S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

12/31/2016 - 18:51

ప్రపంచంలో చందనం ఉత్పత్తిలో భారత్, చైనా, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి మొదటి వరసలో ఉన్నప్పటికీ ‘ఇండియన్ శాండల్’ అత్యంత శ్రేష్ఠమైనదిగా గుర్తించారు. మానసిక సమస్యలకు చందనం మంచి ఔషధం. యాంటీబ్యాక్టీరియాగా పనిచేస్తుంది. ఔషధాలు, కాస్మొటిక్స్, ఫర్నిచర్, విగ్రహాలు, లేపనాలు, సుగంద్రనూనెల తయారీకి చందనాన్ని వినియోగిస్తారు. కుంగుబాటు, ఆందోళనతో ఉండేవారికి చందన పరిమళం హాయిని ఇస్తుంది.

12/24/2016 - 22:27

మంచు ఫలకాలు తేలే అంటార్కిటికా సముద్ర జలాల్లో జీవించే ‘లియోపార్డ్ సీల్’ అతి ప్రమాదకరమైన, భయంకరమైన జీవి. సీల్ జాతిలో ఇదే పెద్దది. దాదాపు 11 అడుగుల పొడవు, 400 కేజీల బరువుతో ఉండే వీటి శరీరంపై ఉండే నల్లని చుక్కల వల్ల చిరుతతో పోలుస్తారు. అందుకే వీటిని లియోపార్డ్ సీల్, టైగర్ సీల్, సీల్ లియోపార్డ్ అని పిలుస్తారు. రూపంలోనే కాదు వీటి జీవనశైలి కూడా చిరుతల్లా క్రూరంగానే ఉంటుంది.

12/24/2016 - 22:24

ప్రపంచాన్ని ఊపేసిన హారీపోటర్ కథల పరంపర చాలామందికి తెలుసు. ఇంద్రజాలం, మాయలూ మర్మాలు నేర్పే నాలుగు పాఠశాలల సముదాయం హాగ్‌వర్ట్. దీనిని కనిపెట్టిన వారిలో గోద్రిక్ గ్రైఫిండొర్ ఒకరు. మనదేశంలో ఈ మధ్యే కనిపెట్టిన ఓ సాలెపురుగుకు హారీ పోటర్ నవలల్లో అందర్నీ ఆకట్టుకునే సార్టింగ్ హాట్ పోలికలున్నాయి. అందుకే ఆ నవలల్లో కీలకమైన గ్రైఫిండొర్ పేరును ఈ సాలెపురుగుకు పెట్టారు.

12/24/2016 - 22:22

అందమైన కాశ్మీర్ పేరు చెబితే దాల్ సరస్సు గుర్తొస్తుంది. ఆ సరస్సు గుర్తుకురాగానే నీటి మధ్యలో దశాబ్దాల తరబడి ఎదుగుతున్న నాలుగు చినార్ వృక్షాలు కళ్లముందు కదలాడతాయి. కాశ్మీర్ సంస్కృతిలో చినార్ వృక్షాలు ఓ భాగం. చినార్ లేని కాశ్మీర్ ప్రస్తావన ఎందులోనూ లేదు. ఒక సీజన్‌లో ఆకుపచ్చగా కళకళలాడే ఈ వృక్షాలు మరో సీజన్‌లో సిగ్గుపడుతున్న పెళ్లికూతురిలా ఎర్రగా నవనవలాడుతూంటాయి.

12/18/2016 - 04:34

బంగారం అంటే మనం బాగా విలువ ఇస్తాం కానీ... అంతకంటే విలువైనది, ఉపయోగకరమైనది రాగి (కాపర్). నిజానికి బంగారానికి వనె్న, మన్నిక ఇచ్చేది రాగి. అతి మెత్తనైన లోహం బంగారం. వేలితో వంచేసేంత మెత్తటిది ఆ లోహం. దానికి కాస్తంత మెరుగు, రంగు రావాలంటే రాగి తోడవ్వాల్సిందే. ఈ భూమీద ఎన్ని విధాలుగా మార్చినా అసలు లక్షణాలను కోల్పోయి లోహం రాగి మాత్రమే. అంటే బంగారాన్ని కరిగించినప్పుడల్లా కొంత నష్టపోతూంటాం.

