S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/06/2019 - 19:54

గడ్డిపరకలన్నీ కలిపి మదపుటేనుగును బంధించినట్లు.. అని మనం ఎప్పుడో చదువుకున్నాం. అలాగే పెరూలోని ఓ ప్రాంతంలో ప్రవాహవంతమైన నదిని దాటడానికి అక్కడి ప్రజలు గడ్డిపరకలను పేని బలవంతమైన వంతెనను తయారుచేసి ఒక కొండ నుంచి మరో కొండను చేరుతున్నారు. నిజంగా గడ్డిపరకలు అంత బలవంతమైనవా? అనే ప్రశ్న మెదిలింది కదూ.. ఏమో చూద్దాం!

07/06/2019 - 19:49

మనది అసమానతలు గల సమాజం. దానిని ప్రజాస్వామిక వ్యవస్థకు తగినట్లు రూపొందించుకోవలసి ఉంది. ప్రజాస్వామ్యానికి సమానత్వం పునాది. ఆ సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. అందుకే అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రోడ్‌రోలర్ చేసే పని చేయాలన్నారు. సమాజంలో ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన వర్గాలను విద్య ద్వారా ఏకీకృతం చేయటం జరగాలి. దాన్ని విద్యారంగం సవాల్‌గా తీసుకోవాల్సి ఉంది.

07/06/2019 - 19:41

భారత గత యూపీఏ కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల వ్యయం తగ్గించడం, వాతావరణ కాలుష్య నివారణకు, విలువైన విదేశీమారక ద్రవ్యం మదింపుకోసం జీవ ఇంధనాల ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి నిలిపింది.

07/06/2019 - 19:39

‘అమ్మో... అమ్మో!’ సంఘసేవ, సాంఘిక న్యాయం అంటూ ఎంతలేసి మాటలంది కోడలు మాణిక్యం. ఏమైనా సరే ఈ విషయం వాళ్ల నాయన రాఘవ చెవిని వేయవలసిందే. అది చేసిన రాద్ధాంతం రాద్దామంటే ఎంతగా కలం కదిలించినా ఉత్తరం ముందుకు సాగడంలేదు. సరికదా తనకున్న చిటికెడు తెలివి స్తంభించిపోయింది అదన్న మాటలకి. తానన్న మాటల్ని..

07/06/2019 - 19:00

ఎవరికి తెలియని జీవిత మర్మాలని అలవోకగా
సంగీకరించగలడు

ఎనే్నళ్ల తపస్సో
వనవికాసం గల ప్రకృతిలో
కలిసిపోయి
వేణుగానంతో బాధలను
దూరంగా తరిమేసి
తన ఊపిరితో
ప్రాణం పోస్తున్నాడు
పుట్టుగుడ్డి కావొచ్చు గానీ
అతని మనస్సు నిండా వేల చక్షువుల
కిలకిలరావాలే

07/06/2019 - 18:59

తొలకరి పలకరింత
పుడమి తల్లి పులకింత
రైతన్న తనువంత
మట్టివాసనల జలదరింత

చినుకు చినుకై రాలి
పుడమి తనువు తడిపి
దివి నుండి భువికేగిన
ఓ చినుకమ్మా నీకు వందనం
చుక్కగా రాలి మొక్కకు ఆయువు పోసి
ఎండిన కొమ్మలకు ఆకుపచ్చ రంగేసి
చక్కని నీ జలధారతో
నదీనదాలు నింపే జీవధారపు నువ్వు

07/06/2019 - 18:57

అది ఓ అందాల మేడ
అద్భుతమైన అబద్ధాల మేడ
అందులోని వాళ్లంతా
చక్కని చిక్కని కథలల్లుకుంటూ
ఒకరికొకరు చెప్పుకుంటూ
సంబరపడి పోతూంటారు
పెళ్లాం పచార్లు
మొగుడి సరదాలు
ప్రేమ ఉచ్చులో పిల్లలు
మతాబుల్లాంటి మందహాసాలతో
ఒకరినొకరు నెట్టుకొంటూ,
తిట్టుకొంటూ వీధినపడి
ఒకటే పరుగులు
కొన్నాళ్లకు వీళ్ల కెవ్వుకేకలు

07/06/2019 - 18:56

ఇన్ని రోజులు గడిచాక
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ
ఒంటరి ఇల్లును వదిలి
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా
మనసు నిలకడగా లేదు
చుట్టూ చూస్తున్నాను
ఆదరిచే ప్రపంచం నెలకొని ఉంది
ఒకచోట ఉండాలనే ఉంటుంది
వీచే గాలులు ఉరిమే ఉరుములు
ఏవీ నాలో నన్ను ఆట్టే ఉండనీయవు
ఏదో ముందుకు లాగినట్టు
గెలుపేదో ఒక మార్గం నిర్దేశిస్తున్నట్లు

07/06/2019 - 18:36

రాలే వర్షపు నీటిచుక్క బీడును తడిపినా
మోడుపై చిలికినా ఆశలు ఫలియించునా.. ఆశయం చిగురించునా
జారే కన్నీటి చుక్క గుండె మంటలార్చునా..
మదినోదార్చునా.. ఊరట కలిగించునా..
ఎదలో దుఃఖం ఉపశమించునా..
శూన్యాకాశంలో తళుకుమనే తారకలు మాయమై
నిశీధిని తలపునకు తెస్తూ కటిక చీకటి నిండిన
జీవితమొక కథయై కలయై కదలని శిల్పమై
ఆశలుడిగిన మనిషి మనుగడ దుర్భరమై

07/06/2019 - 18:27

పిల్లలు బాగా చదవాలని, మంచి మార్కులు వస్తే ఏదైనా బహుమతిని ఇస్తామని చెబుతాం. వాళ్లకి అది ఒక ప్రేరణగా ఉంటుంది.
ఈ పరిస్థితిని మనమూ చిన్నప్పుడు చూసి ఉంటాం. చిన్నప్పుడు ప్రేరణ అవసరం. సహజం కూడా. అందరికీ అలాగే ఉంటుంది.
మనలో చాలామంది పెద్దవాళ్లు అయిన తరువాత కూడా ఇలాంటి ప్రేరణని కోరుతున్నారు. నిజంగా అది అవసరమా?

Pages