S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/20/2018 - 21:06

అక్షరరూపం దాల్చిన ఒకేఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంతమైన ఆయుధం. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి అయుఃప్రమాణం వందేళ్లయితే, గ్రంథ ఆయుఃప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంథ పూజను పుస్తకాల (సరస్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రులలో నిర్వహించే ఆచారం కొనసాగుతున్నది.

01/20/2018 - 21:01

విజయవాడలో 29 సంవత్సరాలుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవం ఈ నెల 12వ తేదీతో ముగిసింది. అయితే ప్రతీ ఏటా జనవరి నెలలో జరుగుతున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ పాఠకులకు, పుస్తక ప్రియులకు ఎంతవరకూ ఉపయోగపడుతుందని ఆలోచిస్తే ఈ క్రింది విషయాలను ఒక్కసారి తరచి చూసుకోక తప్పదు.

01/20/2018 - 20:38

చాలా రోజుల క్రితం ఒక కథ విన్నాను. ఆ కథలోని ఒక యువకుడు అందమైన జీవితాన్ని సౌకర్యాలని పొందాలని ఆకాంక్షిస్తూంటాడు. అలాగే కలలు కంటూ ఉంటాడు. ఏ పనీ చేయకుండా ఉంటాడు. ఏదైనా పని చేసినా చాలా కష్టంగా భావిస్తుంటాడు.

01/20/2018 - 20:36

భూతాపం పెరిగిపోవడం పర్యావరణ అసమతుల్యత ఏర్పడి ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నాయని అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే రెండు దశాబ్దాల్లో అకస్మాత్తుగా వరదలు వెల్లువెత్తడం, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం సాధారణమైపోతుందని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా అమెరికా, ఇండియా, ఆఫ్రికా, మధ్యఐరోపా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.

01/13/2018 - 21:46

పండుగ వచ్చిందంటే పిల్లలకు నిజంగా పండుగే. సంక్రాంతి పండుగ వస్తే ఇల్లంతా పండుగే. ఊరంతా పండుగే. ఈ మూడు రోజుల పండుగలో ఆనందం ఉంది. అల్లరి ఉంది. ఆరోగ్యం ఉంది. సరదా ఉంది. సంతోషం ఉంది. కలుపుగోలుతనం ఉంది. కలివిడితనం ఉంది. ప్రకృతి అందాలున్నాయి. పర్యావరణ హితం ఉంది. కళ ఉంది. నమ్మకం ఉంది. ఆరాధన ఉంది. ఆధ్యాత్మికత ఉంది. ఎన్ని విశేషాలు.. ఎంత విశిష్టత.. మూడు రోజుల పండుగలో ఎన్నో పరమార్థాలున్నాయి.

01/13/2018 - 21:42

ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగురవెయ్యడంలోని ఆనందం ఆనిర్వచనీయం. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ఏటా జనవరి నెల ఆరంభంతోటే సర్వత్రా గాలిపటాల కోలాహలం మిన్నంటుతుంది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల్లోనూ ఇప్పటికీ పతంగుల పోటీలు నిర్వహిస్తున్నారు.

01/13/2018 - 21:39

సూర్యుడు మకర రాశిలోకి మారడమే సంక్రాంతి అని అనవచ్చు. సూర్యుడు ఒక్కో రాశిలోకి మారడం సహజమే అయినా దేవతలకు ఉత్తరాయణం పగలుగాను, దక్షిణాయనం రాత్రిగాను భావిస్తాం. కనుక ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే దేవతలకు సూర్యోదయం అవడం అన్న మాట.

01/13/2018 - 21:35

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతినాడు తెలుగువారి గృహాలకు కన్నుల పండువుగా వస్తుంది పౌష్యలక్ష్మి సంక్రాంతి సుందరి. కొత్త వంటలు, కొత్త అల్లుళ్లు, సరికొత్త బట్టలు అంతా నూతనత్వంతో వెల్లివిరుస్తుంది.

01/13/2018 - 21:34

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీరధార హైందవ సంస్కృతి. ఆ పాలవెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘పండగ’ కేంద్ర బిందువు. పండుగలు శుభసూచకాలై, ప్రతి కుటుంబంలో కష్టనష్టాలను మరపించి, నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. పండగలు పురాణేతిహాస, రుతు సంబధాలు, శీతోష్ణస్థితుల, సామాజిక జీవన విధానాధారాలుగా ఏర్పడ్డాయి.

01/13/2018 - 21:29

భక్తి ఉద్యమం వలన దక్షిణ భారతంలో వచ్చిన గొప్ప కళాసంపద హరిదాస గానం. ఇది ఇంచుమించుగా విజయనగర రాజుల కాలం నుండి ప్రచారాన్ని పొందింది.
ఆళ్వార్లు, నాయనార్లు భక్తి సంప్రదాయానికి పునాదులు వేశారు. శ్రీరామానుజులు సర్వసమానత్వం ప్రాతిపదికగా భక్తిమతాన్ని ప్రబోధించారు.
శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పన్నిద్దరాళ్వార్లలో శ్రీ తిరుప్పాణి ఆళ్వార్ ఈ హరిదాస వర్గానికి చెందినవారే.

Pages