S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

07/02/2016 - 23:36

మన పరంగా ‘ఆత్మ’ అంటే జీవ ఆత్మ, పర ఆత్మ.
దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతకాలం జీవాత్మ.
దేహాన్ని చాలించిన తర్వాత పరమాత్మ.

06/18/2016 - 22:11

ఆత్మ... పరమాత్మ - ఏది ముందు? ఏది వెనుక?
ప్రకృతి... పురుషుడు - ఎవరిది ముందడుగు? ఎవరిది వెనకడుగు?
విత్తు.. చెట్టు - దేనిది తొలి రూపం? దేనిది మలిరూపం?

06/12/2016 - 02:39

పరమాత్మ అంటే దివ్యత్వ లోగిలి... అద్వితీయ స్థితి... అదృశ్య ప్రాంగణం... అమృత చైతన్య వాహిని.. మాయాతీతం.. పరంజ్యోతి... జ్ఞాన స్వరూపం.. జ్ఞాన గమ్యం.. జ్ఞేయం.. ఖగోళ స్థితులకు, భౌగోళిక స్థితులకు మూలం.. సకల జీవరాశికి, ఆత్మజీవులకు పుట్టిల్లు... చరాచర హృదయ స్థితం.. అందుకే ఈ పారలౌకిక అవిభక్త స్థితిని ‘బీయింగ్’ అంటుంటాం.

05/21/2016 - 21:54

ఆత్మ అస్తిత్వానికి రెండు ముఖాలు.. ఆత్మ! పరమాత్మ!!
జీవాత్మకు నెలవు దేహం.. పరమాత్మకు నెలవు విశ్వం.
జీవాత్మ చరించేది ప్రవృత్తిలో.. పరమాత్మ వర్తించేది ప్రకృతితో.
ప్రవృత్తి అంటే మానసిక ఆచ్ఛాదనలోని భౌతికత.
ప్రకృతి అంటే సృష్టి విన్యాసానికి చెందిన అధిభౌతికత.

05/08/2016 - 06:35

‘జితాత్మనః ప్రశాస్తస్య పరమాత్మా సమాహితః’
‘జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః’
‘యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః’
-ఆత్మ పరమాత్మ అన్యం కాదు.
-వాసనా రహిత జీవనానికి పరమాత్మ అన్యం కాదు.
ఇలా ఆత్మ పరమాత్మలను అద్వైతంగా కాక ‘ఏకం’గా అంగీకరించటమే ఆత్మయోగం... భగవద్గీత చెప్పే ఆత్మ సంయమ యోగం.
* * *

05/02/2016 - 23:18

............
కర్మయోగ సాధకులకు ఈ
సమదృష్టి, సమభావనల
ఆవశ్యకత ఏమిటి? అంటే
సమస్థితచిత్తం వల్లనే వర్తమాన మానవ జన్మలోనే ఈ భౌతిక ప్రాపంచికతకు
అతీతం కాగలం.
...................

04/23/2016 - 22:51

మన జీవితం సకల గుణ శోభితం. సకల గుణాలంటే అన్నీ సగుణాలే అని కాదు... అన్ని గుణాల సమాహారం. గుణాలు అన్నంత మాత్రాన అన్నీ సద్గుణాలే అనుకుంటే ఎలా? నిజానికి మనం సద్గుణాలకు పుట్టిల్లే అయితే మన మానవ జన్మ ఇలా ఎందుకు సాగుతుంది? కాబట్టి ఎన్నో కొన్ని దుర్గుణాలు మన వ్యక్తిత్వంలో, మన వర్తనంలో దొర్లకపోవు. అయితే మన సద్గుణ సంపన్నత ముందు అవి లెక్కలోకి రావు.

04/10/2016 - 00:27

‘నేను’ అంటే మనస్సు + బుద్ధి + ఇంద్రియాలు.
ఈ మూడింటిపై ఆధిపత్యం నెరపగలది జీవాత్మ. ఈ మానవాత్మను సైతం చైతన్యపరచ గలది పరమాత్మ. పరమాత్మ అంటే పరమగతి, పరాకాష్ఠ. ఈ పరమ గతినే మనం పురుష శ్రేష్ఠుడు, పరమ పురుషుడు అని అంటున్నాం.

03/26/2016 - 21:22

జీవన గీతలో మనం ‘నిష్ఠా’గరిష్ఠులం. అటు జ్ఞానయోగం ద్వారా గానీ, ఇటు కర్మయోగం ద్వారా గానీ ఈ ‘నిష్ఠ’ సాధ్యమవుతుంటుంది. కర్మాచరణతోనే మనకు యోగనిష్ఠాసిద్ధి. దీనే్న నైష్కర్మ్యం అని అంటుంటాం.
‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మ కృత్
కార్యతే హ్యవశః కర్మ స్వరః ప్రకృతి జైర్గుగైః’

03/20/2016 - 00:27

ఇహం + పరం = నేను
జీవాత్మ + పరమాత్మ = మానవాత్మ
కాలంతో వ్యక్తి చైతన్యం
కాలాతీతంగా విశ్వచైతన్యం
ఇహ చైతన్యం జీవాత్మది... అంటే భౌతిక చైతన్యమంతా దేహంలోని వ్యక్తి ఆత్మదే.
పర చైతన్యం విశ్వాత్మది... అంటే ప్రకృతి చైతన్యమంతా ప్రకృతిగా రూపుదాల్చిన పరమాత్మది.
అందుకే జీవాత్మది వ్యక్తి ధర్మం లేదా భౌతిక చైతన్యం అవుతుంటే పరమాత్మది విశ్వ లేదా ప్రకృతి ధర్మం అవుతోంది.

Pages