S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

10/01/2016 - 02:52

‘బ్రహ్మ భూయాయ కల్పతే’ - అంటూ ముగుస్తుంది భగవద్గీతలోని పద్దెనిమిదో అధ్యాయ యాభై మూడో శ్లోకం. ఈ శ్లోకంలో గీతాచార్యుడు బ్రహ్మత్వం సిద్ధించడానికి మానవ తత్వం నుండి తొలగవలసిన ఎనిమిది లక్షణాలను మన ముందుంచుతాడు. నిజానికి ఈ అష్ట అంశలే మానవ అస్తిత్వాన్ని ఎరుకపరుస్తుంటాయి. ఇవి లేనిదే మానవ అవతారం మనలేదు - అని అనిపిస్తుంటుంది.
‘అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్

09/24/2016 - 23:27

కర్మాచరణ విషయంలో మన జ్ఞానం కూడా మూడు విధాల పురివిప్పుతుంటుంది - సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానాలుగా. సృష్టిలో విభిన్న జీవులు, ప్రాణులు, భూతాలు. అయితే వీటిని వేరువేరుగా కాక వాటి తత్వాన్ని విభక్తం కానిదిగాను, వినాశం లేనిదిగాను పరిగణించే జ్ఞానం కలిగి ఉండటమే సాత్విక జ్ఞానం. ఇలాకాక భిన్నంగా చూడటం రాజస జ్ఞానం. అల్పంగా చూడటం తామస జ్ఞానం.

09/10/2016 - 23:00

మన బుద్ధికి మూడు మార్గాలు. మన ధృతికి మూడు బాటలు.
మన జ్ఞానానికి మూడు రంగులు. మన కర్మకు మూడు వర్ణాలు.

08/27/2016 - 23:07

నవ అవతారంలో పైకి కనిపించేది దేహం... కనిపించనిది ఆత్మ. కనిపించే దేహం ఎన్నడో ఒకనాడు కనిపించకుండా పోతుంది. కనిపించని ఆత్మ మాత్రం ఈ దేహం వీడిన మరుక్షణం మరో విశ్వ ప్రకృతికి ప్రయాణమవుతుంది.. ఇలా విశ్వ ప్రకృతిలోని ఆత్మ వర్తనాన్ని మనం ‘మృత్యువు తర్వాతి జీవితం’ అంటుంటాం. అంటే, ఆత్మ ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతవరకు మనది మానవ జీవితం.. ఈ దేహాన్ని వీడిన తర్వాత అధిభౌతిక జీవితం.

08/20/2016 - 23:04

భౌతిక, అధిభౌతికల ‘కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం.. సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహు స్త్యాగం విచక్షణాః’ భగవద్గీత అష్టాదశాధ్యాయం ‘మోక్ష సన్యాస యోగం’లోని మొదటి శ్లోకంలో అర్జునుడు ‘సన్న్యాసస్య తత్త్వ మిచ్ఛామి’ - ‘త్యాగస్యచ’ ‘వేదితుమ్’ ... అంటే సన్యాస సత్యాన్ని, త్యాగ తత్వాన్ని స్పష్టపరచమని అడిగినపుడు, కృష్ణుడిచ్చిన సమాధానంలోని తొలి నిర్వచనమే ‘కామ్యానాం...’ అన్న ఈ రెండవ శ్లోకం.

08/12/2016 - 23:11

అవతార పరంపరలో మనది మానవ అవతారం. అయితే ఈ మానవ అవతరణతో మనం దేహరూపులం.. ఆత్మస్వరూపులం. నిజానికి ఆత్మకు రూపం ఉండదు కానీ దేహంలో కొలువై ఉండటంతో ఆత్మకూ స్వరూపాన్ని అంటగడుతున్నాం. అలాగే ఆత్మ నిర్గుణమే అయినా దాన్ని సగుణంగా పరిగణిస్తున్నాం.

08/06/2016 - 23:18

భూతలంలో కురుక్షేత్రం ఒక మహాసంగ్రామం.
మానవతనంలోనూ కురుక్షేత్రం నిరంతర సంగ్రామమే!
మానవ సమాజంలో, పోనీ సామూహిక నేపథ్యంలో కురుక్షేత్రం ఒక ప్రపంచ యుద్ధం అయితే వైయక్తికంగా అంటే మనలోని ప్రతి ఒక్కరి పరంగా కురుక్షేత్రం ఒక అంతర్యుద్ధం. ఈ కోల్డ్‌వార్‌కు ప్రతీకలే మన ఎమోషన్స్.
* * *

07/31/2016 - 00:19

అర్జునుడి శక్తియుక్తుల్ని ఆజ్ఞా ప్రాంగణానికి చేర్చితే తప్ప విశ్వజ్ఞత్వం అంది రాదు. విశ్వజ్ఞత్వంతో తప్ప ప్రతీ భౌతిక, అధిభౌతిక అంశా విశ్వాంస సమానం కాదు. అంటే విశ్వాసం లేనిదంటూ ఇటు భౌతికంలోనైనా, అటు అధిభౌతికంలోనైనా లేదు. ఆజ్ఞా ప్రాంగణంలో అందుకునే విషయాలన్నీ ప్రామాణికాలే! కాబట్టే అవి సత్యాలుగాను, పరమ ధర్మాలుగాను పరగణింప బడుతుంటాయి.

07/24/2016 - 06:43

‘నా తెలివితేటలకు కొదవలేదు.. నాకు అంతా తెలుసు’ అనుకోవటం పెద్ద పొరపాటు. అంటే జారుడుబల్లపై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ, జారిపోతూ బింకం ప్రదర్శించటం. నిజంగానే కాస్త పట్టు దొరకినా నిలదొక్కుకోవటం కష్టం. అర్జునుడు అన్నీ తెలుసును అనుకునే కురుక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. అంతటా తెలిసిన ప్రపంచమే. అయినా ఆ తెలిసిన ప్రపంచమే మళ్లీ తనను ప్రశ్నించింది. పునః సమీక్షించుకునేలా చేసింది.

07/10/2016 - 04:00

‘ఆత్మ సంస్థం మనఃకృత్వా న కించి దపి చిన్తయేత్’ - ఎటువంటి చింతనా లేకుండా మనస్సును ఆత్మలో స్థిరపరచాలి. అంటే, ఎటువంటి స్థితిలోను ‘ఆత్మ’ అంటే మనస్సు కాదు.

Pages