S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/20/2019 - 20:12

తిరిగిరాని నిన్నటిని తలచుకొని
తల్లడిల్లుతున్నాము
ఏవి ఆనాటి రోజులు
కాలానుగుణంగా మనిషికి
నేనున్నానంటూ ఆసరాకి
చేయి అందించిన
మానవతా మూర్తులు

ఆరుగాల పంటలని పండించే
రైతైనా ఆకలంటు
వచ్చినవాడి కడుపు
నింపిన సంతోషపు రోజులు
కేవలం కొన్ని మిగిలిపోయే
గుర్తులేనా

04/20/2019 - 20:11

అంతగా సముద్రాన్ని మధిస్తేనే
అమృతం వచ్చింది
ఆరుగాలం పొలంలో శ్రమిస్తేనే
అన్నం దొరుకుతుంది

జీవితం
గాలిపటాలాట కాదు
పెయించీ వేసి తెగ్గొడితే
జీవితమే గాలిలో గాలిపటం

మారాలని చెప్పే ముందు
మారు నువ్వు ముందు
నీ నుంచే రావాలి
ఏ మార్పైనా ముందు

04/20/2019 - 19:52

వార్షిక పరీక్షలైనా, ప్రవేశపరీక్షలైనా దగ్గర పడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే.

04/20/2019 - 19:32

నా ఇంటి గుమ్మం ముందు
చూపులు వేలాడేసుకుని
ఒక రావి చెట్టూ పలకరిస్తూ
రుతువుల్ని తనలో మెరిపిస్తుంది.

నల్గురు మాట్లాడే రచ్చబండ నుంచీ
కాస్త దూరం జరిగాక
ఒంటరి నగర జీవనం
ఒక శిశిరంలానే కనిపిస్తుంది.

అంత పెద్ద చెట్టూ
ఆకు రాలి మోడువారినా
వసంతాన్ని మరచిపోనట్లు
రేపటి చిగుర్ల కోసం శ్వాస తీస్తుంది.

04/20/2019 - 19:15

నీ ప్రకాశం
నా లోలోపలి చీకట్లు తరిమేస్తుందనుకున్నాను
నీ పెదవి పలకరింపు
ఆప్యాయతను వర్షిస్తుందనుకున్నాను
నీ నడక నా నడకతో
జత కలుపుతుందని వూహించాను
నా అజ్ఞానంతో
నువ్వు సరిపెట్టుకుంటావని
నా అమాయకత్వానికి
నువ్వు గుడి కట్టుకుంటావని
విశ్వసించాను
నీ వికాసం
నేను కోరుకున్నాను
నీ చూపులు నాపై ప్రసరిస్తాయని

04/20/2019 - 19:14

ఈ దేశంలో పుట్టాను కనుక
ముందుగా హిందువును
ఆ తర్వాతే కవితా సింధువును
అందరికీ ఆత్మబంధువును
ఏ వాదంతో పనిలేని ఆహ్లాదమే
నా కవిత్వం
ఈ కాలాన్నిబట్టి అబద్ధాల్ని
అక్షరాలు చెయ్యలేక
నిత్యం సత్యానే్వషణలోనే గడిపేస్తుంటా
మొగలి పువ్వును ఎవరికివ్వాలో వారికే ఇస్తా
వెచ్చని శ్వాసలో నిశ్చలులైన
చెయ్యి తిరిగిన
రచయితలంటే రాతిబండలు కారు

04/20/2019 - 19:04

మనం ఉదయాన నడుస్తున్నప్పుడు ఇతరులతో సంభాషించకుండా, సెల్‌ఫోన్‌లో మాట్లాడకుండా, పాటలు వినకుండా నడవాలని చెబుతారు. వీటితోబాటూ మరో విషయం కూడా చెబుతారు. నిటారుగా నడవమని.
ఉదయం నడకలోనే కాదు.
జీవితంలో ఎప్పుడూ నిటారుగానే నడవాలి.
నిటారుగా నడిచే విధంగా మన జీవితాన్ని మలచుకోవాలి. మనం ఎంత మంచిగా వున్నా విమర్శలు వస్తూనే ఉంటాయి. ఎన్ని విమర్శలు వచ్చినా మనం నిటారుగానే నడవాలి.

04/13/2019 - 21:59

అమ్మ దీవెన అందరికీ తెలుసు
ఆమె ప్రసవ వేదన ఎందరికి తెలుసు?
అందుకే అందరూ మాతృభూమికీ
మాతృదేశానికీ రక్షక భటులు కావాలి
కాళీమాత ఆశీస్సులే
శారదా రామకృష్ణుల శాశ్వతానందం
భువనేశ్వరీ దేవి తపోఫలమే
వివేకానందుని జన్మసాఫల్యం
జిల్లెళ్లమూడి అమ్మ ఆశయమే
ఆమె సన్నిదానంలో నిత్యాన్నదానం
ఛత్రపతి శివాజీ
రాణీ రుద్రమదేవి
కంచి పరమాచార్య

04/13/2019 - 21:37

భారతావని ప్రసవించిన మహా పురుషులలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు అత్యంత ప్రాచీన చారిత్రక పురుష నాయకుడు. శ్రీరామచంద్రుని చారిత్రక పురుషునిగా పాశ్చాత్య పరిశోధకులు కూడా నిర్ధారించారు.

04/13/2019 - 21:35

శ్రీమతి దామెర్ల కనక విజయలక్ష్మి ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్య నర్తకి, గురువు. నర్సాపూర్‌లో 20 ఏళ్ల క్రితం నటరాణి కూచిపూడి డాన్స్ అకాడెమీ స్థాపించి ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. శ్రీమతి విజయలక్ష్మిగారు ఒకవైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, తల్లిగా, గృహిణిగా ఎన్నో కర్తవ్యాలు నెరవేరుస్తున్నారు. మరొకవైపు గురువు, నర్తకి, పరిశోధకురాలిగా దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు.

Pages