S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/29/2018 - 18:40

భావం: వ్రజ గ్రామాలలో వుండే పురుషులంతా కృష్ణమాయలో పడి, తమ తమ ఆడవారంతా తమ ఇళ్ళలోనే ఉన్నారని భావించారు. అందువల్ల బాలకృష్ణుడు తమ ఆడవారిని ఆకర్షిస్తున్నాడని ఎవరూ భావించలేదు. అందుకే ఆయన మీద అసూయపడలేదు.)

12/22/2018 - 20:34

క్రిస్‌మస్ అనగానే గుర్తొచ్చేది.. అందరికీ ఇష్టమైనది.. కమ్మనైన కేక్. కేక్.. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎంతో ఇష్టం. క్రిస్‌మస్ నెల మొదలవ్వగానే అందరూ కేకు తయారీలో నిమగ్నమైపోతారు. మునుపు.. అంటే పూర్వకాలం.. అందరూ పండుగల్లో ఎలాగైతే తీపి పదార్థాలు చేసుకుంటారో అలాగే క్రిస్‌మస్ రోజున 3పారిడ్జ్2 అనే పాయసాన్ని చేసుకునేవారట..

12/22/2018 - 20:26

ఆ జీవులు తమకు క్రొత్తగా అనుభవానికి వస్తున్న ఈ దశ ఏమిటా-అని ఆలోచించుకునే లోపలే, వారి మనసులు వారి వశం తప్పిపోతున్నాయి.
(i) కొందరు ఆ సమయానికి ఇంకా గొడ్లకు పాలు పితుకుతున్నారు.
(ii) కొందరు పాలముంత పొయ్యి మీద పెట్టబోతున్నారు.
(iii) కొందరు పొయ్యి మీద అన్నం కలియ బెట్టబోతున్నారు.
(iv) కొందరు వడ్డిస్తున్నారు.
v) కొందరు పిల్లలకు పాలిస్తున్నారు.

12/15/2018 - 23:49

ప్ర: పుస్తకాలు ఎందుకు చదవాలి?
జ: మానవ సమాజం నిర్మించకున్న విజ్ఞాన సంపదను వారసత్వంగా వర్తమాన సమాజానికి అందించేవి పుస్తకాలు. వీటిని చదవకుండా మానవ సమాజం అభివృద్ధి చెందదు.
ప్ర: పుస్తకాలు చదివితే అనుభూతి..?

12/15/2018 - 22:59

ప్రతి వ్యక్తిలో అతనికి తెలియని చెకుముకి రాయి ఉంటుంది.
ఈ రోజటి పరిభాషలో చెప్పాలంటే అగ్గిపుల్ల ఉంటుంది.
ఆ అగ్గిపుల్ల, ఆ చెకుముకి రాళ్లు అతని జీవితానికి సంబంధించినవి.
అది అతని ఇష్టాలు కావొచ్చు.
అతని శక్తిసామర్థ్యాలు కావొచ్చు.
అతని లక్ష్యాలు కావొచ్చు.
వాటివైపు అతని ప్రయాణం కొనసాగుతుందా లేదానన్నది ముఖ్య విషయం.

12/15/2018 - 20:09

మీరు సరిగ్గానే చదివారు.. వివరం ఏంటంటే.. ఒంటినిండా నగలతో, మేకప్‌తో ఎంతో అందంగా ఒదిగి కూర్చున్న ఈ పెళ్లికూతురుని చూసి మురిసిపోతున్నారేమో.. ఈమె నిజమైన పెళ్లికూతురు కాదు. షోకేస్‌లో పెట్టిన నోరూరించే కేక్.. అస్సలు నమ్మబుద్ధికావడం లేదు కదూ.. నిజమే.. యూకేకు చెందిన ఎమ్మా జేన్ ఈ అందమైన కేక్‌ను తయారుచేసింది. ఎమ్మాజేన్ ప్రత్యేకత ఏంటంటే..

12/15/2018 - 20:04

ఆ స్టేషన్ రెండు రాష్ట్రాల్లోనూ ఉంది..
ఆ స్టేషన్‌లోని బెంచ్ కూడా రెండు రాష్ట్రాల్లో ఉంది..
ఏమిటీ కన్‌ఫ్యూజన్? ఆ స్టేషన్ అంత పెద్దదా? లేక ఆ బెంచా? అనుకుంటున్నారు కదూ.. వివరాల్లోకి వెళితే..

12/15/2018 - 19:57

(iii) ఇంకా ఎందరెందరో జీవులు పూర్వజన్మలలో చేసుకున్న మహాతపస్సులవల్లా, తన వరాలవల్లా, ఈ నాడు తన దగ్గర గోపికలై జన్మించి వున్నారు. (ఈ విషయాలు గర్గసంహిత, బ్రహ్మవైవర్త పురాణం, వంటి గ్రంథాలలో వున్నాయి)
(iv) వీరిలో కొందరు కన్యలున్నారు. వారు తనను భర్తగా పొందాలని కాత్యాయనీవ్రతం చేసి వున్నారు. ఒక రాత్రి క్రీడిస్తానని వారికి తనే వరం ఇచ్చి వున్నాడు.

12/15/2018 - 18:16

రఘు ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. ప్రతి రూపాయిని నాలుగైదుసార్లు ఆలోచించుకొని మరీ ఖర్చు చేస్తాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని మల విసర్జనలో రక్తం కనిపించింది. వేడి చేసిందేమోనని కొబ్బరిబోండాం తాగాడు. మరుసటి రోజు కూడా రక్తస్రావం కలగటంతో తన ఇంటి దగ్గరలోని మందుల షాపు వ్యక్తిని కలిసి తన సమస్య చెప్పాడు. కంగారు పడనవసరం లేదు. ఇది పైల్స్ అని మందుల షాపు అతను ఏవో బిళ్లలు ఇచ్చాడు.

12/08/2018 - 21:57

గత చరిత్ర లాంటి డైరీలోని కాగితాలకు సెలఫెన్ టేప్ వేసి కొత్త జీవితం ప్రారంభించండి అని ఓ పెద్దాయన చెప్పిన మాటలు నన్ను బాగా ఆకర్షించాయి. సమాజ హితం కోసం మీరు చేపట్టే కొత్త జీవితమే ప్రజలూ సమాజం గుర్తుంచుకుంటుంది. టేప్ వేసిన పేజీలు ఎవరికీ అవసరం లేదు.
నిజమే!!
ఇప్పటి వరకు మనం మంచి చేశామో, చెడు చేశామో మనకు తెలుసు. చేసిన వాటిని ఇప్పుడు మనం మార్చలేం.

Pages