S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

12/04/2016 - 06:21

ఒంటె జాతికి చెందిన ఈ ‘యామా’లు చూడటానికి చాలా ముచ్చటగా ఉండాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఇవి బలిష్టమైన జంతువులు. మన దేశాల్లో గాడిదల్లా బరువు మోయడంలో ఇవి పేరుపొందాయి. కానీ అవి మోయలేనంత బరువు వేసినా, వాటికి నచ్చకపోయినా ఒక్క అడుగుకూడా ముందుకు వేయవు. కొంచెం అయినా వాటిమీద వేసిన వస్తువులు తొలగిస్తేనే అది అడుగుకదుపుతుందట. ఇవి ఒంటెల జాతికి చెందినవే అయినా మూపురాలు ఉండవు.

12/04/2016 - 06:19

ప్లాటిపస్ పేరు అందరికీ తెలిసిందే. టాస్మేనియా, తూర్పు ఆస్ట్రేలియాల్లో కన్పించే ఇవి బాతు, ఒట్టర్, బీవర్ జంతువుల పోలికలతో ఉంటాయి. బాతులాంటి ముక్కు, కాళ్లు, బీవర్‌లా తోక, ఒట్టర్‌లా శరీరం వీటి ప్రత్యేకత. ముందుకాళ్లతో ఈదుతూ, తోకను స్టీరింగ్‌లా ఉపయోగించడం వీటి ప్రత్యేకత. వీటి వెనకకాళ్ల కింద ఉండే ముళ్లవంటి భాగంతో శత్రువులను కాటువేయడం వీటికి ఉన్న రక్షణ వ్యవస్థలో ఓ చర్య.

12/04/2016 - 06:17

‘రోడెంట్’ వర్గానికి చెందిన జీవుల్లో ‘బీవర్’ అతి పెద్దది. దాదాపు 30 కేజీల బరువు వరకు పెరిగే ఇవి 25 ఏళ్లపాటు జీవిస్తాయి. యురేషియా, ఉత్తర అమెరికా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. తెడ్డులాంటి తోక వీటికి ప్రత్యేకం. నీళ్ల లోపల పావుగంటపాటు గడపగలగడం వీటి స్పెషాలిటీ. అవి జీవించి ఉన్నంతకాలం పెరిగే బలమైన దంతాలు వాటి ఆయుధాలు.

12/03/2016 - 22:10

చిలీ మినహా మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో కన్పించే ‘స్పైడర్ మంకీ’లకూ, సాలెపురుగులకూ ఎటువంటి సంబంధం లేదు. కానీ చెట్లపై అవి సంచరించేటపుడు సాలెగూడు ఆకారంలో విన్యాసాలూ చేస్తూండటం వల్ల వాటిని ‘స్పైడర్ మంకీ’లుగా పిలవడం ప్రారంభమైంది. దట్టమైన అడవుల్లో, సముద్రమట్టానికి 12,500 అడుగుల ఎత్తున అవి బతకగలవు. దట్టమైన అడవుల్లో చెట్లపై సంచరించే ఈ కోతుల్లో తోక చాలా పొడవుగా ఉంటుంది. బొటన వేలుండదు.

12/03/2016 - 22:08

గడ్డిపరక అని తీసి పారేస్తూంటాం కదా! కానీ ఈ భూమి మీద జీవుల మనుగడకు ప్రధానమైన ఆహారం గడ్డిజాతులే. మనం తినే వరి, గోధుమ, జొన్న, చాలా రకాల పూలు, పళ్లు...ఇలా ఎన్నో గడ్డిజాతికి చెందినవే. ఇళ్ల ముందు, లాన్‌లలో కేవలం కొద్ది అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగే గడ్డి నుంచి 120 అడుగుల ఎత్తు పెరిగే ‘జెయింట్ బాంబూ’ రకం వెదురు వరకు అన్నీ గడ్డి రకాలే.

