S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

04/23/2016 - 21:51

నాలుకను ఇలా బయటకు పెట్టి నవ్వితే మనదగ్గర వెక్కిరించినట్లు, లేదా చిలిపిగా అల్లరి చేస్తున్నట్లు చెప్పుకుంటాం కదా. కొన్ని దేశాల్లో ఇలా నాలికతో వెక్కిరిస్తే...ఇక వారిమధ్య స్నేహబంధం చెరిగిపోయినట్లేనని భావిస్తారు. టిబెట్‌లో మాత్రం ఇలా చేస్తే అభినందించినట్లు, శుభాకాంక్షలు చెప్పినట్లు భావిస్తారు. మంచిని కోరుతున్నట్లు చెప్పడానికి అక్కడ ఇలా నాలుకబయటపెట్టి నవ్వుతారు. ఇది టిబెట్ సంప్రదాయం.

04/23/2016 - 21:47

టోపీ... అందానికి, రక్షణకు, హోదాకు, స్టైల్‌కు సంకేతంగా చెప్పుకునేవారు. టోపీ వాడకం చాలా పురాతన సంప్రదాయం. 3000 సంవత్సరాల క్రితంనుంచే వీటిని వాడేవారు. ఇటలీ-ఆస్ట్రేలియాల మధ్య పురాతత్వ తవ్వకాల్లో దొరికిన ఓ శిల్పం (వెనస్ ఆఫ్ బ్రస్సెమ్‌పౌయ్)లో ఇద్దరు మహిళలు టోపీ పెట్టుకున్నట్లుంటారు. ఆ శిల్పం కనీసం 25వేల సంవత్సరాల క్రితందిగా భావిస్తున్నారు. అంటే అప్పటికే వీటి వాడకం ఉందని చెప్పుకోవచ్చు.

04/16/2016 - 21:56

గుండ్రంగా, సిలెండర్ మాదిరిగా కన్పించే పుచ్చకాయలు అందరికీ తెలిసినవే. కానీ చదరపు ఆకారంతో ఉండే పుచ్చకాయలున్నాయని ఎందరికి తెలుసు. అయితే సహజసిద్ధంగా అవి అలా పెరగవు. మామూలు పుచ్చకాయ పాదులకే అవి కాస్తాయి. కృత్రిమ పద్ధతిలో వాటికి ఆ రూపం వచ్చేలా చేస్తారంతే. చతురస్రంగా ఉండే గాజుపెట్టెల్లో సాధారణ పుచ్చకాయలు పెరిగేలా చూస్తారు. అంటే బలవంతంగా వాటికి ఆ రూపు వచ్చేలా చేస్తారన్నమాట.

04/11/2016 - 00:49

వేసవితాపం తీర్చడంలో మజ్జిగ పాలకన్నా శ్రేష్టం. వెన్న తక్కువగా ఉన్న పాలతో చేసిన పెరుగును పల్చగా చిలికితే తయారయ్యే మజ్జిగలో పాలలోకన్నా ఎక్కువ ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయి. ఆహారాన్ని శక్తిగా మార్చడానికి కావలసిన పోషకాలు, మాంసకృత్తులు పుష్కలంగా ఇందులో ఉంటాయి. ఒక గ్లాసుడు మజ్జిగతో 100 కేలరీల శక్తి వస్తుంది. మజ్జిగ తాగడం వల్ల మూత్రనాళాలు, మూత్రాశయం, మూత్రపిండాలు శుభ్రపడతాయి.

04/11/2016 - 00:47

శరీరంలో వేడి తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి, బరువు తగ్గడానికి, మలబద్దకం నివారించడానికి సబ్జాగింజలతో చేసే పానీయం ఉత్తమం. మండువేసవిలో ఈ గింజలను ఉపయోగించి పానీయాలు తీసుకుంటే శరీరానికి చలవతోపాటు ఆరోగ్యం కుదుటపడుతుంది. విభూది తులసిగా చెప్పుకునే సబ్జామొక్కల గింజలు నల్లగా ఉంటాయి. వీటిని నీటిలో లేదా పెరుగు, ఐస్‌క్రీమ్, షర్బత్‌లలో వేస్తే కొద్దిసేపటికి తెల్లటిగుజ్జుతో ఉబ్బుతాయి.

