S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/25/2017 - 21:10

అవంతీపుర రాజ్యానికి విక్రమసేనుడు రాజు. విక్రమసేనుడికి ప్రజల సంక్షేమం కంటే తన వినోద విలాసాల పట్లే మక్కువ ఎక్కువ. తరచుగా వేటకు వెళ్లడం, మిగిలిన సమయాన్ని సంగీత నృత్య కార్యక్రమాలలో గడుపుతూ ప్రజా పాలనని పూర్తిగా విస్మరించాడు. దీనితో అవకాశవాదులైన భజనపరులంతా రాజుగారి చుట్టూ చేరి పొగడ్తలతో తప్పుడు సలహాలతో తమ ప్రతాపాన్ని చూపించేవారు.

11/25/2017 - 21:09

ఆరేడు నెలల పిల్లలకు జరగబోయే, జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని, ఊహించుకునే శక్తి ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సంభావ్య పరిణామాలను ఊహించగలిగే శక్తి వారికి ఉంటుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఆరేడు నెలలప్పుడు ఎదురయ్యే ముప్పును పసిగట్టగలగడం, వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచించడం వారికి చేతనవుతుందని వారు అంచనావేస్తున్నారు.

11/25/2017 - 21:08

రాజ్యాల మధ్య యుద్ధమంటే అందులో రాజుల కంటే సైనికుల పాత్రే అధికంగా ఉంటుంది. కదన రంగంలో భీకరంగా పోరాడి తమ దేశ జయాపజయాలను నిర్ణయించేది ఆ సైనిక పాటవమే. అయితే ఎవరైనా రాజులా జీవించడానికి ఆసక్తి చూపుతారు గానీ, సైనికులై యుద్ధ్భూమిలో కదం తొక్కాలని ఆశించరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజల్లోనూ కనిపిస్తుంది.

11/25/2017 - 21:08

రామారావు, జగదీష్ బాల్యమిత్రులు. పెళ్లై పిల్లలు కలిగినా వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వేళలో జగదీష్ తండ్రికి జబ్బు చేసింది. వైద్య ఖర్చులకు డబ్బు అవసరం అయింది. ఎవరిని అడిగినా అప్పు పుట్టలేదు. జగదీష్ దిగులు పడ్డాడు. తండ్రి పరిస్థితి చూస్తూ కుమిలిపోయాడు. రామారావు జగదీష్ దీన స్థితికి చలించిపోయాడు. అతడిని ఓదార్చాడు.

11/25/2017 - 21:07

మెదడు చురుకుగా పనిచేయడానికి కొన్ని రకాల ఆహారం, మరికొన్ని రకాల మందులను వినియోగించాల్సిన పని ఇక లేదు. శరీరానికి పనిచెప్పి స్వేదం చిందిస్తే చాలు మీ మెదడు చురుకుగా మారిపోతుందట. నిజానికి వ్యాయామంతో మెదడు ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుందని తాజా అధ్యయనం స్పష్టంగా చెబుతోంది.

11/25/2017 - 21:06

మోహిత్ లఖానీ ఢిల్లీకి చెందిన నైపుణ్యవంతుడైన డిజైనర్. అంతే కాకుండా అతను చక్కని చిత్రకారుడు కూడా. అతను పేపర్‌తో ఎన్నో అందమైన ఆకృతులకు జీవం పోసాడు. ఇన్ఫోగ్రాఫిక్, మోషన్ ఇన్ఫోగ్రాఫిక్, డాటా విజువలైజేషన్, కాంటెపరరీ ఆర్ట్, ఫొటోగ్రఫీల్లో నిష్ణాతుడైన లఖానీ పేపర్ స్కల్పచర్ ప్రక్రియలో అందె వేసిన చేయిగా పేరు గడించాడు.

11/25/2017 - 21:06

ఒక రైతు దగ్గర రాము, సోము అనే ఇద్దరు పనివాళ్లుండేవారు. సాగు చేయడంలో రైతుకు సాయపడడమే వాళ్ల పని.
కష్టపడి పనిచేయడం, అందులో చిత్తశుద్ధి జోడించడం రాముకి అలవాటు. సోము మాత్రం పనిలో నటన కనబరచి పొగడ్తలతో యజమానిని బుట్టలో పడేసేవాడు.
పొగడ్తల రుచి మరిగిన యజమాని సోముని మంచి పనివాడిగా గుర్తించి, సోమూ మాదిరిగా ఇంకా కష్టపడి పనిలో శ్రద్ధ చూపాలని రాముకి అప్పుడప్పుడు చీవాట్లు పెడుతుండేవాడు.

11/25/2017 - 21:05

మనిషికి శుభ్రతపై శ్రద్ధ ఎక్కువే. మిగతా జంతువులతో పోలిస్తే ఆరోగ్యం కోసం శుచిశుభ్రతకు మానవులు కాస్తంత ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం పరిపాటి. అసలు నిద్రలేస్తూనే మనం పళ్లు తోముకోవడంతో శుభ్రతను పాటించడం మొదలుపెడతాం. ఇక శరీరం, తల, పట్టలు, ఇల్లూవాకిలి ఇలా అన్నింటినీ వీలైనంత మంచి వాతావరణంతో, పరిశుభ్రతతో ఉండేలా చూస్తూంటాం. కాస్తంత బద్దకస్తులైతే చెప్పలేంగాని ఎక్కువమంది దీనికి ప్రాధాన్యత ఇస్తారు.

11/25/2017 - 20:42

ఈరోజుల్లో పోల్చుకోవడం మరీ ఎక్కువై పోయింది. పోల్చుకుంటే పర్వాలేదు. పోల్చుకుని బాధపడటం మరీ ఎక్కువ అవుతోంది.
చాలామంది ఇతరుల ఆస్తిపాస్తులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఇతరుల అందచందాలని చూసి రంగును చూసి బాధపడుతూ ఉంటారు.

11/18/2017 - 21:06

పర్షియాలో రబియా సుప్రసిద్ధురాలయిన సూఫీ మార్మికురాలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞాని. ఆమెను అందరూ ఎంతో గౌరవించేవాళ్లు.

Pages