12/18/2016 - 04:33

స్వీట్ సుగర్’గా పిలిచే బెల్లం ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఉపయోగిస్తారు. ఎక్కువమంది వాడేది పంచదారనే. చెరకు, తాటి, ఖర్జూరం, కొన్ని రకాల దుంపలతో బెల్లం తయారు చేస్తారు. మొలాసిస్ వేరు చేయకుండా, రసాయనాలు కలపకుండా సంప్రదాయ శైలిలో తయారు చేసే బెల్లం మనం కనీసం 3వేల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేదంలో ఇది లేనిదే ఏ మందూ లేదు. బలవర్ధకమైన ఖనిజ లవణాలు సహజసిద్ధంగా దీనిలో ఉంటాయి.

12/18/2016 - 04:32

తృణధాన్యం అని తీసిపారేస్తాం గానీ... రాగుల్లో ఉన్నన్ని పోషక విలువలు మరెందులోనూ ఉండవు. ఇథియోపియాలో పుట్టి మన దేశానికి వచ్చిన రాగుల్లో అరుదైన మిథఇయోనైన్ అమినో ఆమ్లం ఉంటుంది. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తశుద్ధి జరుగుతుంది. ఎముకలకు పుష్టి వస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

12/11/2016 - 00:52

బంతిలా గుండ్రంగా కన్పిస్తున్న ఈ చేపలను ‘పఫర్’ ఫిష్ అంటారు. మామూలుగా ఉన్నప్పుడు సాధారణ చేపల్లానే కన్పిస్తాయి. కానీ ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు పొట్టలోకి గాలి లేదా నీటిని పీల్చి ఉబ్బిపోయి ఇలా గుండ్రంగా తయారవుతాయి. గ్లోబ్ ఫిష్, టోడ్ ఫిష్, బ్లోఫిష్, స్వెల్‌ఫిష్ ఇలా ఎన్నో పేర్లతో వీటిని పిలుస్తారు. ఇవి విషపూరితమైనవి. వీటిలో టెట్రోడొటొ అనే విషం ఉంటుంది. ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైనది.

12/11/2016 - 00:49

సాధారణంగా పుష్పాలు తెలుపు సహా విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో కనిపిస్తాయి కదా!. కానీ ఇక్కడ కనిపిస్తున్న పూలు నల్లగా ఉన్నాయి కదూ!. 12 అంగుళాల వ్యాసార్థంతో ఉండే ఈ పూలకు 24 అంగుళాల పొడవుంటే మీసాల్లాండి కేసరాలు ప్రత్యేక ఆకర్షణ. వెడల్పుగా ఉంటే దళాలతో కన్పించే ఈ నల్లని పూలు గబ్బిలాల మాదిరిగా ఉండటం చేత వీటిని ‘బ్లాక్ బాట్ ఫ్లవర్’ అని పిలుస్తారు. వీటిలో తెల్లని రకమూ ఉన్నాయి.

12/11/2016 - 00:47

వీసిల్స్ కుటుంబానికి చెందిన ‘బడ్జర్’లకు శుభ్రత ఎక్కువ. యుకె, ఉత్తర అమెరికా, కొన్ని ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే ఇవి నివసించే బొరియల్లో మలమూత్ర విసర్జన చేయవుగాక చేయవు. ఆహారాన్ని కూడా గుహలో తినవు. ఎప్పటికప్పుడు అవి నివాసాన్ని శుభ్రం చేసుకుంటూంటాయి. మలమూత్రాలు గుహ బయటే చేస్తాయి.

Pages