S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

01/02/2016 - 17:43

ఇది నిజమేసుమా. అప్పుడే పుట్టిన పసికందుకన్నా, అప్పుడే పుట్టిన కోడిపిల్ల చురుకుగా ఉంటుంది. అదీగాక చుట్టుపక్కల పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవగాహన, అలవాటు చేసుకోవడం, భద్రతను చూసుకోవడం దీనికి తక్షణమే అలవడుతుంది. అలాగే కోడిగుడ్డుపై 17వేలకుపైగా సూక్ష్మరంధ్రాలుంటాయి.

12/26/2015 - 23:57

మనిషి శరీరంలో అత్యంత క్లిష్టమైన నిర్మాణవ్యవస్థ ఉన్న భాగం మెదడు. ఆ తరువాత అలాంటి భాగం కన్ను. మెదడుకు, కంటికి లింక్‌గా ఉండే ‘ఆప్టిక్ నెర్వ్’ అతి సున్నితమైన, క్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేయడం ఇప్పటివరకు మనిషికి సాధ్యం కాలేదు. అందుకే ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇప్పటికి సాధ్యం కావడం లేదు. ఇక మనిషి పుట్టినప్పడు ఎంత పరిమాణంలో కన్ను ఉంటుందో జీవితాంతం అదే సైజులో ఉంటుంది.

12/19/2015 - 18:24

నిటారుగా, ఎత్తుగా ఎదిగే కొబ్బరిచెట్లు ఎక్కి కాయలను తెంపడం మనిషికి కష్టమైన పనే. పైగా ప్రాణానికి ప్రమాదంకూడా. కానీ కోతులకు అది పెద్దకష్టమైన పనికాదు. అందుకే ఒకజాతికి చెందిన కోతులను కొబ్బరికాయలు తెంపే పనిలో శిక్షణ ఇచ్చి వదులుతున్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, మలేషియాల్లో ఇందుకోసం ప్రత్యేక శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటికి మంచి డిమాండ్‌కూడా ఉంది.

12/12/2015 - 18:20

ప్రపంచంలో ఇప్పటికీ మిస్టరీగా ఉన్న జెయింట్ స్క్విడ్స్ సజీవంగా కన్పించినది 2004లో మాత్రమే. తొలిసారి దానిని జపాన్ పరిశోధకులు చూశారు. 2006లో తొలిసారిగా దాని కదలికలను వీడియో తీయగలిగారు. అంతకుమించి దాని గురించి వారికి తెలిసింది చాలా తక్కువే. వాటి కళేబరాలు, మృతదేహాలు, శిలాజాల ఆధారంగా మాత్రమే కొన్ని విషయాలను కనుగొన్నారు. వీటి పొడవు కనీసం 50 అడుగులు ఉంటుంది. దాదాపు టన్ను బరువుంటుంది.

12/05/2015 - 18:01

పశ్చిమ కనుమలను నీలగిరులని పిలుస్తారుకదా..కానీ అక్కడ (తమిళనాడు-కేరళ) నీలం అంటే...ఊదారంగనే అర్థం. ఆ కొండలను దూరంనుంచి చూస్తే నీలవర్ణంలో కన్పిస్తాయి. సాధారణంగా అలా కన్పించినా పనె్నండేళ్లకోసారి మాత్రం ఆ కొండకోనలన్నీ అచ్చమైన నీలగిరులు (ఊదారంగుపూలతో)గా కన్పిస్తాయి. అందమైన నీల్‌కురింజి పూలు పెద్దఎత్తున వికసించి పశ్చిమ కనుమలన్నీ పూలపాన్పులైపోతాయి.

11/28/2015 - 16:44

కొంగజపం అని వెటకారం చేస్తారుగానీ..వాటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. పక్షిజాతిలో ఇవి ఎగరగలిగినంత ఎత్తుకు మరే పక్షీ ఎగరలేదు. అవసరమైతే ఆకాశంలో ఇవి 32,800 అడుగుల ఎత్తునకూడా ధీమాగా ఎగరగలవు. వలసవెళ్లే సమయంలో కనీసం 10వేల మైళ్లదూరాన్ని అధిగమిస్తాయి. అవసరమైతే రోజుకు 500 మైళ్ల దూరం ఎగురుతాయి. ఒకసారి జతగడితే ఆ పక్షులూ రెండూ జీవితాంతం కలిసే ఉంటా యి. పిల్లల్ని కలసి సాకుతాయి.

11/21/2015 - 22:17

తియ్యటి రుచి, ఆకట్టుకునే రంగు, మంచి పరిమళంతోకూడిన స్ట్రాబెర్రి నిజానికి బెర్రి జాతికి చెందినది కాదు. అది గులాబి జాతికి చెందిన పండు. ఈ పళ్లంటే కొందరికి తెగ ఇష్టం. వింబుల్డన్‌లో టెన్నిస్ మ్యాచ్‌ల సీజన్‌లో అక్కడివారు 27వేల కిలోల పళ్లు తినేస్తారుట. పండు బయట విత్తనాలుండటం దీని ప్రత్యేకత. ప్రతి పండుకు 200 విత్తనాలుంటాయి. అన్నట్లు బయట కన్పించే ప్రతి విత్తనం అసలుది కాదు.

Pages