S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

11/12/2016 - 19:33

రామచిలుకలను పోలిన పుష్పాలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిజానికి ఇవి ఆర్చిడ్ రకానికి చెందినవి కావు. చిలుకల్లా కన్పించడం వల్ల వీటికి ‘పారట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. శాస్ర్తియనామం ‘ఇంపేషన్స్ సిట్టాసినా’. 1901లో వీటిని గుర్తించారు. ప్రస్తుతం థాయ్‌లాండ్, మయన్మార్, భారత్‌లోని మణిపూర్ వంటి ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వీటిని కోయడం, విక్రయించడంపై థాయ్‌లాండ్‌లో నిషేధం ఉంది.

11/12/2016 - 19:30

ఆర్చిడ్ కుటుంబానికి చెందిన ఈ పువ్వులు వింతైన రూపుతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి శాస్ర్తియనామం ‘ఆర్చిస్ ఇటాలికా’. మధ్యధరా ప్రాంతంలోని కొన్నిదేశాల్లో ఇవి కన్పిస్తాయి. వస్త్రాలు ధరించని మనిషిని పోలినట్లు ఉండే ఈ పుష్పాలు వింతగా కన్పిస్తాయి. ఔషధాలు, కూల్‌డ్రింక్స్, కాఫీ, ఐస్‌క్రీమ్‌లలో దీనిని వాడతారు. ముఖ్యంగా ‘టర్కీసలాప్’ అనే ఓ ప్రత్యేక డ్రింక్‌కు ఇదే ముడిసరుకు.

11/07/2016 - 00:07

ఫిలిప్పీన్స్‌లోని సెబు ఒకేఒక దీవిలో కన్పించే ఈ పక్షులను సెబు ఫ్లవర్‌పెకర్స్ అంటారు. అందమైన నాలుగు రంగుల కలయికతో ఆకర్షణీయంగా కన్పించే ఈ పక్షులు అంతరించిపోయాయనే భావించారు. కానీ 2005లో వాటి ఆచూకీ కన్పించింది. 2007లో టబునన్ అనే ప్రాంతంలో వీటిని చూశారు. ప్రస్తుతం వాటి సంఖ్య 85 నుంచి 105 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఇవి అంతరించిపోయినట్లు భావించారు.

11/07/2016 - 00:05

అట్లాంటిక్ సముద్రజలాల్లో ఎక్కువగా కన్పించే బ్లూమార్లిన్ చేపలు సముద్రచేపల్లో అతిపెద్దవాటిలో ఒకరకం. బ్లూమార్లిన్ జాతి చేపల్లో మగవాటికన్నా ఆడవి మూడు, నాలుగురెట్లు పెద్దవిగా ఉంటాయి. పుట్టినప్పుడు ఒక్క మిల్లీమీటరు ఉండే ఈ చేపలు రోజుకు 16 ఎంఎంల చొప్పున పెరుగుతాయి. మూడు అడుగుల పొడవు వచ్చేసరికి మగవి జతకట్టేందుకు సిద్ధమవుతాయి.

11/07/2016 - 00:04

ఈ అందమైన చేపలను ‘పారట్ ఫిష్’ అని పిలుస్తారు. ముప్ఫై సెంటీమీటర్ల నుంచి మూడు అడుగుల పొడవు వరకు ఉండే ఈ పారట్ ఫిష్‌లకు వాటి రూపంవల్ల ఆ పేరు రాలేదు. వాటి నోటి నిర్మాణం వల్ల ఆ పేరు వచ్చింది. మిగతా చేపలకు భిన్నమైన రూపుతో వీటి నోటి నిర్మాణం ఉంటుంది. బలమైన, దృఢమైన పళ్లతో కూడిన ముందు దవడ వీటి స్పెషాలిటీ.

11/07/2016 - 00:02

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (సిఎన్‌జిసి) 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిచ్చుకల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ‘సేవ్ ది హౌస్ స్పారో’ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని యాక్షన్ అండ్ రీసెర్చ్ ఫర్ కన్వర్వేషన్ ఇన్ హిమాలయాస్ (ఎఆర్‌సిహెచ్) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అమలుచేస్తోంది.

10/30/2016 - 00:15

ఈ చేప ఎగురుతుంది (గ్లైడింగ్) తెలుసా. అందుకే వీటిని ‘్ఫ్లయింగ్ ఫిష్’ అంటారు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో ఎక్కువగా కన్పించే ఈ చేపలు అన్నిచోట్లా ఉంటాయి. కరేబియన్ ప్రాంతమైన బార్బడోస్‌ను ఒకప్పుడు ‘లాండ్ ఆఫ్ ఫ్లయింగ్‌ఫిష్’గా పిలిచేవారు. మిగతా చేపలకు భిన్నంగా వీటి రెక్కలు (్ఫన్స్) ఉంటాయి. సముద్రంలో సూర్యకాంతి ప్రసారమయ్యేంత లోతు వరకు ఇవి సంచరిస్తాయి.

10/30/2016 - 00:12

ఔను...జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్‌గా పిలిచే ఈ రాకాసి నత్తలు ల్యాండ్ స్నెయిల్స్ జాతిలో అతిపెద్దవి. జీవితాంతం పెరుగుతూనే ఉండే ఇవి సగటున 20 సెంటీమీటర్లు పొడవున ఉంటాయి. దాదాపు 500 రకాల ఆకులు, పండ్లను ఇవి తింటాయి. చాలా రకాల నత్తలకు భిన్నంగా ఇవి కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటాయి. కొత్త ప్రాంతాల్లో వేగంగా ఇమిడిపోయే ఇవి వ్యవసాయదారులకు సింహస్వప్నం.

10/30/2016 - 00:08

ప్రపంచంలో అతిపెద్దదైన, బరువైన విత్తనంకల ఫలం..డబుల్ కోకోనట్. దానిరూపం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. దీనిని లుడేసియా, సీ కోకోనట్, కోకో డి మెర్ అని కూడా పిలుస్తారు. పామ్ జాతికి చెందిన ఈ కాయలు దాదాపు కొబ్బరికాయల్లాగానే కన్పిస్తాయి. కాకపోతే రెండు కలసినట్లుంటాయి. ఒకేవిత్తనం ఉండే ఈ ఫలం పైపీచు పోయిన తరువాత కన్పిస్తుంది. ఈ విత్తనం బరువు కనీసం 42 కేజీలు ఉంటుంది.

10/22/2016 - 22:35

గులాబీవర్ణంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పూలు ఓ పొద జాతికి చెందినవి. మాల్టా దేశంలోని ఒకటీఅరా దీవుల్లోని లైమ్‌స్టోన్ శిఖరాలపై మాత్రమే ఇవి కన్పిస్తాయి. మాల్టీస్ రాక్ ఫ్లవర్‌గా వీటిని పిలుస్తారు. 1973 నుంచి ఇది మాల్టా జాతీయ పుష్పంగా ఎంపికయ్యాయి. అయితే గుర్తు తెలియని ఓ చిమ్మెట లార్వా వీటి పండ్లపై దాడి చేస్తూండటంతో ఈ పొదలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి.

Pages