12/03/2016 - 22:06

సాధారణంగా మనం పెంచుకునే పిల్లులకు నీళ్లంటే భయం. నదులు, సెలయేర్లు, చెలమలు, నీటి గుంతల దగ్గర ఉన్న నీటిని తాకడానికి ఇష్టపడవు. పిల్లుల్లో ఒకటీ అరా జాతులు తప్ప మిగతావాటికి నీళ్లంటే భయమే. కానీ మధ్య, దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో కన్పించే ‘ఓస్లాట్’ పిల్లులకు మాత్రం నీళ్లంటే భయం లేదు. పైగా ఇవి నీళ్లలో ఈదుతూ ఆహారాన్ని వేటాడతాయి. మనం ఇళ్లలో పెంచుకునే పిల్లులకన్నా ఇవి రెండురెట్లు పెద్దవిగా ఉంటాయి.

11/19/2016 - 22:23

నెమళ్లను పోలినట్లు కనిపించే ‘్ఫజెంట్స్’, ఒకే కుటుంబానికి చెందివైనప్పటికీ వాటిమధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఆసియా దేశాల్లో నెమళ్లు కనిపిస్తే ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో ‘్ఫజెంట్స్’ ఉంటాయి. మగనెమళ్ల తోక (్ఫంచంతో కూడి) కనీసం ఐదు అడుగుల పొడవుంటుంది. అడవుల్లో నెమళ్లు కనీసం పాతికేళ్లు బతుకుతాయి. నీలం, నలుపు, సప్తవర్ణ ఛాయతో, వంద ఈకలు, ప్రతి ఈకపై నెమలికన్నును పోలిన రంగుల వలయం ఉంటాయి.

11/19/2016 - 22:21

మనం ఆభరణాల్లో వాడే పగడాలు నిజానికి ఓ సముద్ర జీవి అవశేషాలు. సముద్ర జలాల అడుగుభాగంలో పెరిగే ఓ జీవి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు అది. మధ్యధరా సముద్ర అడుగుభాగంలో పెరిగే ఈ ‘రెడ్‌కోరల్స్’ పై కళేబరాలనే మనం పగడాలుగా వాడుతున్నాం. జపాన్, తైవాన్‌లలో లభించే రెడ్‌కోరల్స్ (పగడాలు) అత్యంత విలువైనవి. వీటి రంగు, వాటిపై ఉండే గీతలు, చుక్కలను బట్టి వాటి నాణ్యతను నిర్ధారిస్తారు.

11/19/2016 - 22:19

పదిహేను వందల ఏళ్లనుంచి లేసుల అల్లుకోవడం జనానికి తెలిసింది. మొదట్లో వీటిని బంగారం, వెండి, రాగి, లైనిన్ వంటి లోహాలతో తయారు చేసేవారు. రానురాను వీటిని ‘పత్తి’, సింథటిక్ దారంతో చేయడం మొదలెట్టారు. పలుచని దారం, వస్త్రంతో అందమైన రూపాల్లో తయారయ్యే అల్లికలే లేసులు. బ్రిటిషర్లకు లేసులంటే ప్రాణం. ముస్లిం దేశాల్లోనూ వీటికి ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మిషన్లతో లేసుల తయారీ ఎక్కువైంది.

11/12/2016 - 19:35

అందమైన తురాయితో ఆకర్షణీయంగా కన్పించే పోలండ్ కోళ్లకు భయం ఎక్కువ. తెలుపు, నలుపుతెలుపుమచ్చలు, పూర్తి నలుపుతో కూడిన ఈకలతో మిగతా కోళ్లకు భిన్నంగా, అందంగా కన్పించడంతో వీటిని పెంచుకునేందుకు అందరూ ఇష్టపడతారు. కోళ్లలో వీటికి అత్యంత ఆదరణ ఉంది. అయితే వీటి తలపై ఉండే తురాయి మరీ పెద్దగా, గుబురుగా పెరుగుతుంది. పొడవైన ఈకలూ చుట్టూ ఉంటాయి. చాలా సందర్భాలలో ఆ తురాయి, ఈకలు గుబురుగా పెరిగి వాటి కళ్లను కప్పేస్తాయి.

Pages