో గుండ్రంగా ఊదారంగు, నలుపు, కాస్తంత పసుపు ఛాయతో కూడిన ముత్యాలూ ఉంటాయి. ఉప్పునీటిలోను, మంచినీటిలోనూ ముత్యపుచిప్పల్లో లభించే సహజసిద్ధమైన ముత్యాలకు గిరాకీ ఎక్కువ. భూమిపై దాదాపు కోటీ 60 లక్షల సంవత్సరాల నుంచి ముత్యాల వాడకం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బతికి ఉన్న జీవి నుంచి వాడుకునే ఆభరణం ముత్యం.

12/02/2017 - 19:07

అత్యధిక పోషకాలతో కూడిన శాకాహార పంట కాలీఫ్లవర్. ఇది మొదట టర్కీలో సాగు చేశారు. 16వ శతాబ్దంలో ఐరోపా దేశాలు కాలీఫ్లవర్‌ను వాడటం మొదలుపెట్టారు. అమెరికా మాత్రం 20వ శతాబ్దంలో దీని రుచి చూసింది. వందలాది రకాలు, రూపాలు, విభిన్న రంగుల్లో లభించే కాలీఫ్లవర్ అత్యంత బలవర్ధక ఆహారం. కొన్ని రకాల కేన్సర్‌లను నివారించడానికి కాలీఫ్లవర్ రసం ఉపయోగపడుతుంది. ప్రపంచంలో వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా.

12/02/2017 - 19:05

దాని శరీరంతో పోలిస్తే రాకాసి నోటితో అందర్నీ భయపెడుతుంది ‘మాంక్ ఫిష్’ భయంకరమైన పళ్లవరస, వెడల్పుగా ఉండే నోరు చూసేందుకు భయపెడతాయి. వీటి రూపాన్ని బట్టి ‘సీ డెవిల్’ అని పిలుస్తారు. సముద్రం అంతర్భాగంలో నేలపై మూడువేల అడుగుల లోతున ఇవి జీవిస్తాయి. పక్షులను వేటాడటానికి అరుదుగా నీటి ఉపరితలంపైకి వస్తూంటాయి. నేలపై కదలకుండా నక్కి ఉంటూ ఒక్క ఉదుటన దాడి చేసి ఆహారాన్ని పట్టుకోవడం వీటి అలవాటు.

11/25/2017 - 17:01

ఔను ఇది నిజం. మొసళ్లు రాళ్లను కూడా మింగుతాయి. అవి మాంసాహారులని అందరికీ తెలిసిందే. ఇవి ఆహారాన్ని నమిలి తినలేవు. మాంసాన్ని, రక్తాన్ని లేదా ఎముకలను ఖండాలుగా గుటుక్కుమని మింగుతాయంతే. అయితే తిన్న ఆహారం అరగాలికదా. అందుకోసం చిన్నచిన్న రాళ్లను అవి మింగుతాయి. వాటిమధ్య నలిగి అవి తిన్న ఆహారం అరుగుతుందన్నది వాటి తెలివి. ప్రపంచంలో ఉప్పునీటిలో పెరిగే మొసళ్లు అతిపెద్దవిగా ఉంటాయి.

11/25/2017 - 16:59

భూమీద జీవిస్తున్న అతిపెద్ద క్షీరదం ఏనుగు. ఇప్పటికి మూడు జాతుల ఏనుగులు మాత్రమే బతికి ఉన్నాయి. భారతీయ ఏనుగుల చెవులు మిగతా జాతుల ఏనుగుల చెవులకన్నా చిన్నవిగా ఉంటాయి. మనలో చిన్నపిల్లలు నిద్రపోతున్నడ్లు, జోగుతున్నప్పుడు, ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు నోట్లో వేలుపెట్టుకోవడం చూస్తునే ఉంటాం కదా! అలాగే గున్న ఏనుగులు తమ తొండాన్ని నోట్లో పెట్టుకుంటాయిట.

11/18/2017 - 19:06

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ ఆదరణ పొందుతున్న ఫుట్‌బాల్ క్రీడ పుట్టింది చైనాలో. క్రీస్తుపూర్వం 476లోనే ఈ ఆట అక్కడ ఆడారు. ఆధునిక మార్పులతో తరువాత ఆ ఆట ఐరోపా, అమెరికా వంటి దేశాలకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ ఆదాయం, ఎక్కువమంది చూసే, ఎక్కువ జనాదరణ ఉన్న క్రీడ అదొక్కటే. ప్రపంచకప్‌ను కనీసం వందకోట్లమంది టీవీల్లో వీక్షిస్తారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఒక మ్యాచ్‌లో ఆడితే కనీసం 9.65 కి.మీ.

11/18/2017 - 19:05

పెన్సిల్‌తో రాసినవాటిని చెరిపివేయడానికి మనం వాడే ‘ఎరేసర్’ను రబ్బర్‌గా పిలుస్తాం. నిజానికి ప్రపంచంలో ఎక్కువమంది వాటిని రబ్బర్‌గానే వ్యవహరిస్తారు. అవి అందుబాటులోకి రాకముందు పెన్సిల్ రాతలను చెరపడానికి బ్రెడ్ పొడిని వాడేవారు.

11/18/2017 - 19:03

గ్రాఫైట్ ఖనిజంతో తయారు చేసే పెన్సిల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? లాటిన్‌లో ‘పెన్సిల్లస్’ అన్న పదానికి ‘లిటిల్ టెయిల్’ (చిన్న తోక అని అర్థం. అలాగే ఫ్రెంచ్ భాషలో ‘పినె్సల్’ అన్న పదానికి ‘లిటిల్ పెయింట్ బ్రష్’ అని అర్థం. ఈ రెండు పదాల్లోంచి పుట్టిన ఆంగ్లపదం ‘పెన్సిల్’. తెలుగులోనూ అలాగే పిలుస్తున్నాం. ఇక్కడ పెన్సిల్‌కు సంబంధించి ఒకటి రెండు విషయాలు తెలుసుకోవాలి.

11/11/2017 - 17:48

గాడిదలు, గుర్రాల సంకరంతో పుట్టిన జంతువులు మ్యూల్స్. సాధారణంగా గుర్రాలు, గాడిదల పోలికలతో ఇవి ఉంటాయి. తెలుపు, బూడిద రంగులో ఇవి ఉండటం చాలా అరుదు. గుర్రాల రంగులోనే ఎక్కువగా ఇవి ఉంటాయి. ఆ రెండింటికన్నా ఇవి తెలివైనవి, ధృడమైనవి కూడా. పరన్నాజీవుల తాకిడిని తట్టుకోగల శక్తి వీటికి ఉంది. అమెరికా, బ్రిటన్, మెక్సికో వంటి దేశాలు సైనిక దళాలలో వీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి.

Pages