S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

06/10/2017 - 22:26

మలేసియా, వియత్నాం, థాయ్‌లాండ్, భారత్ తదితర ప్రాంతాల్లో కనిపించే ‘సన్ బేర్’ ఎలుగుబంట్లు ‘బేర్’ జాతి జీవుల్లో అతి చిన్నవి. ఐదారు అడుగుల ఎత్తు పెరిగే వీటికి ఛాతీపై సూర్యుడిలాంటి పసుపు లేదా జేగురు రంగు మచ్చ ఉండటం వల్ల వాటికి సన్‌బేర్ అన్న పేరు వచ్చింది. మొక్కల చాటున నక్కి ఉండి శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించే ఇవి తేనె, చెదలు, చీమలను ఎక్కువగా తింటాయి.

06/04/2017 - 02:41

పాండాల్లా కళ్లచుట్టూ నల్లని చారలు, మూతివద్ద నల్లటి మందమైన లైనింగ్, మిగతా శరీరమంతా గ్రే కలర్‌లో ఉండి చూడటానికి ముచ్చటగా ఉండే ఈ వేల్‌జాతి జీవులను ‘నీటి పాండా’లుగా పిలుస్తారు. కాలిఫోర్నియా జలసంధి, మెక్సికో జలాల్లో కనిపించే ‘వక్విటా’ జీవజాతి దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 150కు మించి లేవు. చేపలవేట కోసం వేసే వలలే వీటి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి.

06/04/2017 - 02:36

తలపై రెండువైపులా చెవుల్లాంటి ‘్ఫన్స్’ ఉన్న ఈ జలచరాన్ని ‘డుంబో ఆక్టోపస్’ అని పిలుస్తారు. ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ కేరక్టర్ డుంబో పేరు దీనికి పెట్టారు. పెద్దచెవులు, చిన్న శరీరం, ఎగరగలిగే శక్తితో కూడిన ఆ ఏనుగును పోలినట్లు ఉండటం వల్ల ఈ ఆక్టోపస్‌కు ఆ పేరు వచ్చింది. మిగతా ఆక్టోపస్‌లకు భిన్నంగా వీటికి తలపై ఇరువైపులా చెవుల్లా రెక్కల్లాంటి భాగాలుంటాయి.

05/21/2017 - 05:08

ఆకుపచ్చగా అందంగా కనిపించే రామచిలుకలంటే ఇష్టపడనివారుండరు. కానీ న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ‘కకాపో’ అనే చిలుకలు ఎగరలేవు. పైగా వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎగరలేని, అతిపెద్ద రామచిలుకలు ఇవే. వాటి రెక్కలు మిగతా చిలుకలకన్నా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. కానీ వాటికి వాసన గ్రహించే శక్తి చాలా ఎక్కువ. వాటి కాళ్లు బలంగా ఉండి చెట్లు ఎక్కడానికి ఉపయోగపడతాయి. ఆహారం కోసం కనీసం 5 కి.మీ.

05/21/2017 - 05:07

క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒకరకమైన ఆకుకూర బ్రకోలి. ఇటలీకి చెందిన ఈ బ్రకోలీ నిజానికి పుష్పగుచ్చపు పైభాగం అన్నమాట. గాఢమైన ఆకుపచ్చని వర్ణంలో ఉండే పుష్పగుచ్చాన్ని పచ్చిగాను, ఉడకబెట్టి తింటారు. వీటిలో ఉండే గ్లుసినోలేట్స్ కళ్లకు మేలు చేస్తాయి. గ్లుకోమా వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. మిగతా కూరల్లో లేనంత విటమిన్ సి, ఎ, కె వీటిలో ఉంటాయి.

05/21/2017 - 05:05

సాధారణంగా పళ్లు, గింజలు, కీటకాలను పక్షులు తింటాయి. కానీ న్యూజిలాండ్‌లో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షి ‘టకాహే’ గడ్డిని ఇష్టంగా తింటుంది. ఫెర్న్‌వంటి మొక్కల మొదళ్లను, కాడలను ఆరగిస్తుంది. 1800-1900 సంవత్సరాల మధ్య విస్తృతంగా కనిపించిన ఈ పక్షులు ఉన్నట్లుంది కనుమరుగయ్యాయి. దాదాపు అంతరించిపోయాయనుకున్నారంతా.

05/07/2017 - 23:20

యురేసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించే ‘బ్లాక్ బర్డ్స్’ అద్భుతంగా కూస్తాయి. వాటి పాట వింటే మనసు తేలికపడుతుంది. మన కోకిల మాదిరిగా వాటి పాటలను అక్కడివారు ఆస్వాదిస్తారు. వీటిలో ఏడాదిలోపు పక్షులు జనవరి చివరి నుంచి ఫిబ్రవరిలో మాత్రమే పాట అందుకుంటాయి. ఎదిగిన పక్షులు మార్చి నుంచి జులై మధ్య పాడటం అలవాటు. సాధారణంగా వర్షం కురిసిన తరువాత కూయడం వీటికి ఎంతో ఇష్టం.

05/07/2017 - 23:19

ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ ‘హనీఈటర్’ పక్షుల పాట మనోహరంగా ఉంటుంది. సూర్యోదయానికి ఓ గంట ముందు ఓ అరగంటపాటు మగపక్షులు అద్భుతంగా చేసే కువకువలు చెవులకు ఇంపుగా ఉంటాయి. ముక్కునుంచి కళ్లమీదుగా చెవుల వెనుక వరకు నల్లచి చారలు వీటికి కొత్త అందాన్నిస్తాయి. వీటికి తేనె అంటే చాలా ఇష్టం. పూల చుట్టూ ఎగురుతూ ప్రత్యేకంగా ఉండే ‘బ్రష్ టిప్‌డ్’ నాలుకతో తేనెను జుర్రుకుంటాయి.

05/06/2017 - 03:32

తిమింగలా(వేల్)ల్లో అతి చిన్నవాటిలో ఒకటైన బెలుగా వేల్స్ ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. పుట్టినపుడు నల్లగా లేదా గోధుమవర్ణంలో ఉండే ఇవి వయసు పెరిగేకొద్దీ తెల్లని తెలుపుతో మెరిసిపోతాయి. మిగతా తిమింగలాలకు భిన్నంగా మెడను ఎటుకావాలంటే అటు, గుండ్రంగానూ తిప్పగలగడం వీటి ప్రత్యేకత. 13 నుంచి 22 అడుగుల పొడవు పెరిగే ఇవి చిన్న తిమింగాల్లో ఒక జాతికి చెందినవి.

05/06/2017 - 03:31

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ జంతువు పేరు ‘నంబట్’. దీనికి చెదలు, చీమలంటే ఇష్టం. చెదలు, చీమలు పెట్టిన పుట్టలను ఇవి ఏమాత్రం పాడుచేయవు. చెదలు లేదా చీమలు బయటకు వచ్చేవరకు అవి ఓపికగా వేచి చూస్తాయి. వచ్చిన వెంటనే నాలుకతో లాక్కుని తింటాయి. ఒక్కో నంబట్ రోజుకు కనీసం 20వేల చెదలను తింటుంది. తన శరీరం బరువులో ఇది పదిశాతం.

Pages