04/11/2016 - 00:45

ప్రమాదకరం కాని కొవ్వు పుష్కలంగా ఉండే బాదం పప్పులు ఎంత తిన్నా నష్టం లేదు. రెండేళ్లదాకా నిల్వ ఉండే ఈ పప్పులు కొలెస్టరాల్ నియంత్రణకు, హృదయానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ పాలు పడనివారికి బాదంతో చేసే పాలు ప్రత్యామ్నాయంగా పనికొస్తాయి. ప్రస్తుతం బాదంపప్పుల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. నిజానికి బాదం ‘ట్రూ నట్’ కాదు. ఇది ఒక గింజమాత్రమే. వీటిపైన ఉండే కప్పు మనకి పనికిరాదు.

04/11/2016 - 00:43

ఐస్‌క్రీమ్‌లా కన్పించే కుల్ఫీ చాలా భిన్నమైన పదార్థం. క్రీ.శ. 16వ శతాబ్దంనుంచి ఇది అందుబాటులో ఉంది. పాలతో తయారు చేసే కుల్ఫీ పాశ్చాత్య దేశాల్లో తయారయ్యే ఐస్‌క్రీమ్‌కన్నా నెమ్మదిగా కరుగుతుంది. వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే వివిధ రుచుల్లో ఇది లభ్యమవుతుంది. భారత దేశంలో మొఘల్ పరిపాలనా కాలంలో ఇది మనకు అలవాటైంది. రూపంలో, రంగులో ఐస్‌క్రీమ్‌లకన్నా భిన్నంగా ఉంటుంది.

04/03/2016 - 05:26

భారతీయులు ఎక్కువగా ఉపయోగించే బెల్లం ఉత్పత్తి, వాడకం పాశ్ఛాత్య దేశాల్లో తక్కువే. చాలాదేశాల్లో వారికి బెల్లం తెలియదంటే నమ్మాలి. భారత్, పాక్, మయన్మార్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్‌వంటి ఆసియా దేశాల్లోను బెల్లం తయారీ ఓ పరిశ్రమగా వర్థిల్లుతోంది. ఒకటీఅరా ఆఫ్రికాదేశాల్లోను, ఈమధ్య యూరప్‌లో, కొంతకాలంగా గల్ఫ్ దేశాల్లో అక్కడక్కడ బెల్లం వాడకం పెరుగుతోంది.

03/26/2016 - 20:57

కామన్ హిప్పోపోటమస్‌లకు వారసులే అయినా వాటికంటే భిన్నమైన ఎన్నో ప్రత్యేక లక్షణాలున్న పిగ్మీ హిప్పోపోటమస్ (పొట్టి నీటిఏనుగుల)లు అంతర్థాన దశకు చేరుకుంటున్నాయి. సాధారణ నీటిఏనుగులుకన్నా పరిమాణం, బరువులో ఐదోవంతు మాత్రమే ఉండే ఇవి చూడటానికి ముద్దుగా, బొద్దుగా ఉంటాయి. సహారా ప్రాంతంలో సాధారణ నీటిఏనుగులుంటే పిగ్మీహిప్పోలు మాత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి.

03/20/2016 - 00:18

‘సీ పారెట్స్’గా పిలిచే ఈ ‘పఫిన్’ పక్షులు నిజానికి చిలుకలు కావు. వీటి ముక్కువల్ల వాటికి ఆ పేరువచ్చింది. ఇవి సముద్రపక్షులు. వీటి ముక్కు సీజన్‌బట్టి రంగు మారుతూంటుంది. శీతాకాలంలో వీటి ముక్కు లేతబూడిద రంగులో ఉంటే వసంతకాలం వచ్చేసరికి ముదురు ఎరుపు లేదా కాషాయవర్ణంలోకి మారుతుంది. నిజానికి వసంతం వచ్చేసరికి అవి జతకలిసే సమయం వచ్చినట్లన్నమాట. సరైన జతను ఆకట్టుకోవడంకోసం ఇవి ఇలా ఆకర్షణీయంగా మారిపోతాయన్నమాట.

Pages