S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

09/26/2016 - 20:53

దేవతలకు ఇష్టమైనదిగా చెప్పుకునే కదంబ పుష్పం భారత ఉపఖండంలో కనిపిస్తుంది. సుమధురమైన వాసనతో, కాషాయవర్ణంతో గుండ్రంగా, ఆకర్షణీయంగా కన్పించే ఈ పుష్పం తేనెటీగలకు ప్రీతిపాత్రమైనది. వీటిలో ఉండే మకరందం వాటికి ఇష్టం. ఐదున్నర సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ పుష్పంలో ఫలదీకరణం తరువాత ఎనిమిదివేల విత్తనాలు ఏర్పడతాయి. రంగులు, అత్తరుల తయారీలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

09/10/2016 - 22:31

ఆఫ్రికాలో మాత్రమే కన్పించే ఈ గ్రీన్ ట్రీ పైథాన్ పాములు పుట్టినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండవు. సాధారణంగా ఇవి పసుపు, ఎరుపు, అరుదుగా లేత నీలిరంగులో ఉంటాయి. ఎదిగేకొద్దీ వాటి రంగు మారుతూ ఉంటుంది. పూర్తిగా ఎదిగాక ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. జతకలిసే వయసు వచ్చేసరికి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. సాధారంగా అవి జీవితాంతం చెట్లపైనే బతికేస్తాయి.

09/10/2016 - 22:30

మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని పదిహేను దేశాల్లో మాత్రమే కన్పించే ఓల్డ్‌వరల్డ్ మంకీ విభాగానికి చెందిన ఈ కోతులను ‘కింగ్ కొలబొ మంకీస్’గా పిలుస్తారు. నైజిరియా, లైబీరియా, ఘనా, సియర్రాలియోన్, కెన్యా, కాంగో వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన శరీర భాగాలతో ఇవి కన్పిస్తాయి. చెట్లపై తిరిగే ఇవి నేలపై అరుదుగా తిరుగుతాయి. చెట్లపై చిగుర్లు, పూలమొగ్గలను ఇవి తింటాయి.

09/10/2016 - 22:25

పొట్టపై సంచీ, పొట్టి చేతుల్లాంటి ముందుకాళ్లు, భారీగా ఉండే పెద్దకాళ్లతో కన్పించే కంగారూలు అందరికీ తెలిసినవే. కానీ ఒకరకం కంగారూలు చెట్లపై మాత్రమే జీవిస్తాయి. అడపాదడపా నేలపైకి వచ్చినా చెట్లపై ఉండటానికే ఇష్టపడతాయి. కాస్త ఎరుపు, జేగురు కలిసినట్లుగా, అసలు కంగారూలు, లీమర్‌ల పోలికలతో ఇవి కన్పిస్తాయి. వీటికి పొడవైన తోక ఉంటుంది. అసలు కంగారూల మాదిరిగా పొట్టపై సంచీ ఉంటుంది.

09/04/2016 - 06:08

ముత్యాల్లా తెల్లగా మిలమిల మెరిసిపోయే సగ్గుబియ్యం నిజానికి గింజలు కాదు. అది నేరుగా తయారయ్యే పదార్థమూ కాదు. గొట్టాల్లా పెరిగే కర్రపెండలం పొడితో తయారయ్యే సగ్గుబియ్యం మంచి పౌష్టికాహారం. సులువుగా జీర్ణమయ్యే పదార్థం. అందుకే పిల్లలకు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారికి అది చక్కటి ఆహారం.

09/04/2016 - 06:04

ఇడ్లీ, దోశ వంటి తినుబండారాలకు ముడి సరుకైన మినుములు అందరికీ తెలిసిన పప్పుదినుసులే. అయితే ఇవి కేవలం తినే వస్తువే కాదు. పూర్వం రోజుల్లో భవన నిర్మాణంలో సిమెంటింగ్ ఏజెంట్‌గా ఉపయోగించేవారట. వాటర్‌ప్రూఫ్, సిమెంటింగ్ మోర్టార్‌గా దీనిని వాడేవారు. భారత ఉపఖండంలో విస్తృతంగా పండే మినుముల ఉత్పత్తిలో భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ అగ్రస్థానాల్లో ఉన్నాయి.

08/28/2016 - 00:29

గద్దలు, డేగలు పుట్టిన తరువాత అతివేగంగా ఎదుగుతాయి. ముఖ్యంగా డేగల్లో అతిచిన్న జాతి పక్షులు కేవలం నెలలోనే పూర్తిగా ఎదుగుతాయి. పెద్దగా ఉండే జాతి పక్షులు కేవలం 11 వారాల్లో పూర్తిగా ఎదుగుతాయి. అవి ఆహారం పట్టుకునేందుకు గాలిలోంచి నేలమీదకు గంటకు 200 మైళ్ల వేగంతో దూసుకువస్తాయి. మనిషికన్నా ఎనిమిదిరెట్ల సునిశితంగా ఇవి చూడగలవు. చాలా జంతువులు, పక్షులకన్నా అవి మెరుగ్గా, ఎక్కువ రంగులను గుర్తిస్తాయి.

08/28/2016 - 00:27

ఎలుకలా కన్పించే ఈ క్షీరదం పేరు ‘ఎలిఫెంట్ ష్రూ’. వీటికి ఉండే పొడవైన నాసిక వల్ల ఆ పేరు వచ్చింది. జన్యుపరంగా అవి ఎలుకలు, ట్రూ ష్రిల్ జాతికన్నా ఏనుగులకు దగ్గరివిగా చెబుతారు. పెద్దకళ్లు, విశాలమైన చెవులు, పొడవైన వెనుక కాళ్లు, ఒతె్తైన బొచ్చు వీటి ప్రత్యేకత. ఇవి ఉండే బొరియల నుంచి విభిన్నమైన మార్గాలను (కాల్వల్లా) తవ్వుతాయి. ఆ దార్లలో తిరిగే కీటకాలను తింటాయి.

08/21/2016 - 04:46

క్యాట్ ఫ్యామిలీకి చెందిన పులుల్లా కన్పిస్తున్న ఈ క్షీరదం పేరు ‘్ఫస్సా’. ఇవి కేవలం మడగాస్కర్ దీవుల్లోనే కన్పిస్తాయి. శాస్తవ్రేత్తలుకూడా వీటిని నిన్నమొన్నటివరకు క్యాట్ ఫ్యామిలీకి చెందినవిగానే భావించారు. కానీ అవి ముంగిస జాతికి చెందినవని తేలింది. పొడవైన తోక ఉండే ఇవి చెట్లపైనే జీవిస్తాయి. సులభంగా చెట్లపై గెంతుతాయి. వాటి నడక భల్లూకం నడకలా అన్పిస్తుంది.

08/21/2016 - 04:44

సహారా ఎడారి ప్రాంతంలో కన్పించే ఈ నక్కలు ఆ జాతిలో అతి చిన్నవి. మన ఇళ్లల్లో కన్పించే పిల్లులకన్నా చిన్నగా ఉంటాయి. ఏడునుంచి 10 అంగుళాల సైజులో మాత్రమే ఇవి ఉంటాయి. వీటి శరీరంలో మూడొంతులకు సమానమైన పొడవైన చెవులు వీటికి ప్రత్యేకం. సునిశితమైన వినికిడి శక్తితో వాటి ఆహారాన్ని గుర్తిస్తాయి. శరీరంలో వేడిని నియంత్రించుకునేందుకు ఈ చెవులను ఉపయోగించుకుంటాయి.

Pages